గుడుంబా నిషేదానికి ప్రతివొక్కరు సహకరించాలని ఎక్ష్సిజ్ అధికారి సిఐ ఫకీర్ అన్నారు. రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామపంచాయితిలో మంగళవారం నాడు గుడుంబా నిషేధం పై ర్యాలి చేపట్టి ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఎక్ష్సిజ్ అధికారులు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యార్థులు,నాయకులు పెద్ద సంఖ్యలోపాల్గొని గుడుంబా వల్ల కుటుంబాలు చిన్న బిన్నం అవుతున్న తీరును వివరించారు.గుడుంబా తయారీ నిషేధం పై అవగాహన కల్పించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కొత్త గా ప్రవేశపెట్టిన కోరారు గుడుంబా వల్ల పీడిత ప్రజలు ఆకాల మరణాలు చెందుతున్నారని దీని వల్ల కుటుంబాలు రోడ్ న పడుతున్నారాని సి ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సుందరసింగ్ తో పటు సిబ్బంది మరియు గ్రామా ఉపసర్పంచు రవినాయక్,సేవలాల్ కమిటి అద్యక్షులు దుప్పనయాక్,బలరాం నాయక్,రవి,దిలీప్,రవి,మోహన్ మరియు స్థానిక ప్రజలు పాల్గున్నారు.
No comments:
Post a Comment