కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 31 : జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా రెబ్బెన మండలం నక్కల గూడ ప్రాథమిక పాఠశాలలో స్వతంత్ర భారతావనికి తొలి హోం మంత్రిగా పని చేసిన " ఉక్కు మనిషి"" సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 143 వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ జిల్లా పి ఆర్ టి యు అధ్యక్షులు ఏటుకూరి శ్రీనివాస రావు హాజరై సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ భారతదేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవిత చరిత్రను తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు పటేల్ కృషి వల్లే ఆనాడు హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయిందని అన్నారు. పాఠశాల విద్యార్థులకు స్వీట్లు .నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది . పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే శంకర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి జాతీయ నాయకుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు మంచి క్రమశిక్షణ తో ఉన్నతంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమానికి పిఆర్టియు జిల్లా ఉపాధ్యక్షులు సదానందం, ఖాదర్ మొయినుద్దీన్, మండల ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, మండల జనరల్ సెక్రటరీ అనిల్ పాఠశాల ఉపాధ్యాయులు డి.రమేష్ మరియు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మీసాల పోషమల్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొ,న్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Wednesday, 31 October 2018
కార్మిక చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలం : బోగే ఉపేందర్.
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 31 : ఏఐటీయూసీ పోరాడి సాధించిన కార్మిక చట్టాలను అమలు చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమైందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు,బుధవారం ఏఐటీయూసీ 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెబ్బన మండలంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఏఐటీయూసీ జెండాను గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు రాచకొండ రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ1920 అక్టోబర్ 31 ముంబయి లో ఏఐటీయూసీ అవిర్భహించిందని ,దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో,తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏఐటీయూసీ కీలకపాత్ర పోషించిదని,నాటి నుండి నేటి వరకు కార్మిక హక్కుల కోసం, ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసిందని అన్నారు,కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను,హక్కులను, అమలు చేయకుండా శ్రమదోపిడికి గురిచేస్తున్నారని అన్నారు.దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు,కార్మికులను కనీస వేతనం 18000 ఇవ్వాలని,ఈ ఎస్ ఐ , పి ఎఫ్ సౌకర్యం కల్పించాలని అన్నారు,కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని,బోనస్ చెల్లించాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు నెల నెలా వేతనాలు ఇవ్వాలని అలాగే ముఖ్యమంత్రి హామీ మేరకు నెలకు రూపాయలు 8500 ఇవ్వాలని,అలాగే ఆటో డ్రైవర్సుకుప్రమాద భీమా 10 లక్షలు ఇవ్వాలని,ఇన్సూరెన్స్ ప్రీమియం ను ప్రభుత్వమే భరించాలని అన్నారు ఐ ప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తామన్నారు.. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిల్లా నర్సయ్య, సీపీఐ రెబ్బన కార్యదర్శి రామడుగుల శంకర్,గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి దుర్గం వెంకటేష్,ఉపాధ్యక్షుడు గోగర్ల శంకర్,లాలూ సింగ్,ప్రకాష్,ఆటో వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రాజగౌడ్,కార్యదర్శి మహేష్,నాయకులు కే. శ్రీనివాస్,సతీష్,చోటు లతోపాటు తదితరులు పాల్గొన్నారు
అభివృద్ధి కోసం తెరాస ను మళ్ళీ గెలిపించాలి : కోవలక్ష్మి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 31 : అభివృద్ధి కోసం తెరాస ను మళ్ళీ గెలిపించాలని తాజా మాజ ఎం ఎల్ ఏ కోవలక్ష్మి అన్నారు. బుధవారం రెబ్బెన మండలం తక్కెళ్లపల్లి, రొల్లపాడు పులికుంట, పత పులికుంట, రోడ్ పులికుంట గ్రామాలలో గడపగడపకు వెళ్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ తక్కల్లపల్లి, రొల్లపాడు, గ్రామాలకు బీటీ రోడ్ శాంక్షన్ చేశామన్నారు. పనులు తొందరలోనే మొదలౌతాయన్నారు. తెలంగాణ ప్రజలకు ఇంతవరకు దేశంలో ఎవరు అమలు చేయని వివిధ సంక్షేమ పథకాలను ప్రకటించి అమలుచేస్తున్న ప్రభుత్వం ముఖ్య మంత్రి కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణా ప్రభుత్వమేనని అన్నారు. తెలంగాణ కోసం అహోరాత్రులు శ్రమించి సాధించుకున్న తెలంగాణాను బంగారు తెలంగాణా గా మార్చడానికి ముఖ్య మంత్రి కెసిఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. నాలుగు సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత పాలకులు చేయలేని అభివృద్ధిని చేసి చూపించిందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి రెండు పంటలకు 4 వేల చొప్పున 8 వేలు ఇచ్చామని అన్నారు. ఈ ఎన్నికలలోత్ర్సపార్టీ ని గెలిపించినట్లైతే ఈ సాయాన్ని 10 వేలకు పెంచుతామన్నారు. రైతు బీమాను దేశంలో మొదటి సారిగా రైతులకు పైసా ఖర్చు లేకుండా ప్రెవేశపెట్టామన్నారు. పేదలకు కంటి వెలుగుకార్యక్రమం కింద ఉచిత కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలను కూడా ఇచ్చేకార్యక్రమాన్ని అమలు చేశామన్నారు. ప్రతి గ్రామానికి బి టి రోడ్ సౌకర్యం కలిగించామన్నారు. గతంలో కాంగ్రెసుప్రభుత్వహయాంలో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి వేలకోట్లు నాయకులూ దండుకున్నారని అన్నారు, తెరాస ప్రభుత్వం పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లుకట్టించే పథకం అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అనునిత్యం అడ్డు పడటానికి, పదవి కాంక్షతో, మహాకూటమిని ఏర్పాటు చేసుకొని టిడిపితో కాంగ్రెస్, తెలంగాణ జన సమితి, సిపిఐ పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని, ప్రజలు గమనించి ఎన్నికల్లో మహాకూటమికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. సంక్షేమ పథకాలు ఇక ముందు అమలు కావడానికి టీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆదరించి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమానికి మండలం నుంచి కార్యకర్తలు, నాయకులూ పెద్దఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, జడ్పీటీసీ బాబు రావు, ఎంపీపీ సంజీవ్ కుమార్, జడ్పీటీసీ బాబురావు, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కుందారపు శంకరమ్మ, మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు , గజ్జెల సుశీల, చిన్నయ్య, ఉద్యమకారులు నవీన్ జైస్వాల్, చిరంజీవి, సోమశేఖర్, సుదర్శన్ గౌడ్, మన్యం పద్మ, అన్నపూర్ణ అరుణ, బొమ్మినేని శ్రీధర్, మాణిక్య రావు, , సంగం శ్రీనివాస్, తదితర నాయకులు ఉన్నారు.
రిటైరయినా ఉద్యోగులుకు సన్మానం
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 31 : సింగరేణి కంపెనీ లో 42 సంవత్సరాల పాటు సుధీర్ఘ కాలం సేవలందించిన శ్రీ టి. రాజేశ్వరరావు, హెడ్ ఓవర్ మెన్ పదవి విరమణ సందర్భంగా డోర్లి ఒసిపి.1 నందు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రాజెక్ట్ అధికారి శ్రీ పురుశోత్తం రెడ్డి మాట్లాడతూ టి. రాజేశ్వరరావు శేష జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు మరియు టర్మినల్ బెనిఫిట్స్ ద్వారా వచ్చిన డబ్బులను పొదుపు చేసుకొని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. . ఈ కార్యక్రమం లో గని మెనేజర్ శ్రీ ఉమాకాంత్ , ప్రాజెక్ట్ ఇంజనీర్ సీతారామం , ఇంజనీర్లు చుక్కయ్య, వసంత్ కుమార్, వేణుగోపాల్ రావు, తేజ, సంక్షేమాధికారి వేణు, డి వై మేనేజర్లు సుమన్, సునీల్, అండర్ మెనేజర్ శ్రీరాములు ,సర్వే ఆపీసర్ రామ్మోహన్ ,తె.బొ.గ. సం పిట్ సెక్రెటరి డి. నర్సింగరావు, జి. ఎం. స్ట్రక్చర్ కమిటీ సభ్యుడు ఎం. సమ్మయ్య, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గోన్నారు. అనంతరం శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి (జాతీయ ఐక్యత దినోత్సవం) సందర్భంగా “జాతీయ ఐక్యత ప్రతిజ్ణ” కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
Tuesday, 30 October 2018
ఎన్నికల ప్రేత్యేక చెక్ పోస్ట్ తనిఖీలలో నగదు లభ్యం
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 30 : రెబ్బెన మండలం లోని గోలేటిక్రాస్ రోడ్ వద్ద ఎన్నికల నిమిత్తం నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్ పోస్ట్లో మంగళవారం వాహనాల తనిఖీల్లో రెండు వేరు వేరు ఘటనల్లో మొత్తం 42.88 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. ముందుగా గోలేటి నుండి రెబ్బెన వైపు వెళ్తున్న కావూరి రాజేందర్ గౌడ్ ద్విచక్ర వాహనంలో రూపాయలు 2,88,500 లక్షల నగదును తరలిస్తుండగా పోలీసులు తనిఖీల్లో బయటపడ్డాయి. పట్టుబడిన నగదుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు అందుబాటులో లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని తహశీల్దార్ సయ్యద్ ఇంతియాజ్ కు సమాచారం అందించారు. పట్టుబడిన నగదునుసీజ్ చేసినట్లు తెలిపారు. బొలెరో వాహనంలో తరలిస్తున్న40 లక్షల నగదును పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. మంచిరియల్ నుండి సిర్పూరు యు వెళ్తున్న నగదును పోలీసులు తహశీల్దార్ ఇంతియాజ్, సి ఐ రమణమూర్తి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. పట్టుబడిన నగదును తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుండి సిర్పూర్ యు బ్రాంచ్ కు తీసుకువెళ్తున్నట్టు తెలవడంతో నగదును వదిలేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దికొండ రమేష్, ఎస్సై దేవ్ రావ్, ఆర్ ఐ ఊర్మిళ, రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
స్వచ్ఛ భారత్ మిషన్ ను సఫలీకృతం చేయాలి :డి ఆర్ డి ఓ వెంకట్
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 30 : స్వచ్ఛ భారత్ మిషన్ ను సఫలీకృతం చేయడానికి గ్రామాలలో మరుగు దొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకట్ అన్నారు. మంగళవారం రెబ్బెన మండలం లోని తుంగేడ , గంగాపూర్ మరియు రెబ్బెన గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటికి వెళ్లి మరుగు దొడ్ల నిర్మాణ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. నిర్మాణంలో ఉన్న మరుగు దొడ్ల ను పరిశీలించి వాటిని త్వరిత గతిన పూర్తి చేసేటట్లు చూడాలని అన్నారు. మరుగు దొడ్లు ప్లాన్ ప్రకారం కట్టుకోవాలని సూచించారు.అనంతరం రెబ్బెన మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఎస్ బి ఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ వెంకటయ్య,ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్, స్వచ్ఛ భరత్ మిషన్ సభ్యులు ప్రశాంత్, ఫణి., ఏపిఓ కల్పన, పంచాయతీ సెక్రటరీ వంశీ, శ్వేతా తదితరులు పాల్గొన్నారు.
ఆన్ పైడ్ అప్రెంటిస్ షిప్ అవకాశం
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 30 : మైనింగ్ లో బి టెక్, డిప్లొమా చేసిన సింగరేణి కార్మికుల, పిల్లలకు ఆన్ పైడ్ అప్రెంటిస్ షిప్ లుగా తీసు కోవడానికి సింగరేణి సంస్థ నిర్ణయించిందని బెల్లంపల్లి ఏరియా డిజిఎం పర్సనల్ కే కిరణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణి సంస్థ లో ఏరియా ప్రకారం ఉద్యోగుల పిల్లలు ఆయా ఏ రేయాలలోని పర్సనల్ డిపార్ట్మెంట్లలో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. ఈ శిక్షణ కోసం జనవరిలో రిజిస్టర్ చేసుకోవాలని అన్నారు. ఇంతకూ ముందు చేసుకున్న నమోదు పరిగణలోకి తీసుకోబడద న్నారు. కావున ఆసక్తి గలవారు కార్యాలయంలో సంప్రదించవచ్చని అన్నారు.
ఎన్నికల్లో మహాకూటమికి తెరాసకు బుద్ది చెప్పాలి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 30 : ఎన్నికల్లో మహాకూటమి కి తెరాసకు ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ది చెప్పాలని బిజెపి ఆసిఫాబాద్ పార్లమెంటు కన్వీనర్ అజమిరా రామ్ నాయక్, అసెంబ్లీ కన్వీనర్ గుల్బమ్ చక్రపాణిలు అన్నారు మంగళవారం రెబ్బెన లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజక వర్గంలో బిజెపిని గెలిపించాలన్నారు. ప్రజలు బిజెపిని ఆదరించి ఆసిఫాబాద్ బిజెపి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. నరేంద్ర మోడీ ప్రెవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ తెలంగాణా రాష్ట్రంలో కూడా బీజేపీ ని అత్యధిక మెజారిటీ తో గెలిపిస్తే మరెన్నో పథకాలను ప్రజలకు సమాన అవకాశాలతో ప్రెవేశ పే డతామని అన్నారు..ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ సుదర్శన్,మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Monday, 29 October 2018
తెరాస పార్టీ కార్యాలయ ప్రారంభం
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 29 ; రెబ్బెన మండల కేంద్రంలో తెరాస పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని సోమవారం తాజా మాజీ ఎం ఎల్ ఏ కోవలక్ష్మి ప్రారంభించారు. అనంతరం మండలంలోని నంబాల, నార్లాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారకార్యక్రమాన్ని నిర్వహించారు. గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టిందన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో పాటు రైతు బందు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళల పెన్షన్లు పెంచి ఇవ్వడం జరుగుతోందని రానున్న ఎన్నికల్లో తెరాస ను గెలిపిస్తే మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడతామని , నిరుద్యోగ భృతి కల్పిస్తామని రైతు బందు సహాయాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. టిఆర్ఎస్ ను ఓడించాలనే ఉద్దేశ్యంతో భావ సారూప్యం లేని నాలుగు పార్టీలు కలిసి మహాకూటమి పేరుతో ఎన్నికలకు వస్తున్నాయన్నారు. అది మహాకూటమి కాదని మాయా కూటమి అని వారిని గెలిపిస్తే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు . ముఖ్యంగా కొమరంభీం జిల్లాలో జిల్లా ను సాధించి ప్రజల వద్దకే పాలన తీసుకురావటం జరిగిందని అన్నారు. గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మించామన్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంజీవ్ కుమార్,,జడ్పీటీసీ బాబు రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి , మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు శంకరమ్మ,టిబిజికేస్ ఏరియా ఉపాధ్యక్షులు శ్రీనివాస రావు, నవీన జైస్వాల్, సోమశేఖర్, రాజేశ్వర్రావు, , చిరంజీ గౌడ్,పెసర వెంకటమ్మ, పెసర మధునయ్య, మన్యం పద్మ, సురేష్ జైస్వాల్, సుదర్శన్ గౌడ్, మాణిక్యా రావు, తదితరులు ఉన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు నమోదుపై అవగాహన
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 29 ; ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు నమోదు పీఆర్టీయూ రెబ్బెన పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు రెబ్బెన మండల నంబాల గంగాపూర్, నవేగం తుంగడ కెజిబివి సింగరేణి గోలేటిలో ఓటు నమోదు పై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు ఏటుకూరి శ్రీనివాసరావు ప్రారంభించారు అర్హత గల ఉపాధ్యాయ అభ్యర్థులు ఫారం నెంబర్ 19 ద్వారా నమోదు అంశాలను వివరించడం జరిగింది ఒకటి పదకొండు రెండువేల పన్నెండు నుండి ఒకటి పదకొండు రెండువేల పద్ధెనిమిది కాలంలో కనీసం మూడు సంవత్సరాలు ఉన్న పాఠశాలల్లో పనిచేసిన ప్రతి ఉపాధ్యాయుడు అర్హులని తెలిపారు. నవంబర్ 6 తేదీ లోపు సంబంధించిన తహాశీల్దార్ కార్యాలయంలో నమోదు ఫారాలను సమర్పించవల్సిందిగా కోరారు. కరీంనగర్, మెదక్, ని జామాబాద్ ఆదిలాబాద్ శాసనమండలి ఉపాధ్యాయ అభ్యర్థిగా పీఆర్టీయుటీఎస్ అధికార అభ్యర్థి శ్రీ కూర రఘోత్తంరెడ్డిని మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ కొమురంభీం జిల్లా అధ్యక్షులు ఏటుకూరి శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె శంకర్ ,సుధాకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బి సదానందం, ఎస్ కే ఖాదర్, జిల్లా కార్యదర్శి లచ్చన్న, మండల అధ్యక్షుడు టి ప్రవీణ్, మండల ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్ కుమార్, మండల కార్యదర్శి కె శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.
సంఘవ్యతిరేక కార్యక్రమాలకు ప్రజలు దూరంగా ఉండాలి ; డి ఎస్ పి సత్యనారాయణ
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 29 ; సంఘవ్యతిరేక కార్యక్రమాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఆసిఫాబాద్ డి ఎస్ పి సత్యనారాయణ అన్నారు. రెబ్బెన మండలం లోని ఎడవల్లి గ్రామం లో జిల్లా ఎస్ పి ఆదేశాలమేరకు సోమవారం డి ఎస్ పి ఆధ్వర్యంలో రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్ రమణమూర్తి నేతృత్వంలో ఎస్సై దీకొండ రమేష్ సిబ్బందితో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఎస్ పి మాట్లాడుతూ గ్రామాలలో నిషేదిత గుట్కాలు అమ్మరాదన్నారు. బెల్ట్ షాపులు నిర్వహించరాదని అన్నారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలను నివారించాలన్నారు. గ్రామంలోని దుకాణాలలో 6 వేల విలువగల నిషేదిత గుట్కా,పొగాకు ఉత్పత్తులు లభ్యమయ్యాయని, నిషేదిత వస్తువులు అమ్ముతున్న ఇద్దరిపై కేసు నమోదుచేసినట్లు తెలిపారు. సరైన ధ్రువ పత్రాలులేని 50 మోటారుసైకిల్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారికి జరిమానాలు విధించినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ప్రజలు పోలీసులకు సహకరించాలని అన్నారు.
Sunday, 28 October 2018
మాజీ సర్పంచ్ తోట లక్ష్మణ్ సస్పెన్షన్ ఎత్తివేత
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 28 ; గోలేటి మాజీ సర్పంచ్ తోట లక్ష్మణ్ పై టీఆర్ఎస్ అధిష్టానం విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు టీఆర్ఎస్ పార్టీ మండల దక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ తాజా మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆదేశాల మేరకు తోట లక్ష్మణ్ పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు, తెరాస పార్టీలో యధావిధిగా కార్యకలాపాలు నిర్వహించొచ్చని అన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే తాజా మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి గెలుపు కోసం పార్టీ కార్యకర్తలందరూ కృషి చేసి నిరంతరం శ్రమించి గెలిపించాలన్నారు.
ప్రత్యేక చెక్ పోస్టులు వాహనాన్ని ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించాలి ; డిఎస్పీ సత్యనారాయణ
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 28 ; ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులో వాహనాలను ప్రత్యేక శ్రద్ధతో కుణ్ణంగా పరిశీలించాలని కుమ్రంభీం జిల్లా డిఎస్పీ సత్యనారాయణ సూచించారు. జిల్లా ఎస్ పి మల్లారెడ్డి ఆదేశాల మేరకు రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలోని గోలేటి ఎక్స్రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఎలక్షన్ చెక్ పోస్టు వద్ద జిల్లా ఎస్ పి మల్లారెడ్డి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైపు ఉండి ఆసిపాబాద్ వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలన తనిఖీ చేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి పలుసూచనలు చేశారు. వాహనతనిఖీలు అత్యంత పారదర్శంగా చేపట్టాలని సూచించారు. ప్రతి వాహనాన్ని పరిశీలించి పిదపే చెక్ పోస్టులో నుండి వదలాలని అన్నారు. ఓటర్లు ప్రభావితం చేసేలా డబ్బు, మద్యం అక్రమ రవాణా కాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు వాహనాల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బు రవాణా చేస్తే వెంటనే పట్టుకుని పోలీసులు ఉన్నతాధికారులు ఎలక్షన్ ప్రత్యేకాధికారులకు తెలియజేయాలన్నారు చెక్ పోస్టులో విధులు నిర్వహించే సిబ్బంది తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదన్నారు ఈ వాహనాల తనిఖీల్లో రెబ్బెన సిఐ వివి రమణమూర్తి ఎస్సై దికొండ రమేష్ తో పాటు తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు.
కుటుంబపాలన కబంధ హస్తాలను నుండి విముక్తి చేయాలి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 28 ; తెలంగాణా రాష్ట్రాన్నీ కుటుంబపాలన కబంధ హస్తాల నుండి విముక్తి చేయాలని ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు జ్ బి పౌడెల్ అన్నారు. మార్పు కోసం ఙప్ తలపెట్టిన చలో బిజెపి యువ గర్జన హైదరాబాద్ కార్యక్రమానికి కొమురం భీం జిల్లా నుండి భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కుటుంబ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన దర్శి కేసరి కేసరి ఆంజనేయులు గాడ్ ,ఠాగూర్ విజయ్, అసెంబ్లీ కన్వీనర్ కొంగ సత్యనారాయణ, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు యలమంచి సునీల్ చౌదరి, పార్లమెంట్ కో-కన్వీనర్ అజ్మేరా రామ్ నాయక్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కాండ్ర విశాల్, బి సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రాజు, బిజెపి మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ ,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి భాత్తిని రాము, గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లావుడియా హరిలాల్, బానోతు అరవింద్, అజ్మేర ఆత్మారాం నాయక్ తదితరులు ఉన్నారు.
Saturday, 27 October 2018
గంగాపూర్ అభివృద్ధిని అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 27 ; అభివృద్ధి నిధులు అందుబాటులో ఉన్న గంగాపూర్ లో అభివృద్ధి జరగకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా అని టిఆర్ఎస్ గంగాపూర్ పట్టణ అధ్యక్షుడు గుర్లె చంద్రయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. శనివారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గంగాపూర్ పంచాయతీ అభివృద్ధికి నిధులను ఎం ఎల్ ఏ కోవ లక్ష్మీ కృషితో ప్రభుత్వం 20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ మంజూరు చేస్తే గ్రామ సర్పంచ్ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు తీర్మానాలు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.తీర్మానాలు చేయకపోవడంతో నిధులు ఖర్చు కాకుండా వెనక్కి మల్లి పోయాయన్నారు.24 లక్షల డి ఎం ఎస్ నిధులతో సిసి రోడ్లు నిర్మించేందుకు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తే గంగాపూర్ లో అభివృద్ధి జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు దక్కని అక్కసుతో కలెక్టర్ను కలిసి పనులు జరగకుండా కుట్ర పన్నారన్నారు. మూడో దఫా అభివృద్ధి పనుల్లో భాగంగా గంగాపూర్ రోడ్డు మరమ్మత్తులకు ప్రతిపాదన సిద్ధం చేసిన ఘనత టి.ఆర్.ఎస్ దన్నారు. టిఆర్ఎస్ పార్టీ తోనే గంగాపూర్ లోని అన్ని వాడలలో అభివృద్ధి పనులు జరుగుతాయి తప్ప కాంగ్రెస్ పార్టీతో జరిగే అభివృద్ధి ఏమిలేదన్నారు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా 2 రోజుల క్రితం టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి కోవా లక్ష్మీ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. . రాబోయే ఎన్నికల్లో కోవా లక్ష్మీ నీ గంగాపూర్ ప్రజలు అధిక మెజారిటీ తో. గెలిపించుకుంటామని అన్నారన్నారు. టీఆర్ఎస్ పై అసత్య ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు తమ ఓటు హక్కుతో గుణపాఠం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో తెరాస నాయకులూ మధునయ్య, దుర్గం శ్రీనివాస్, ఆనందరావు, విలాస్, మనోహర్, జయరాం, తదితరులు ఉన్నారు.
సామూహిక శ్రీమంతం వేడుక
రెబ్బెన ; రెబ్బెన మండలం పులికుంట గ్రామం అంగన్వాడీ పాఠశాలలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం వేడుకను ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమి మండల సమాఖ్య బి లక్ష్మి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలని, పండు, ఆకుకూరలు తీసుకోవాలని అన్నారు. మన సంప్రదాయాన్ని అనుసరించి గర్భిణులకు శ్రీమంతం జరపడం ఆనవాయితీ అని ఈ వేడుక జరపడం ద్వారా గర్భిణులకు పండంటి బిడ్డ పుట్టాలని ముత్తైదువులు దీవిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పులికుంట గ్రామానికి చెందిన ఈ తిరుపతమ్మ, ఈ మమత లకు పలువురు ముత్తైదువులు స్వీట్లు తినిపించి దీవించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు ఈ స్వప్న, సహాయకురాలు బాయక్క,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ సిబ్బందికి వెంటనే వేతనాలు చెల్లించాలి ; భోగే ఉపేందర్
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 27 ; తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించి నెలనెలా వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. శనివారం రెబ్బెన లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో కూడా పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ముప్పై మూడు రోజులు కార్మికులు సమ్మె చేపట్టారని అప్పటికి ప్రభుత్వం ఇలాంటి సమస్యను తీర్చలేదని పంచాయతీ కార్మికులకు గత ఆరు నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని దీంతో కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించిందని జీతభత్యాలు లేకుండా విధులు నిర్వహిస్తూ నానా ఇబ్బందుల పడుతున్నారని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు గ్రామపంచాయతీల కార్మికులను పర్మనెంట్ చేస్తామని ఎన్నికల మానిఫెస్టోలో పెడుతున్నప్పటికీ వారి సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు. అలాగే కనీస వేతనం 18000 వేల రూపాయలు ఇవ్వాలని కార్మికుల కార్మికులందరికీ ఈ ఎస్ ఐ , పి ఎఫ్ సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రతి నెలా వేతనాలు చెల్లించే విధంగా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు సమస్యలు తీరని పక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని అన్నారు ఈ నెల ముప్పై ఒకటిన ఏఐటీయూసీ తొంభై తొమ్మిది వ ఆవిర్భావ దినోత్సవం ఉంటుందని జిల్లాలోని కార్మికులు, అసంఘటిత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చే చేయాలని కోరారు ఈ సమావేశంలో గ్రామ పంచాయితీ వర్కర్ యూనియన్ మండల ప్రెసిడెంట్ రమేష్, మండల కార్యదర్శి దుర్గం వెంకటేష్, ఉపాధ్యక్షులు గొర్ల శంకర్, సహాయ కార్యదర్శి పోశం తదితరులు పాల్గొన్నారు
Friday, 26 October 2018
అభివృద్ధి చేయలేక తెరాస నాయకుల సాకులు ; రెబ్బెన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముంజం రవీందర్
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 26 ; తెరాస నాయకులూ గత నాలుగేళ్ళ పాలనలో అభివృద్ధి చేయలేక సాకులు చెప్తుతు ప్రజలను మభ్య పెడుతున్నారని రెబ్బెన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముంజం రవీందర్ అన్నారు. శుక్రవారం మండలం గంగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెరాస నాయకులూ ఎన్నికల ప్రచార నిమిత్తమై శుక్రవారం పలు గ్రామాలలో పర్యటించి ప్రజలకు అవాస్తవాలు చెప్తున్నారన్నారు. ప్రజలు రోడ్ల దుస్థితిపై నిలదీయగా సర్పంచుల తీర్మానం లేక రహదారులను వేయలేకపోయామని సాకులు చెప్తున్నారని, అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయం లో ఏ సర్పంచుల తీర్మానం తీసుకోకుండానే పనులు పూర్తిచేశామన్నారు. అలాగే రెండవ తిరుపతిగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్న గంగాపూర్ గ్రామానికి 4.5 కోట్లతో రహదారి నిర్మాణానికి , విదుడికారణకు, దేవాలయం అభివృద్ధికి కృషిచేస్తామని చెప్పి ఆ దేమునికే పంగనామాలు పెట్టిన ఘనత ఈ తెరాస ఎం ఎల్ ఏ , ఎం ఎల్ సి ల దేనని అన్నారు. అభివృద్ధిని చేసి చూపించలేక ప్రజలు ఎదురు తిరిగి అడుగుతున్నఅందుకు కుంటి సాకులు చెప్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు ఈ విషయాలను జాగ్రత్తాగా గమనించి తెరాస పార్టీ కి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఎన్నికల ముందు దళితులు 3 ఎకరాల భూమి, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు, కే జి టూ పి జి ఉచితవిద్య, డబల్ బెడురూమ్ ఇండ్లు వంటి హామీలను పూర్తిగా మరచి , నిస్సిగ్గుగా మరల ఓట్లు అడగడానికి వచ్చిన వారికి ప్రజలు ఎన్నికలలో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దుర్గం రాజేష్, వెంకటేశం చారి, అనిసెట్టి వెంకన్న, ముంజం వినోద్, గుండె సంతోష్, నగరం భీం రావు, ఇగురాపు రవీందర్, రాజన్నా తదితరులు పాల్గొన్నారు.
గుడుంబా తయారీ స్థావరాలను ధ్వంసం
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 26 ; రెబ్బెన మండలం సింగల్ గూడ గ్రామంలో శుక్రవారం మద్యపాన నిషేధ శాఖ అధికారులు దాడి చేసి గుడుంబా తయారీ స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఆబ్కారీ సర్కిల్ ఇన్సపెక్టర్ మౌసీన్ అలీ తెలిపారు. జిల్లా ఆబ్కారీ అధికారి రాజ్యలక్ష్మి ఆదేశానుసారం ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడులలో గుడుంబా తయారీకి వాడే 80 కిలోల బెల్లం,100 లీటర్ల బెల్లం పానకం , 20 లీటర్ల గుడుంబా, 24 90 ఎం ఎల్ ఆఫీసర్ ఛాయస్, 5 బీర్ బాటిళ్లను ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి నిషేదిత మద్యాలను తయారీ చేయకూడదని అన్నారు. చట్టాన్ని అధిగమించిన వారికి కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. ఈ దాడులలో ఎస్సై విజయలక్ష్మి, హెడ్ కాన్స్టేబుల్ అశోక్, ఇస్ఫాక్ ఖురేషి, రమేష్, కిరణ్, సురేష్, రవి , తిరుపతి , నాగరాజు, మమతా, తిరుపతి పాల్గొన్నారు.
పోలీస్ ఉద్యోగార్థులకు శిక్షణా తరగతులు
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 26 ; పోలీస్ శాఖలో ఎస్సై మరియు కాన్స్టేబుల్ ప్రిలిమినరీ పరిక్షాలలో క్వాలిఫై ఐన ఉద్యోగార్ధులకు బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవ సంస్థ తరపున శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించినట్లు డిజిఎం పెర్సోనల్ కే కిరణ్ శుక్రవారం తెలిపారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి, మాదారంలలో ఈ శిక్షణ నవంబర్ 1 నుంచి ప్రారంభమౌతుందన్నారు. ఈ ఏరియా లోని ఉద్యోగార్థులు చేసిన విజ్ఞప్తికి జీఎం రవిశంకర్ సానుకూలంగా స్పందించి ఈ శిక్షణా తరగతులను నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. కావున ఆసక్తి గల, క్వాలిఫై ఐన అభ్యర్థులు తమ క్వాలిఫైయింగ్ లేటర్లతో జీఎం కార్యాలయంలోని పర్సనల్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు.
శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి ; ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్, కరీంనర్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 26 ; శాసనసభ ఎన్నికల్లో అసిఫాబాద్ నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి గెలిపించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్, కరీంనర్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ లు కోరారు శుక్రవారం రెబ్బెన మండలంలోని గంగాపూర్, లక్ష్మిపురం, పాసిగం , వరదలు గూడా తుంగేదా తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ చేపట్టిన ఎన్నికల ప్రచారంలో వారు మాట్లాడారు ఆయా గ్రామాల్లోగడప గడపకు తిరుగుతూ ఎన్నికలలో తెరాస అభ్యర్థిని గెలిపించాలని కోరారు. గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టిందన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో పాటు రైతు బందు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళల పెన్షన్లు పెంచి ఇవ్వడం జరుగుతోందని రానున్న ఎన్నికల్లో తెరాస ను గెలిపిస్తేనే పెన్షన్లు డబుల్ చేయడం జరుతుందన్నారు. లక్ష రూపాయల వరకు రైతుల రుణాన్ని మాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగ భృతి కల్పిస్తామని రైతు బందు సహాయాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. టిఆర్ఎస్ ను ఓడించాలనే ఉద్దేశ్యంతో నాలుగు పార్టీలు కలిసి మహాకూటమి పేరుతో ఎన్నికలకు వస్తున్నాయన్నారు. అది మహాకూటమి కాదని మాయా కూటమి అని వారిని గెలిపిస్తే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు . ముఖ్యంగా కొమరంభీం జిల్లాలో జిల్లా ను సాధించి ప్రజల వద్దకే పాలన తీసుకురావటం జరిగిందని అన్నారు. గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మించామన్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ విజయ్ రెడ్డి, అరిగల నాగేశ్వరరావు, ఎంపిపికి సంజీవ్ కుమార్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి , మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు శంకరమ్మ, నవీన జైస్వాల్, , సోమశేఖర్, రాజేశ్వర్రావు, భాస్కర్, నరేందర్ , చిరంజీ గౌడ్, పోచయ్య తదితరులు ఉన్నారు.
Thursday, 25 October 2018
అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలుపు ఖాయం : బీజేపీ జిల్లా అధ్యక్షులు జ్ బి పౌడెల్
రెబ్బెన : రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలుపు ఖాయమని ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు జ్ బి పౌడెల్ అన్నారు. గురువారం జిల్లాలోని అన్నిమండలాలలో భారీ బైక్ రల్ల్య్ నిర్వహించిన అనంతరం రెబ్బెన మండలంలోని గోలేటిలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో మాట్లాడారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు బీజేపీ కి పట్టంగట్టాడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. గత నాలుగేళ్ళ పాలనలో తెరాస ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టింది ఏమి లేదని, చేసిన హామీలైన దళితులకు మూడు ఎకరాల భూమి, పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాల ను కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు. ఈ సందర్భంగా పలు పార్టీలనుంచి బీజేపీ లో చేరిన యువకులను, నాయకులను కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్, బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎలమంచిలి సునీల్ చౌదరి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు విశాల్ ఖాండ్రే , పార్టీ మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి మల్రాజ్ రాంబాబు, అసెంబ్లీ కన్వీనర్ గుల్బమ్ చక్రపాణి, యువనాయకుడు అజమీర ఆత్మారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Sunday, 21 October 2018
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 3కే రన్
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 21 : పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో రెబ్బెన మండలం గోలేటి లో 3కే రన్ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్కిల్ ఇన్సపెక్టర్ రమణ మూర్తి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ,మాట్లాడుతూ పోలీసులు తమ విధినిర్వహణలో ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారని అన్నారు.వారి సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 న అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దీకొండ రమేష్ , సిబ్బంది, మండలంలోని యువకులు పాల్గొన్నారు.
ఎన్నికలలో బీజేపీ అధికారం లోకి వస్తుంది ; రామ్ నాయక్
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 21 : ఎన్నికలలలో బీజేపీ అధికారం లోకి వస్తుందని పార్లమెంట్ కో కన్వీనర్ అజమిరా రామ్ నాయక్ అన్నారు. ఆదివారం రెబ్బెన మండలం లో గడప గడప ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థిని అతధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సింగలగూడా లోనూతన కార్యకర్తలకు బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు. నరేంద్ర మోడీ ప్రెవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ తెలంగాణా రాష్ట్రంలో కూడా బీజేపీ ని అత్యధిక మెజారిటీ తో గెలిపిస్తే మరెన్నో పథకాలను ప్రజలకు సమాన అవకాశాలతో ప్రెవేశ పే డతామని అన్నారు. ప్రస్తుతం ప్రెవేశ పెట్టిన పథకాలకు నిధులన్నీ కేంద్రమే ఇస్తున్న, రాష్ట్ర ప్రభుత్వాం తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నాడని అన్నారు. ఈ కార్యకమంలో ఆసిఫాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుల్బమ్ చక్రపాణి, బీజేపీ మండల అధ్యక్షులు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి రాంబాబు , ఇగురాపు సంజీవ్, మల్లేష్, రవీందర్, విజయ్, రాజేష్, సంతోష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Saturday, 20 October 2018
ఈవీఎం యంత్రాల పై అవగాహన కార్యక్రమం
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 20: ప్రతి ఒక్కరు ఈవీఎం యంత్రాల పై అవగాహన పెంచుకొని ఓటు హక్కు ను వినియోగించుకోవాలని రెబ్బెన మండల రెవిన్యూ ఇనస్పెక్టర్ ఊర్మిళ అన్నారు. రెబ్బెన మండల నంబాల గ్రామంలో ప్రజలకు ఎన్నికలలో ఉపయోగించే ఈ వి ఎం, వి వి ఫాట్ యంత్రాలపై గ్రామపంచాయతీ కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో యంత్రాల వినియోగ విధానం పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా దుర్గా మాత శోభాయాత్ర
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 20: శరన్నవరాత్రుల సందర్భంగా రెబ్బెన మండల కేంద్రంలో గత తొమ్మిది రోజులుగా మండలంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాన్ని ప్రజలు భక్తి శ్రద్దలతో పూజించుకొని శనివారం అత్యంత వైభవంగా నిమజ్జనానికి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా యువకులు తమదైన రీతిలో భజనలు చేసుకుంటూ మండల కేంద్రంలో అమ్మావారి విగ్రహాన్ని పురవీధులలో ఊరేగించారు. మహిళలు భక్తి శ్రద్దలతో అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం నిమజాన కార్యక్రమం నిర్వహించారు.
పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 20: పోలీసులు మీకోసం లో భాగంగా రెబ్బెన పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా శనివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రెబ్బెన మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని డి ఎస్ పి సత్యనారాయణ ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయస్థితిలో ఉన్నవారిని కాపాడవచ్చని, ప్రతిఒక్కరు రక్తదాన ఆవశ్యకతపై అవగాహన పెంచుకొని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అన్నారు. రక్తధానం చేయడం ద్వారా ఎటువంటి అనారోగ్యం కలగదని అన్నారు. ఈ కార్యక్రంలో సర్కిల్ ఇన్సపెక్టర్ రమణమూర్తి, ఎస్సై దీకొండ రమేష్ , సిబ్బంది, మండల తెరాస నాయకులు , యువకులు పాల్గొన్నారు.
