ఎన్టీఆర్ కాలనీలో పురుగుల నీళ్ళు
మంగళవారం నాడు ఉదయం రెబ్బెనలోని ఎన్టీఆర్ కాలనీలో బొడ్డు కిష్టయ్య పలు కుళాయిలు తిప్పగా పురుగులు వచ్చాయని కాలనీవాసులు ఆవేదన చెందారు. ఈ విషయాన్నీ వార్డ్ మెంబర్ మోడెం చిరంజీవి గౌడ్ కు చెప్పగా ఆయన సర్పంచ్ పెసరు వెంకటమ్మ దృష్టి తీసుకెళ్ళారు. అనంతరం పంచాయితి కార్యదర్శి రవీందర్ మరియి ఎంపీడీవో ఎంఏ హలీం కాలనీని పరిశీలించారు. వారు మాట్లాడుతూ గత నెల 30 న ట్యాంక్ లో క్లోరినేషన్ చేపట్టామని అయినా ఇలా జరగడానికి గల కారణాలను, కాలనీలోని పైపు లైను ను పరిశీలిస్తామని, ఇటువంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని తేలిపారు.
No comments:
Post a Comment