మాజీ ఎంఈవో కు ఘన సన్మానం
రెబ్బెన మండలలో గతంలో మండల విద్యాధికారిగా విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్ళిన మండల విద్యాధికారి మహేశ్వర్ రెడ్డికి స్థానిక ఎంపిడీవో కార్యాలయంలో వీడ్కోలు సమావేశం నిర్వహించి ఘనంగా సన్మానించారు. వారు పని చేసిన ఏడాది కాలంలో విధ్యాభివృద్ధికి తనవంతు కృషి చేశారని అందరు ప్రశంశించారు. అందరితో స్నేహ పూర్వకంగా మెలుగుతూ స్నేహ దృక్పథంను ప్రదర్శిస్తూ మండల విద్యాధికారిగా అందరి మన్ననలను పొందారని అన్నారు. ఈ కార్యాక్రమంలో ఎంపీపీ కే,సంజీవ్ కుమార్, జడ్పిటీసి అజ్మెర బాబురావు, ఎంఈవో వెంకటేశ్వర స్వామి, ఎంపిడీవో ఎంఏ హలీం, ఎమ్మార్వో రమేష్ గౌడ్, మరియి పీఆర్టియి నాయకులు, మండల ఉపాధ్యాయిలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment