Tuesday, 31 July 2018

పంచాయతీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 31 ; దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, టీ ఆర్ ఎస్ కే వి  జిల్లా కార్యదర్శి సుధాకర్ అన్నారు. మంగళ వారం రెబ్బెన మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట  గ్రామ పంచాయతీ  కార్మికుల 9వ రోజు  నిరవధిక సమ్మె  శిబిరంలో టీడీపీ  జిల్లా మహిళ ప్రెసిడెంట్ సొల్లు లక్మి మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు . గ్రామ పంచాయతీ కార్మికులు,సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారని గ్రామ పంచాయతీ కార్మికులకు వారితో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండు చేశారు, తెరాస ప్రభుత్వం కార్మిక చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వహిస్తుందని అన్నారు.శ్రమదోపిడికి గురిచేస్తుందని అన్నారుగ్రామ పంచాయతీ కార్మికులు చాలి చాలని వేతనాలు తీసుకొంటు గ్రామాలు అభివృద్ధి చెందడంతో కీలకపాత్ర పోసిస్తున్నారని,కానీ ప్రభుత్వం వారికి సరియైన గుర్తింపు ఇవ్వడకపోవడం చాలా బాధాకరమని అన్నారు.ప్రెసిడెంట్ రమేష్,కార్యదర్శి వెంకటేష్,వైస్ ప్రెసిడెంట్ లాలసింగ్,  కార్మికులు దుర్గం విజయ్,నారాయణ,శంకర్,సంతోష్, ప్రకాష్,వీరయ్య,శంకర్,రాజేశ్వరి, లక్మి,  కొండు లక్మి  తోపాటు తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలోహరిత హారం, అరటి పళ్లు పంపిణి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 31 ; మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం సంజీవని  స్వచంద సంస్థ ఆద్వర్యం లో  ఆసుపత్రి ఆవరణలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మంగళ వారం టీఆరెస్ మహిళా విభాగం  ఆద్వర్యం లో నిర్వహిస్తున్నకార్యక్రమంలో   సంజీవని స్వచ్చంద సేవ సంస్థ రేబ్బె న వారు గర్భిణులకు అరటి పళ్లు పంపిణి చేసారు.. ప్రతి  ఒక్కరు సేవ భావాన్ని కలిగి ఉండాలని, అదే విదంగా సంజీవని  స్వచ్చంద సేవ సంస్థ సభ్యులను కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో    ఎంపిపి కె . సంజీవ్ కుమార్,జడ్పీటీసీ అజ్మిరా  బాబురావు,  ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్   కుందారపు  శంకర మ్మ, సంజీవని స్వచ్చంద సంస్థ  వ్యవస్థాపకులు  దీకొంఢ సంజీవ్ కుమార్, తెరాస మండల మహిళ   అధ్యక్షురాలు మన్యం  పద్మ , కార్యదర్శి అరుణ,    సంస్థ సబ్యులు విజయ కుమారి, సుజాత ఆసుపర్తి సిబ్బంది పాల్గొన్నారు. 

ఆగస్టు 2 న కార్మికుల ధర్నా విజయవంతం చేయాలి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 31 ; సింగరేణి యాజమాన్యం మరియు గుర్తింపు సంఘం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందుకు నిరసనగా ఆగష్టు 2 న సింగరేణి వ్యాప్తంగా అన్ని ఘనులు డిపార్టుమెంట్ల వద్ద ఎఐటియుసి మరియు సింగరేణి కాలరీస్ వర్కస్ యూనియలనులు సంయుక్తన్గా  ధర్నా నిర్వహించనున్నట్లు ఎస్ తిరుపతి మంగళవారం తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతు గుర్తింపు సంఘం ఐన టీబీజీకేఎస్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందున రోజు రోజుకు రాజకీయ జోక్యం స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మరియు ఎంపీ ల జోక్యం ఎక్కువవుతున్నదని అన్నారు.పదవ వెజ్ బోర్డు 60 శాతం ఎరియర్స్ వెంటనే చెల్లించాలని,మెడికల్ బోర్డుకు అప్లై చేసిన ప్రతి కార్మికుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించాలని తదితర డిమాండ్లతో ధర్నా నిర్వహించబోతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బయ్య మొగిలి,ఆర్గనైజింగ్ సెక్రెటరీ జెగ్గయ్య, శేష శేయణరావు,ఎం చంద్ర శేఖర్ ఫిట్ కార్యదర్శి జూపాక రాజేష్,జి నర్సింహ రావు,నాయకులు కోట శెంకరయ్య సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

అవిశ్వాస తీర్మానం పై ఆగష్టు 9 న సమావేశం


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 31 ; రెబ్బెన మండల పరిషత్ ఎం పి  పి  కర్నాధం సంజీవ్ కుమార్ పై ఎంపీటీసీ లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై  ఆగష్టు 9 న ఉదయం 11 గంటలకు  సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్ తెలిపారు. ఈ మేరకు ఎంపీటీసీ లు  జి రేణుక, ఏం సురేంద్రరాజు, టి మంగమ్మ , కే శ్రీనివాస్,  పల్లె  అనిత, మురళి బాయి, వర్ష బాయి లకు మంగళవారం  ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశ నోటీసులను  సీనియర్ అసిస్టెంట్ వాసు  అందచేశారు. ఎంపీటీసీ లు అందరు తప్పక ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఆర్ డి ఓ కదం సురేష్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.   





Monday, 30 July 2018

కుల మతాలకు అతీతంగా సోదరభావం తో మెలగాలి


రెబ్బెన: గ్రామంలోని ప్రజలందరు కుల మతాలకు అతీతంగా సోదరభావం తో మెలగాలని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవార్ లు అన్నారు. సోమవారం రెబ్బెన  మండలంలోని కొండపల్లి గ్రామంలో మానవ హక్కుల పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇటీవల జరిగిన ఇరువర్గాల  పరినామాలపై స్పందించని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్,జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవార్  కొండపల్లి గ్రామాన్ని సందర్శించి ఇరువర్గాల ప్రజలతో మాట్లాడి గ్రామంలో సుహురుద్బవ వాతావర్ణనని కల్పించడానికి ప్రయత్నం చేసారు.  అనంతరం  వారు మాట్లాడుతు  గ్రామంలోని ప్రజలందరు కుల మతాలకు అతీతంగా సోదరభావం తో మెలగాలని గ్రామంలో ప్రశాంత వాతావర్ణనాన్ని కల్పించుకొని ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని హితవు పలికారు.ప్రజలందరు రాజ్యాంగ బద్దంగా జీవిస్తు వేరొకరి హక్కులకు భంగం కలిగించకుండా జీవనం కొనసాగించాలని కోరారు. అనంతరం జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో  రెబ్బెన తహసీల్దార్ సాయన్న,ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, సిఐ రమణమూర్తి, ఎంపిపి సంజీవ్,తదితర అధికారులు  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.   

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వమే : ఆత్రం సక్కు


రెబ్బెన :  వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం సక్కు అన్నారు.సోమవారం రెబ్బెన మండల కేంద్రంలో శక్తి ప్రాజెక్టు,ఓటరు మ్యాపింగ్ బూత్లెవల్ కార్యకర్తలకు  పై ఏర్పాటు చేసిన అవగహన సదస్సులో అయన మాట్లాడుతు ప్రతి ఒక్క కాంగ్రెస్  కార్యకర్త బూత్ లెవల్ గ్రామాలను సందర్శించి ఓటర్లను మ్యాపింగ్ చేసి తెరాస  ప్రభుత్వం ఎన్నికల్లో  ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు,మూడెకరాల భూమి తదితర విషయాలను అడిగితెలుసుకోవాలన్నారు. అర్హత ఉన్న కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారికి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచించారు.ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకునే ప్రభుత్వం తెరాస నాయకులకే ఫ్రెండ్లీ గా ఉంటున్నారు తప్ప సామాన్య వ్యక్తులకు ఫ్రెండ్లీగా ఉండటం లేదన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు వారి తెరాస కార్యకర్తలకే అందాయని వారేనా రైతులు అని ఘాటుగా విమర్శించారు.అర్హత ఉన్న ఎంతో మందికి ట్రాక్టరులు అందలేదని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు మంగ,ముంజం రవీందర్ మండలాధ్యక్షుడు,గాజుల రవీందర్ పిఏసియస్ ఛైర్మెన్,వెంకన్న చారి,వైస్ ప్రెసిడెంట్,దుర్గం దేవాజి మండల ప్రధాన కార్యదర్శి,దుర్గం రాజేష్ ఉపాధ్యక్షుడు,నాయకులు మొండయ్య,ఆత్మరం,వస్రం నాయక్,హరీష్,జగన్ తదితరులు పాల్గొన్నారు.

ఆగష్టు 9 న అవిశ్వాసం


రెబ్బెన మండల పరిషత్ ఎం పి  పి  కర్నాధం సంజీవ్ కుమార్ పై ఎంపీటీసీ లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై  ఆగష్టు 9 న సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్ తెలిపారు. గత 4 సంవత్సరాలుగా ఎంపీపీ గా కర్నాధం సంజీవ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఐతే మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు జి రేణుక ( తెరాస ) కాంగ్రెస్, తెలుగు దేశం సభ్యుల మద్దతుతో  జులై 16 న అవిశ్వాస తీర్మానాన్ని ఆర్ డి ఓ కదం సురేష్ కు  ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యం లో ఆగష్టు 9 న ఎంపీడీఓ కార్యాలయం లో అవిశ్వాసం పై చర్చా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. బలాబలాలు ఎంపీపీ కే సంజీవ్ కుమార్ (తెరాస) కు ప్రస్తుతం గంగాపూర్ ఎంపీటీసీ దుర్గం మల్లేశ్వరి (తెరాస) , గోలేటి ఎంపీటీసీ 3 వనజ (తెరాస) ల మద్దతు ప్రకటిస్తుండగా ,  అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఉపాధ్యక్షురాలు జి రేణుక (తెరాస) కు  కాంగ్రెస్ ఎంపీటీసీ   కే శ్రీనివాస్, ( నంబాల) తో పాటు నారాయణపూర్ ఎంపీటీసీ పల్లె అనిత (కాంగ్రెస్) ,గోలేటి 1 ఎంపీటీసీ మురళి బాయి (కాంగ్రెస్) ,వంకులం ఎంపీటీసీ వర్ష బాయి (టీడీపీ ), తక్కళ్ళపల్లి ఎంపీటీసీ మంగ (తెరాస), గోలేటి 2 ఎంపీటీసీ సురేందర్ రాజు (బీజేపీ) లు మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం ఉపాధ్యక్షురాలు రేణుక తో పాటు శ్రీనివాస్, సురేందర్ రాజు, మంగ లు క్యాంపు లో కొనసాగుతున్నారు. అనిత, మురళి బాయి , వర్షాబాయ్  లు స్థానికంగా ఉన్నప్పటికీ ఉపాధ్యక్షురాలుకు పూర్తి  మద్దతు ప్రకటిస్తున్నారు. దింతో అవిశ్వాసం నెగ్గడం ఖాయం అని పరిశీలకులు భావిస్తున్నారు. 





లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి



రెబ్బెన ; మండల కేంద్రంలోని  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 4 లెక్చరర్ పోస్ట్ లు  ఖాళీగా ఉన్నాయని అర్హత కలిగినవారు ఆగష్టు 1 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. జువాలజీ, కామర్స్, హిందీ, ఒకేషనల్ ఎం ఎల్ టి కి సంబంధించి పి  జి  చదివినవారు దరఖాస్తు  చేసుకోవాలన్నారు. ఎం ఫీల్ , పి  హెచ్ డి  లతో పాటు బోధనానుభవం కలిగినవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుందన్నారు

Saturday, 28 July 2018

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి ; దుర్గం రవీందర్



  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జులై 28 ; గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, ఏ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా ఇంచార్జ్ కొండగుర్ల చంద్రశేఖర్ అన్నారు.  రెబ్బెన మండలకేంద్రంలో  గత వారం రోజుల నుండి సమ్మె చేస్తున్నపంచాయతీ  కార్మికులకు ఏఐఎస్ఎఫ్, ఏ ఐ ఎఫ్ డి ఎస్ విద్యార్థి సంఘాల పక్షాన మద్దతు తెలిపి  అనంతరం  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న గ్రామపంచాయతీ కార్మికులను టిఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని వారి యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందిందని అన్నారు. గత వారం రోజుల నుండి పంచాయతీ కార్మికులు సమ్మె చేపట్టడంతో  గ్రామాలలో మౌలిక సదుపాయాలైన నీరు, పారిశుధ్య పనులు నిలిచిపోయాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.   రాష్ట్రప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా వ్యవహరిస్తూ పంచాయతీ కార్మికులను విస్మరిస్తోందని అన్నారు.  ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గ్రామ ప్రజలు ఖాళీ బిందెలతో నిరసన

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 28 ; గత వారం రోజులనుండి రెబ్బెన గ్రామంలో మంచినీరు విడుదల చేయడంలేదని, గత్యంతరంలేక శనివారం  రెబ్బెన మండల కేంద్రంలోని ఎంపీడీఓ  కార్యాలయం ముందు  రెబ్బెన  గ్రామ ప్రజలు ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిని సుమారు గంటసేపు  దిగ్బంధనం చేశారు. అధికారులకు పలు మార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో రోడెక్కాల్సి వచ్చిందని  గ్రామస్తులు తెలిపారు. ఈ ఓ పి  ఆర్ డి కిరణ్ సంఘటనా స్థలానికి చేరుకొని  గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె కారణంగా  గత వారం రోజులనుండి గ్రామంలో మంచినీరు విడుదలలో ఇబ్బందులు ఉన్నాయని త్వరలో నీటిని విడుదలచేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. ఈ నిరసనలో నాగమ్మ, శంకరమ్మ, శారద ,వెంకటమ్మ, రాజేశ్వరి, భూదేవి, సరితా, దేవమ్మ, తిరుమల తదితరులు పాల్గొన్నారు.

సమ్మె నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 28 ;  రెబ్బెన మండల కేంద్రంలో  తహశీల్ధార్ కార్యాలయం  ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు గత 6 రోజులుగా చేపట్టిన నిరవధిక  సమ్మె చేస్తున్నకార్మికులను ఉద్దేశించి శనివారం మాజీ జడ్పీటీసీలు పల్లె ప్రకాశరావు, ,దుర్గం సోమయ్య సీపీఐ మండల కార్యదర్శి రాయిల్లా నర్సయ్య లు మాట్లాడారు. సమ్మె నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె లో న్యాయమైన డిమాండ్ల ఉన్నాయని.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే డిమాండ్ల్ ను పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.  సమ్మెకు  లతో పాటు వివిధ పార్టీ నాయకులు,యువజన సంఘం నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు.వివిధ కులాల సంఘం నాయకులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ఏ  ఐ వై ఎఫ్    జిల్లా వైస్ ప్రెసిడెంట్ సునార్కర్ మహేందర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్,  నాగవెళ్లి సుధాకర్ గ్రామ పంచాయతీ  వర్కర్ యూనియన్ మండల ప్రెసిడెంట్ రాచకొండ రమేష్,కార్యదర్శి దుర్గం వెంకటేష్,వైస్ ప్రెసిడెంట్ గోగర్ల రాజేష్, లాలూ సింగ్ కార్మికులు లక్ష్మి, దేవాజి,వీరయ్య,లతో పాటు తదితరులు ఉన్నారు.

Friday, 27 July 2018

అర్ధనగ్న ప్రదర్శనతోనిరసన తెలిపిన గ్రామ పంచాయతీ కార్మికులు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 27 ; గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, టి ఆర్ ఎస్ కే వి  జిల్లా కార్యదర్శి నగవేల్లి సుధాకర్ లు  అన్నారు. శుక్రవారం రెబ్బెన మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట  గ్రామ పంచాయతీ  కార్మికుల 5వ రోజు  నిరవధిక సమ్మె  శిబిరం వద్ద   మాట్లాడుతూ  ఇప్పటికైనా ప్రభుత్వం సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు .కార్మికుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని అన్నారు. దీక్షలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి దుర్గం వెంకటేష్,సహాయ కార్యదర్శి ఎల్లల పోచం,కోశాధికారికళావేన,తిరుపతి,కార్మికులుప్రకాష్,అన్నజీ,మల్లేష్,రాజలింగ్,వీరయ్య,దేవాజి,సంతోష్,ధర్మయ్య తదితరులు ఉన్నారు.




Thursday, 26 July 2018

గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 26 ; గ్రామ పంచాయతీ ఉద్యోగులు గతంలో సమ్మె చేసినప్పుడు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తన్న నేటి వరకు  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బోగే ఉపేందర్ అన్నారు. రెబ్బెన మండల కేంద్రంలో గురువారం తహశీల్ధార్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 4 వ రోజు కళ్ళకు గంతలు  కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భోగే ఉపేందర్ మాట్లాడుతూ  ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. .జి ఓ  నెం 112, 212 లను సవరించి అందరిని పెర్మనెంట్  చేయాలని అన్నారు.. కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చెసారు. అరుహులైన వారందరిని కార్యదర్శి గా నియమించాలని అన్నారు. సమ్మె చేస్తున్నపంచాయతీ ఉద్యోగులకు కాంగ్రెస్  నాయకులూ మాజీ జడ్పీటీసీ పల్లె ప్రకాశ రావు, దుర్గం రాజేష్, లింగయ్య,    బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్,రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడుకడ్తాల మల్లయ్య,మండల అధ్యక్షుడు రామడుగుల శంకర్, నాయినిబ్రహ్మణ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెయ్యిలగాండ్ల కృష్ణ,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ లు మద్దతు ప్రకటించారు.  ఈ  దీక్షలో కూర్చున్నవారు.ఏఐటీయూసీ జి పి  డబ్ల్యూ యూనియన్ మండల అధ్యక్షుడు రాచకొండ రమేష్, కార్యదర్శి దుర్గం వెంకటేష్,వైస్ ప్రెసిడెంట్ గోగర్ల శంకర్, కార్మికులు దేవాజి, వీరయ్య, నారాయణ,లక్ష్మి, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సివిల్ సప్లైయిస్ హమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవా అధ్యక్షుడు గా బోగే ఉపేందర్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 26 ; తెలంగాణ సివిల్ సప్లైయిస్ హమాలి వర్కర్స్ యూనియన్ కొమురం భీమ్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా రెబ్బన మండలిలోని గోలేటికి చెందిన బోగే ఉపేందర్ ఎన్నుకొన్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజు తెలిపారు.ఆయన మాట్లాడుతూ ఈ నెల 22 తేదీన హమాలి జిల్లా 2వ మహాసభలు అసిఫాబాద్ లోని మార్కెట్ యార్డులో జరిగాయని అందులో ఎన్నుకొన్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకొన్నందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజు కు,ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కి కృతజ్ఞతలు తెలిపారు.హమాలీల హక్కుల కోసం పోరాడుతానని, కార్మికులకు ఎల్లెవెళ్ల అందుబాటులో ఉంటానని అన్నారు.

సింగరేణి లో మల్టి డిపార్ట్మెంట్ కమిటీ రెండొవ రోజు పర్యటన

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 26 ;  గోలేటి డోర్లి ఓసిపి 1 ఘనీ ఆవరణలో మొదటి రెండవ షిప్ట్ ప్రారంభంలో మల్టి డిపార్ట్మెంట్ కమిటీ సమావేశాలను ఏరియా జెనరల్ మేనేజర్ కె రవి శెంకర్ ఆధ్వర్యంలో కార్మికులకు  పవర్ ప్రజంటేషన్ ద్వార సింగరేణి సిఎండి శ్రీధర్ సందేశాన్ని  అందించారు.అనంతరం జియం రవి శెంకర్ కంపెనీ స్థితిగతులు,నాణ్యత,ఉత్పత్తి,ఉత్పాదక బొగ్గు రవాణా,రక్షణ,సంక్షేమ కార్యక్రమాలు తదితర వివరాలను కార్మికులకు వివరించారు.బెల్లంపల్లి ఏరియా  2018-2019 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిలో ప్రధమ స్థానంలో నిలిచిందని అందుకు కృషి చేసిన కార్మికులకు సూపెర్వైజర్లకు అధికారుకులకు కార్మికులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్టి డిపార్ట్మెంట్ కమిటీ కన్వీనర్ ఎస్ ఓటు జియం వీరాస్వామి,ప్రాజెక్టు అధికారి మోహన్ రెడ్డి,రక్షణ అధికారి సాయిబాబు,ఏరియా ఇంజనీర్ సీతారామన్,డిజిఎం పర్సనల్ కిరణ్,టీబీజీకేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు. 

గ్రామా బహిష్కరణ చేస్తూ డప్పు చాటింపు వేయటం అమానుషం ; కడ్తల మల్లయ్య


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 26 ;  కొండపల్లి గ్రామంలో నాయి బ్రాహ్మణా, రజకులను గ్రామా బహిష్కరణ చేస్తూ డప్పు చాటింపు వేయటం అమానుషమని  రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు కడ్తల మల్లయ్య అన్నారు. త ద్వారా  ఈ రెండు కులాల వారి మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ రెబ్బెన మండలం లోని రజకులు, విశ్వ బ్రాహ్మణులూ గురువారం  రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయం లో జూనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం సమర్పించారు.   అనంతరం మాట్లాడుతూ మనోభావాలను దెబ్బతీసేలా డప్పు చాటింపు చేసినవారిపై చాట్ట్టరిత్యా  కఠిన చర్యలు తినుకోవాలని అన్నారు. శుక్రవారం మండలంలోని రజక సంఘం షాపులు, నాయి బ్రాహ్మణా షాపులు ఒక రోజు  బంద్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో  మండల రజక సంఘం అధ్యక్షులు రామడుగు శంకర్, నాయి బ్రాహ్మణా సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె  ఇస్తారి , జిల్లా ఉపాధ్యక్షులు వి కిష్టయ్య, మండల అధ్యక్షులు కళ్యాణం శ్రీనివాస్, మల్లేష్, భీమయ్య, పోశం, లండయ్యా, వెంకటి, శారద, భాగ్య, నందొక్క తదితరులు ఉన్నారు. 

Tuesday, 24 July 2018

మొక్కలు మానవాళికి ఎంతో మనుగడ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 24 ; ఈ నాటి మొక్కలే రేపటి వృక్షాలని , వృక్షాలు మానవ మనుగడకు ఎంతో దోహద పడతాయని ఎస్ వి ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు దీకొండ  సంజీవ్ కుమార్ అన్నారు . మంగళ వారం రెబ్బెన లో డిప్యూటీ రేంజర్  కారం శ్రీనివాస్ ఆధ్వర్యములో హరిత హారములో భాగంగా పాఠశాల  విద్యార్థులు , సిబ్బంది మొక్కలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన  మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఒక్క మొక్క నాటాలని , అప్పుడు గ్రామమే ఉద్యాన వనముగా మారుతుందని తెలిపారు . పుట్టిన రోజు , పండగలకు గుర్తింపుగా మొక్కలు నాటుతుండాలని , పర్యావరనాన్ని కాపాడిన వారమౌతామని తెలిపారు , ఈ కార్య క్రమములో ఉపాధ్యాయులు విజయ కుమారి , సుజాత , ఉదయ , రేష్మ , విష్ణు, ఆనంద్ రావు , తిరుపతి, లిఖిత, ప్రమీల, భాగ్యలక్ష్మి లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 24 ;   :మండల కేంద్రంలోని ఎంపిఎస్  పాఠశాలలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను బత్తుల సదానందం మరియు లావుడ్యా రవి లను మంగళవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సహోపాధ్యాయులు విద్యార్థులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.అనంతరం వారి   గురించి మాట్లాడుతు ఉపాధ్యాయ వృత్తిలో మండల కేంద్రంలోని విద్యార్థులకు ఎనలేని సేవలందించారు అన్నారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా స్థానిక సర్పంచ్ పెసరి వెంకటమ్మ,వార్డ్ మెంబెర్ మోడెమ్ చిరంజీవి గౌడ్,విశిష్ట అతిధిగా మండల విద్యాధికారి ఎం వెంకటేశ్వరస్వామి,ఎస్ఎంసి చైర్మన్ నగేష్,విశాలక్ష్మి,స్థానిక ఉపాద్యాయులు సైదం వెంకటేష్,దొడ్డిపట్ల రవికుమార్ ,కల్వల శంకర్,అనిల్,సోమశేకర్,రేగళ్ల రాము,మందాడే శ్రీనివాస్,శ్యామ్,ఖాదర్,స్థానిక సీఆర్పిలు మిట్ట దేవేందర్, రాజేష్, సత్యనారాయణ,  కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ఉప్మా పంపిణి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 24 ;  మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం గర్భిణీ స్త్రీలకు ఉప్మా పంపిణి చేసారు తెరాస మహిళా విభాగం ఆధ్వర్యం లో ప్రతి మంగళవారం చేపట్టే కార్యక్రమన్నీ చూసి ఆకర్షితుడైన రెబ్బెనకు చెందిన  రజనీకాంత్ అనె యువకుడు ముందుకు వచ్చి ఈ వారం గర్భిణిలకు ఉప్మా పంపిణి చేసారు.30మంది గర్భిణులకు,50 మంది సాధారణ రోగులకు ఆథితుల చేతుల మీదుగా ఉప్మా పంపిణి చేసారు.ఈ కార్యక్రమం లో ఆసిఫాబాద్  మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కుంధరపు.శంకరమ్మ,పట్టణ మహిళ  అధ్యక్షులు మన్యం పద్మ,సీనియర్ నాయకురాలు అరుణ,వైద్యధీకారి కుమారస్వామి,రెబ్బెన ఏఎస్ఐ దేవరాజు,స్టాఫ్ నర్సు భాగ్యలక్ష్మి ,ఏఎన్ఎం లీల తదితరులూ పాల్గొన్నారు.

