Monday, 14 September 2015

13వ రోజుకు చేరిన ఆశాకార్యకర్తల నిరసనలు



ఆశాకార్యకర్తల నిరవదిక సమ్మెలో భాగంగా రెబ్బెన మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆశాకార్యకర్తలు చేస్తున్న దీక్షలు సోమవారంతో 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా చీపురుతో ఊడుస్తూ నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.15వేల వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు దీక్షవిరమించేది లేదని అన్నారు.ఈకార్యక్రమంలో సీ,అయ్,టీ,యు మండల అధ్యక్షురాలు అనిత, ఉపాధ్యక్షుాంలు రమ ఆశాకార్యకర్తలు రాజేశ్వరి, స్వప్న, కవిత, నిర్మల,చాయ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment