Wednesday, 2 September 2015

కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం




రెబ్బెన మండలంలో గోలేటి లో బుధవారం కేంద్ర ప్రభుత్వం విద్యావ్యతిరేక విధానాల ను అవలంభించడాన్ని నిర సిస్తూ ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ ఎఫ్‌ సంఘాల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా ఏఐవైఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఉపేందర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరన్నర అయినప్పటికి ఖాళీపోస్టులను బర్తీ చేయకుండా కాలాయాపన చేస్తుందన్నారు. విద్యారంగాన్ని నీరుగార్చేవిధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను బర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం స్పందిం చి విద్యార్థులకు, కార్మికులకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి పొన్న శంకర్‌, ఏఐఎస్‌ఫ్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దుర్గం రవీందర్‌ , మండల అధ్యక్షులు సాయికిరణ్‌, జిల్లా నాయకులు కస్తూరి రవికుమార్‌, విద్యార్థి యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు

No comments:

Post a Comment