Tuesday, 16 October 2018
దుర్గా దేవి ఆలయాలలో ప్రేత్యేక పూజలు
రెబ్బెన ; రెబ్బెన మండలం లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గా దేవి ఆలయాలలో ప్రేత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా నగర్లోని స్వయంభు మహాకాళి దేవాలయంలో హోమం నిర్వహించారు. అలాగే గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బగూడలో దుర్గా దేవికి ప్రేత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గోలేటి గ్రామంలో దుర్గా మాటకు మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. అలాగే గోలేటి 1 గని, దొర్లి ఓపెన్ కాస్ట్ ల వద్ద కార్మికులు దుర్గా మాతకు ప్రేత్యేకపూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆయా కార్యక్రమాలలో ఏరియా జీఎం రవిశంకర్, సేవాసమితి అధ్యక్షురాలు అనురాధ రవిహాన్కార్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస రావు, జడ్పీటీసీ బాబు రావు, అధికారులు, కార్మికులు , ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Sunday, 14 October 2018
తెరాసను గెలిపించి మహాకూటమికి తగిన గుణపాఠం నేర్పాలి ; ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్
కొమురంభీం ఆసిఫాబాద్ (రెబ్బెన) అక్టోబర్ 14 : తెరాస ప్రభుత్వం ప్రెవేశ పెట్టిన సంక్షేమ పధకాలు ప్రజలు గమనించి మహాకూటమికి తగిన గుణపాఠం చెప్పి ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఎం ఎల్ ఏ అభ్యర్థి కోవా లక్ష్మి లు అన్నారు. ఆదివారం తెరాస పార్టీ ప్రచారంలో భాగంగా రెబ్బెన మండలం వంకులం, నంబాల గ్రామాలలో పర్యటించి, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణా ప్రతిష్టను పెంచిన కెసిఆర్ ను ఓడించాలనే ధేయంతో తమ తమ సిద్ధాంతాలు మరచి పచ్చకండువా చంద్రబాబుతో పొత్తు పెట్టులాకొన్న కాంగ్రెస్ పార్టీ ని కాంగ్రెస్ పాలిట రాష్ట్రాలలో రైతు బంధు, రైతు భిమానా పథకాలను ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించాలన్నారు. ఎంతో కస్టపడి సాధించుకొన్న తెలంగాణాను మళ్ళి ఆంధ్రాలో కలిపేందుకు మహాకూటమి పేరుతొ ప్రజలను మోసగిస్తున్నారన్నారు. ప్రజలు గమనించి ఎన్నికల్లో మహాకూటమికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. తెలంగాణ కోసం అహోరాత్రులు శ్రమించి సాధించుకున్న తెలంగాణాను బంగారు తెలంగాణా గా మార్చడానికి ముఖ్య మంత్రి కెసిఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. నాలుగు సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత పాలకులు చేయలేని అభివృద్ధిని చేసి చూపించిందన్నారు రాష్ట్ర అభివృద్ధిని అనునిత్యం అడ్డు పడటానికి, పదవి కాంక్షతో, మహాకూటమిని ఏర్పాటు చేసుకొని టిడిపితో కాంగ్రెస్, తెలంగాణ జన సమితి, సిపిఐ పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని అన్నారు. సంక్షేమ పథకాలు ఇక ముందు అమలు కావడానికి రాబోయే ఎన్నికలలో ఎం ఎల్ ఏ అభ్యర్థి కోవలక్ష్మి కి ఓటేసి టీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆదరించి గెలిపించాలన్నారు. తెరాస పార్టీలో చేరిన పలువురు నాయకులకు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంజీవ్ కుమార్, జడ్పీటీసీ బాబురావు, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కుందారపు శంకరమ్మ, మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, రైతు అధ్యక్షులు నాగయ్య, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, నవీన్ జైస్వాల్, చిరంజీవి, సోమశేఖర్, గజ్జెల సత్య నారాయణ, వసంత రావు, వినోద్ జైస్వాల్, తదితర నాయకులు ఉన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీస్ ముందుంటుంది
కొమురంభీం ఆసిఫాబాద్ (రెబ్బెన) అక్టోబర్ 14 : ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోలీసు ముందుంటుందని అదేవిధంగా మండలంలోని ,రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వట్టివాగు నీటికి రైతులు ఇబ్బంది పడటంతో వాటి కాలువను మరమ్మతులు చేపట్టామని . డి ఎస్ పి సత్యనారాయణ అన్నారు ఆదివారం వట్టివాగు కాలువల పూడిక తీత పని ప్రదేశాలలో ఆయన పర్యటించి మాట్లాడారు సాగునీరందక ఏ రైతు పంటలు పంటలను నష్టం నష్టపోవద్దని ఉద్దేశ్యంతో డి బి ఎల్ సంస్థ సహకారంతో పూడిక పనులు చేపట్టామన్నారు గత నాలుగు రోజుల పాటు చేపట్టిన పూడికతీత పనులతో దాదాపు తొంభై శాతం సమస్యకు పరిష్కారాలు లభించిందన్నారు ఆయకట్టురైతులు ఇకపై నీటి వినియోగం విషయంతో సంబంధిత అధికారులతో మాట్లాడి సామరస్యపూర్వక వాతావరణంలో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సాగునీరు అందక రైతులు కొంత మేరకు పంటలను నష్టపోయిన దాదాపు తొంభై శాతం పంట చేతికి అందుతుందన్నారు. భవిష్యత్తులో రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పోలీసులను సంప్రదించాలని రైతులకు అండగా నిలిచి సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తామన్నారు రైతులందరూ సమైక్యంగా ఉన్నప్పుడే దేశంలో సుభిక్షంగా ఉంటుందని అన్నారు పూడికతీత పనులకు సహకరించిన డీపీఎల్ కంపెనీ అధికారులు సంజయ్, రమాకాంత్ లను శాలువలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో రెబ్బెన సిఐ రమణమూర్తి ఎస్సై దికొండ రమేష్ ,సింగిల్ విండో డైరెక్టర్ మదనయ్య తదితర రైతులు ఉన్నారు.
Subscribe to:
Posts (Atom)