తెరాస ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ; ఎస్ తిరుపతి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 24 ;  తెరాస ప్రభుత్వం ఎన్నికలలో  చేసిన వాగ్దానాల ప్రజలకు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ తిరుపతి అన్నారు. సీపిఐ పార్టీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించతల పెట్టిన ధర్నా కార్యక్రమాలలో భాగంగా మంగళవారం రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతు అర్హులైన నిరుపేదలందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు,దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి హామీలను తుంగలో తొక్కారనున్నారు.ఇప్పడికైనా వాటిని అమలు చేయాలన్నారు.ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించి రెబ్బెన మండలంలో 20 వేల ఎకరాల భూమికి సాగునీరందించే విదంగా చర్యలు చేపట్టాలని అన్నారు.కేజీ టు పిజి విద్యను అందిస్తామన్నారు,వెంటనే అమలు చేసి విద్యను అందించాలన్నారు.ఇంటికో ఉద్యోగం కల్పిస్తామన్నారు. వాటి అమలును మరిచారు అన్నారు.అదేవిదంగా గోలేటి గ్రామంలో రమణారెడ్డి కాలనీ వాసులకు ఇండ్ల కల్పించాలని ఈ సందర్బంగా కోరారు.వాటితోపాటు తెరాస ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల తదితర అంశాలను వెంటనే అమలుపర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో జాడి గణేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు,రాయిల్ల నర్సయ్య సిపిఐ మండల కార్యదర్శి,బోగె ఉపేందర్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి,బి జగ్గయ్య,దుర్గం రవీందర్,రామడుగుల శెంకర్ తదితరులు పాల్గొన్నారు. 

గ్రామపంచాయతి కార్మికుల రెండవ రోజు నిరవధిక సమ్మె

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 24 ;  గ్రమపంచాయితి కార్మికుల డిమాండ్ల పరిష్కారానికై నిర్వస్తున్న నిరవధిక సమ్మె రెబ్బెన మండల కేంద్రంలో మంగళవారం తహశీల్ధార్ కార్యాలయం ఎదుట రెండవరోజు చేరుకుంది. ఈ  సమ్మెకు తెలంగాణ జనసమితి  మద్దతు పలికారు.ఈ సందర్బంగా జనసమితి జిల్లా కన్వీనర్ లావుడ్య ప్రేమ్ నాయక్ మాట్లడుతు సమానపకి సమాన వేతనం మరియు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. గ్రామపంచాయితీల్లో ప్రభుత్వం కొత్తగా నియమించే 9200ల  ఉద్యోగాల్లో  ఉన్నవారిని అవకాశం కల్పించాలన్నారు.  పరిసరాలను పరిశుబ్రాంగా ఉంచేందుకు కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారని వారి నుండి వెట్టి చాకిరి చేయించుకొని సమాన వేతనం కల్పించకుండ అన్యాయం చేస్తుందన్నారు.  ఈ కార్యక్రమాల్లో టిఆర్ఎస్వి జిల్లా కార్యదర్శి సుధాకర్,టీజెఏసి జిల్లా కన్వీనర్ ఎం దేవేందర్,మండల కన్వీనర్ గోగర్ల రాజేష్,ఏ గోపి,ఎం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Monday, 23 July 2018

గ్రామ పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 23 : గ్రామ పంచాయతీ కార్మికుల  హక్కుల సాధనలో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం  రెబ్బన మండలంలోతహశీల్దార్ కార్యాలయం  ఎదుట  నిరవధిక సమ్మెను ప్రారంభించారు.  ఈ సందర్భంగా  ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, టిఆర్ఎస్ కొమురంభీం  జిల్లా కార్యదర్శి ఎన్. సుధాకర్ లు  మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. గత 40 సవంత్సరాలుగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు చాలిచాలని వేతనాలు తీసుకుంటూ, గ్రామ అభివృద్ధి లో, ప్రజల అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోసిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం శ్రమదోపిడికి పాల్పడుతున్నాదని , కార్మిక చట్టాలను అమలు చేయడంలో విఫలం అయిందని అన్నారు. కార్మికుల కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని అన్నారు. కనీస వేతనం 18000 ఇవ్వాలని అన్నారు. కరొబార్లను పంచాయితీ కార్యదర్సులుగా   నియమించాలని,వారికి ఈ ఎస్ ఐ, పి  ఎఫ్   సౌకర్యం కల్పించాలని, ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాయిల నర్సయ్య, సునీల్, దేవాజి, వీరయ్య, తిరుపతి, పోచాం ,శంకర్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి ఘనులలో ఈ నెల 25న మల్టి డిపార్ట్మెంట్ బృందం పర్యటన



రెబ్బెన:  
బెల్లంపల్లి  ఏరియాలో  ఖైర్గుడా, దొర్లి,ఓసి2 తదితర విభాగాల్లో మల్టి డిపార్ట్మెంట్ వారు పర్యటించి ఇప్పడివరకు సాధించిన ఉత్పత్తి ఉత్పాదకాలను రవాణా, యంత్రాల వినియోగం బొగ్గు నాణ్యత, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గూర్చి కార్మికులకు వివరించడం జరుగుతుందని  జియం కె రవి శెంకర్ అన్నారు . సోమవారం  గోలేటి లోని  సింగరేణి జియం కార్యాలయంలో  పర్యటనకు సంబందించిన గోడప్రతులను విడుదల చేసి అనంతరం కాన్ఫిరెన్సి హాలులో పవర్ ప్రజంటేషన్ ద్వారా అధికారులకు పర్యటనకు సంబందించిన పలు  సూచనలు చేసారు.ఈ నెల25 వ తేదీన డోర్లి పర్యటన,26 వ తేదీన ఖైర్గుడా,27న బిపిఎ ఓసి2,28 న అన్వేషణ విభాగం ఏరియా ఆస్పత్రి,29న బెల్లంపల్లి ఏరియా వర్క్ షాప్,జియం కార్యాలయం లలో పర్యటించి ఇప్పడివరకు సాధించిన ఉత్పత్తి ఉత్పాదకాలను రవాణా, యంత్రాల వినియోగం బొగ్గు నాణ్యత, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గూర్చి కార్మికులకు వివరించి కార్మికుల నుండి పలు సూచనలు ఈ ప్రత్యేక బృందం  స్వీకరించి  వాటి అమలుకై కృషి చేస్తామన్నారు.ఈ పర్యటన ఉదయం 7గం నుండి మధ్యాహ్నం  3 గంటల వరకు సాగుతుందన్నారు. అనంతరం బెల్లంపల్లి  ఏరియా వార్షిక ఉత్పత్తిని, లక్ష్యాలను సాధిస్తూ లాభాల బాటలో సాగుతుంది అన్నారు.లాభాలు సాధించడంలో ఉద్యోగులు,కార్మికులు ఎంతో కృషి ఉందని వారికీ ప్రత్యేక అభినందలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటుజియం వీరస్వామి,డిజిఎం పర్సనల్ జె కిరణ్,ఎస్వో కె సాయి బాబు,డిప్యూటీ జియం సీతారామన్,ఎస్వోయం కె రాజమల్లు,ఐఈడి యోహాన్,ఫైనాన్స్ మేనేజర్ శ్రీధర్. మల్టి డిపార్ట్మెంట్  బృందం వారితో పై అధికారులందరు పాల్గొననున్నట్లు జియం రవి శెంకర్ తెలిపారు.  

Saturday, 21 July 2018

రోడ్ల దుస్థితి పై పాదయాత్ర


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 21 ;  రహదారుల నిర్వహణలో  ఆర్ అండ్ బి అధికారుల  నిర్లక్ష్యానికి నిరసనగా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్  విద్యార్ధి యువజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం తక్కళ్లపల్లి గ్రామం నుండి వాంకిడి మండల గోయిగం వరకు పాదయాత్రను చేపట్టారు.ఈ పాదయాత్రను ఆత్రం సక్కు మాజీ ఎం ఎల్ ఏ  జండా ఊపి ప్రారంభించారు.  ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ  .అంతరాష్ట్ర రహదారి,గ్రామీణ ప్రాంత రహదారులు గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా తయారైనప్పటికీ రహదారులు భవనములు శాఖ కనీసం గుంతలను పూడ్చడంకాని  చేయడం లేదని అన్నారు.   వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురై ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతున్నదని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల పరిస్థితి మరి దయనీయంగా ఉందని గ్రామాలకు చేరుకోలేని పరిస్థితి ఉందని అన్నారు.ఈ ర్యాలీలో దుర్గం రవీందర్, ఎస్ తిరుపతి, చునార్కర్ మహేందర్ ,పిమహేష్, మొర్లే శ్రీకాంత్, పుదారి సాయి, పార్వతి సాయి, జాడి సాయి, దుర్గం రాజేష్, గోగర్ల రాజేష్,  తదితరులు పాల్గొన్నారు.  

Friday, 20 July 2018

గ్రామపంచాయతీ ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలి ; ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 20 : గ్రామపంచాయతీ ఉద్యోగులును ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, టిఆర్ఎస్ కొమురంభీం  జిల్లా కార్యదర్శి ఎన్. సుధాకర్ లు అన్నారు. శుక్రవారం  రెబ్బెన లోని అతిథి  గృహ ఆవరణలో మాట్లాడుతూ ఈ నెల 23 న JAC ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేయనుంటూతెలిపారు. గత 40 సవంత్సరాలుగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు చాలిచాలని వేతనాలు తీసుకుంటూ, గ్రామ అభివృద్ధి లో, ప్రజల అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోసిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం శ్రమదోపిడికి గురిచేస్తుందని, కార్మిక చట్టాలను అమలు చేయడంలో విఫలం అయిందని అన్నారు. కార్మికుల కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని, అన్నారు. కనీస వేతనం 18000 ఇవ్వాలని అన్నారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కరొబార్లను పంచాయితీ కార్యదరిగా నియమించాలని,వారికి ఈ ఎస్ ఐ, పి  ఎఫ్   సౌకర్యం కల్పించాలని, ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాయిల నర్సయ్య, తిరుపతి, పోచాం ,శంకర్,విజయ్,వీరయ్య,తదితరులు పాల్గొన్నారు.

అటవీ భూమిని పరిశీలించిన జిల్లా అటవీ అధికారి



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 20 ; రెబ్బన మండలం రేంజ్ పరిధిలో శుక్రవారం  కొమురంభీం  జిల్లా జిల్లా అటవీ అధికారి రంజిత్ నాయక్ పర్యటించారు ఈ సందర్భంగా కించపరి లోని అటవీ భూమి జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో ఎంత పోతే ఎంత భూమి పోతుందో పరిశీలించారు రెబ్బన నర్సరీ  ఆనుకున్న అటవీ ప్రాంతాల్లోనే టేక్ చెట్లను పరిశీలించి అనంతరం పలు అంశాలపై అధికారులతో చర్చించారు. అటవీ ప్రాంతాల్లో కందకాలు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఆయనతో పాటు రెబ్బెన రేంజ్ అధికారి రాజంద్ర ప్రసాద్ డిప్యూటి రేంజ్ అధికారి కారం శ్రీనివాసులు ఉన్నారు.

విద్యార్ధి యువజన సంఘ పాదయాత్రను విజయవంతం చేయాలి.





కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 20 ;  ఆర్ అండ్ బి అధికారుల  నిర్లక్ష్యానికి నిరసనగా విద్యార్ధి యువజన సంఘాల ఆధ్వర్యంలో 21వ తేదీన తక్కళ్లపల్లి గ్రామం నుండి వాంకిడి మండల గోయిగం వరకు చేపట్ట తలపెట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి శుక్రవారం అన్నారు.అంతరాష్ట్ర రహదారి,గ్రామీణ ప్రాంత రహదారులు గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురై ప్రమాదాలు జరిగి ప్రాణాపాయం నష్టం జరుగుతున్నాయి తెలిపారు. గుంతలు ఏర్పడిన రోడ్లను మరమత్తులు చేయడంలో ఆర్అండ్ బి అధికారులు విఫలం అవుతున్నందున ఈ పాదయాత్రను చేపట్టినట్లు తెలిపారు.పాదయాత్రను ప్రారంభించడానికి పార్టి ప్రజాసంఘాలు,స్వతంత్ర సమరయోధులు హాజరవుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్,చునార్కర్ మహేందర్,పి మహేష్,మొర్లే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.  

అర్హులైన రైతులకు పథకాలు అందజేయలి ; జన సమితి జిల్లా ఇన్చార్జ్ బీ బాపన్న

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 20 ; ప్రజాధనంతో ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలను  అర్హులైన రైతులకు ఖచ్చితంగా అందజేసే బాధ్యత ప్రభుత్వానిదే అని జన సమితి  జిల్లా ఇన్చార్జ్ బీ బాపన్న అన్నారు. శుక్రవారం రెబ్బెన లోని అతిథి  గృహ ఆవరణలో రైతు దీక్షకు సంబంధించిన గోడప్రతులను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ భూ ప్రక్షాళనలో జరిగిన తప్పులను తక్షణమే సరిదిద్దాలని కోరుతూ తెలంగాణా జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్  కోదండరాం ఈ నెల 23 న కలెక్టరేట్ల ముందు  చేపట్టిన రైతు  దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ అన్నారు. భూ ప్రక్షాళనకు సమందించిన ధరణి వెబ్ సైట్ ను యుద్ధప్రాతిపదికన బాగుచేసి పనిచేసేటట్లు చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఇంచార్జి రవీందర్,కన్వీనర్లు లావుడ్య ప్రేమ్ కుమార్, మనోహర్, రాజశేఖర్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. 

Thursday, 19 July 2018

యాదవుల అభివృద్ధికై గొర్రెల పంపిణి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 19 ; తెలంగాణా రాష్ట్రంలోని యాదవుల అభ్యున్నతికి ప్రభుత్వం గొఱ్ఱెల పంపిణి కార్యక్రమం చేపట్టిందని రెబ్బెన జడ్పీటీసీ అజమీర బాపు రావు అన్నారు. మండల కేంద్రం ఎం పి  డి ఓ కార్యాలయంలో 11 గొర్రెల మేకల సహకార సంఘాలకు రెండవ విడత గొర్రెల పంపిణి పై అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు.  రెబ్బెన మండలంలో మొదటి విడత 201 మందికి గొర్రెలను పంపిణి చేసినట్లు, రెండవ విడతలో 199 మందికీ పంపిణి చేయను న్నట్లు తెలిపారు. గొర్రెల పధకం లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కిష్టాపూర్ సర్పంచ్ భీమేష్, పాక్స్ డైరెక్టర్ మధునయ్య, మండల యాదవ సంఘం అధ్యక్షులు చంద్రయ్య, ఆసిఫాబాద్ తాలూకా  యాదవ సంఘం అధ్యక్షులు అరిగేలా మల్లికార్జున్, జిల్లా యాదవ ఫంఘం ఉపాధ్యక్షులు పి  పర్వతాలు, 11 సంఘాలకు చెందిన అధ్యక్షులు, సభ్యులు, పశు   సంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామాలలో దోమల మందు పిచికారీ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 19 ; మండలం దుగ్గాపూర్, పులికుంట గ్రామాలలో గురువారం  దోమల మందును   ప్ర్రభుత్వ ప్రాధమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది పిచికారీ చేశారు. వర్షాకాలం ప్రారంభమైనందువల్ల దోమల వ్యాప్తిని అరికట్టడానికి ముందస్తు చర్యగా గ్రామాలలోని అని ఇళ్లల్లో, అంగన్వాడీ పాఠశాలలలో ఇండోర్ రెసిడెల్ స్ప్రే 5% ను పిచికారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఏ  ఎం లు   కమలాకర్,ప్రవీణ్ తదితర సిబ్బంది  పాల్గొన్నారు. 

సింగరేణి ఏరియాలో హరితహారం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 19 ; తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా బెల్లంపల్లి ఏరియాలోని   కైరిగూడ ఓపెన్ కాస్ట్, డోర్లీ ఓపెన్ కాస్టుల డంప్ యార్డ్  ల   పైన గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఫారెస్ట్ అధికారులు, ఎన్విరాన్మెంట్   డిపార్టుమెంట్ వారి ఆధ్వర్యంలో కొనసాగిందని డిజిఎం పర్సనల్ జె కిరణ్ తెలిపారు.

Wednesday, 18 July 2018

బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడికి సన్మానం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 18 ;  మండలంలోని నక్కల గూడు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుడు బదిలీ పై వెళ్తున్న  బొంగు శ్రీనివాస్ రావు విడుకోలు కార్యక్రమంలో  k.శంకర్  అధ్యక్షతన బుధవారం  సన్మానం. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాపురావు గారు, P.R.T.U జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, zphs HM .స్వర్ణలత గారు, రాష్ట్ర  అసోసియేట్ అధ్యక్షులు గణేష్ గారు, జిల్లా నాయకులు సదానందం గారు, ఖాదర్ గారు,శ్రావణ్ ,రెబ్బెన మండల అధ్యక్షులు సతన్న, ప్రధాన కార్యదర్శి అనిల్,  నాయకులు రమేష్, సుభాష్ గారు, రవికుమార్, శ్రీధర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

