విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం
రాష్రంలో నెలకొన్న విద్యారంగా సమస్య లు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎ,అయ్,ఎస్,ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ అన్నారు. ఈ సందర్బంగా రెబ్బెన మండలంలోని గోలేటి లో సీపిఅయ్ కార్యాలయంలో మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్న నేటి వరకు విద్యార్థులకు పూర్తి స్తాయిలో పాట్యపుస్తకాలు అందించలేదన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించకపోవడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. రాష్రంలో ఖాళీగా ఉన్న డీఈవో, ఎంఈవో, వార్డెన్ ,వాచ్ మెన్ ,కమిటి తదితర పోస్టులు భర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో విద్యార్ధుల పాత్ర కీలకమని చెప్పిన కెసీఆర్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఎ,అయ్,ఎస్,ఎఫ్ గా ఖండిస్తున్నామన్నారు. కేజీ నుంచి పీజీ ఉచిత పై నేటి వరకు నిర్దిష్ట ప్రణాళిక ప్రారంభించకుండా ఉండడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఎ,అయ్,ఎస్,ఎఫ్ ఆద్వర్యంలో దశల వారిగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎ,అయ్,ఎస్,ఎఫ్ మండల అభ్యర్ది ,కార్యదర్శులు కస్తూరి రవీందర్ ,పుదారి సాయికిరణ్, తదీతరులు పాల్గోన్నారు.
No comments:
Post a Comment