ఐ ఫోన్ కోసం కిడ్నీ అమ్మకానికి పెట్టిన ఘనుడు !

కొత్త కొత్త టెక్నాలజీలు అందు బాటులోకి వస్తున్నాకొద్దీ వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు కొందరు. ముఖ్యంగా సెల్ ఫోన్ ఇంటర్ నెట్ పిచ్చి తో కొందరు ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. అట్లాంటి ఓ ఘనుడు పిచ్చి పీక్స్ కు వెళ్ళి ఐఫోన్ కోసం కిడ్నీ అమ్మకానికి పెట్టాడు. ఐఫోన్ కొనేలనే కోరిక అతని ప్రాణాలమీదకు తెచ్చింది. చైనాలోని జాంగ్‌గ్జూ అనే రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. హువాంగ్ అనే 17 ఏళ్ల యువకుడు కిడ్నీ అమ్మడం కోసం ఆన్‌లైన్‌లో బ్రోకర్‌ను సంప్రదించాడు. అంతేకాకుండా ఆస్పత్రికి వెళ్లి టెస్టులన్నీ చేయించుకున్నాడు. హువాంగ్‌కు వ్యూ అనే స్నేహితుడున్నాడు. అతడికి ఈ విషయం తెలిసింది. విషయం తెలిసిన వెంటనే వ్యూ, హువాంగ్‌ను వారించాడు. అయినా హువాంగ్ తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. దీంతో వ్యూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కిడ్నీ సేకరించడానికి సిద్ధమైన ఆస్పత్రి సిబ్బందిని, బ్రోకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
No comments:
Post a Comment