రైతులను మోసం చేస్తున్నతెలంగాణ ప్రభుత్వం : టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆత్రం సక్కు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 18 ;  రైతులకు ఉన్న భూములను లాక్కొని తెలంగాణా ప్రభుత్వం మోసం చేస్తున్నదని టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ ఎం ఎల్ ఏ ఆత్రం సక్కు అన్నారు.  బుధవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణ విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతు.మండలం లోని రైతులకు  ముప్పై సంవత్సరాలుగా  కాస్తు చేస్తున్న  భూములకు గత కాంగ్రెస్ హయాంలో పట్టా పాసుపుస్తకాలు ఇవ్వడం జరిగిందని వాటి ద్వార రైతులు వ్యవసాయ పెట్టుబడి కోసం బ్యాంకు ద్వారా లోన్ లు తీసుకోవడం జరిగిందని తెలిపారు.  పేద మధ్యతరగతి  బడుగు బలహీన వర్గాల రైతు ప్రజల   భూములకు పట్టాలు,రైతు బందు చెక్కులు ఇవ్వకుండా గత కొన్ని రోజులుగా రైతులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నది .  ఇప్పుడు అట్టి భూమిని తెరాస ప్రభుత్వం ఫారెస్ట్ రిజర్వ్ భూమి అని వాటిని లాక్కునే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు.ముప్పై సంవత్సరాల క్రితం లేని అటవి భూమి ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చినదని ప్రశ్నించారు. నేడు తెరాస ప్రభుత్వ హయాంలో భూ సర్వ్ చేసి వారందరికీ వన్ బి ఫారం లు ఇచ్చి.గత రెండు నెలలుగా రైతులను తెరాస ప్రభుత్వంలో  చేరితే తప్ప వారికి చెక్కులు పట్టా పాసుబుక్కులు ఇవ్వమని వారిని భయబ్రాంతులకు గురిచేయడం అన్యాయమని తెలిపారు.తెలంగాణ రాష్టం కోసం ఎంతో పాటుపడిన బడుగు బలహీన వర్గాల ప్రజలను ఎన్నో రకాలుగా మోసంచేస్తుందన్నారు.పేద మధ్యతరగతి ప్రజల నుండి సెంటు భూమి లాక్కునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ తరుపున ఉపేక్షించేదిలేదని అన్నారు.ప్రజల సౌకర్యార్థం జిల్లాలు,మండలాలు,గ్రామాలు ఏర్పాటు చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అధికారులు నాయకులు మండల రెవెన్యూ కార్యాలయాన్ని జిల్లా కేంద్రం లో ఉంచి వివిధ గ్రామాల మండల ప్రజలకు తీవ్రంగా ఇబ్బందులు కలుగజేస్తున్నారన్నారు.వెంటనే రెవెన్యూ కార్యాలయ సిబ్బంది మండల కేంద్రంలో ఉండే విదంగా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కె విశ్వ ప్రసాద్, ఉపాధ్యక్షుడు పల్లె ప్రకాష్, మహిళా జిల్లా అధ్యక్షురాలు ఇరుకుల మంగ, మండలాధ్యక్షుడు ముంజం రవీందర్,  పిఎసిఎస్ ఛైర్మెన్ గాజుల రవి,వైస్ ఛైర్మెన్ వెంకటేశం చారి, ఉపాధ్యక్షుడు దుర్గం రాజేష్,ఎస్టీ సెల్ నాయకులు ఎల్ రమేష్,నాయకులు వస్రం నాయక్,వెంకన్న,దేవాజి,రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 

రెబ్బెన సి ఐ గా రమణ మూర్తి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 18 ;  రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వి వి రమణ మూర్తి పదవి బాధ్యతలు బుధ వారం  చేపట్టారు.కరీం  నగర్ లో పని చేసి రెబ్బెన కు బదిలీ పై వచ్చారు .  రెబ్బెన లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేసిన పురుషోత్తమ చారీ కరీం   నగర్ కు బదిలీపై వెళ్లారు.


Tuesday, 17 July 2018

అద్దేవాహనాలకై టెండర్ లు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 17  ;   సింగరేణి ఇల్లందు  ఏరియా లో ఎస్ అండ్ పి  డిపార్ట్మెంట్లో 24 గంటలు నాన్ ఏసి 2డబ్ల్యూడి జీపులు అద్దె ప్రాతిపదికన 5 సంవత్సరాలకుగాను నడుపుటకు   టెండర్లు పిలువడమైనదని సింగరేణి బెల్లంపల్లి  ఏరియా డీ జి ఎం పెర్సొన్నల్ జె  కిరణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు ఇల్లందు సింగరేణి ఏరియా  ఎస్ ఈ (ఈ&ఎం)పర్చజ్ డిపార్మెంట్  ను సంప్రదించగలరని తెలిపారు. 

బిజెపి శక్తి కేంద్ర అధ్యక్షుల సమావేశం;

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 17  ;  బిజెపి శక్తి కేంద్ర అధ్యక్షుల సమావేశం నేటి ఉదయం 10 గంటలకు సిర్పూర్ కాగజ్నగర్ సంతోష్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించబడునని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి  కేసరి ఆంజనేయులు గౌడ్ తెలిపారు.  ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ .జిల్లా ఇన్చార్జి చాడ శ్రీనివాస్ రెడ్డి .జిల్లా అధ్యక్షుడు జె.బి పౌడెల్ హాజరవుతున్నారు . కావున శక్తి కేంద్ర అధ్యక్షులు .మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు. జిల్లా పదాదికారులు .వివిద మోర్చా ల జిల్లా అధ్యక్షులు అధికారులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి  చేశారు. 

సమాజ సేవ లో అందరూ భాగస్వాములు కావాలి


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 17  ;   సమాజ సేవ లో అందరూ భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరూ  తమ  వంతూ   బాధ్యతగా   సమాజ  సేవ  చేయడానికి  ముందుకు  రావాలని  మార్కెట్  కమిటీ  వైస్  చైర్మన్  కుందరపు శంకరమ్మ  అన్నారు. మంగళవారం తెరాస మహిళా మండల అధ్యక్షురాలు ఎం పద్మ ఆధ్వర్యంలో మంగళవారం రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి లో బ్రెడ్ పంపిణి కార్యక్రమం లో పాల్గొని మాట్లాడారు.  ప్రతి మంగళవారం ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు క్రమం తప్పకుండా ఏదో ఒక పౌష్టిక ఆహారం అందించడం అభినందనీయమన్నారు.   మండలంలోని వివిధ గ్రామాలనుంచి  వచ్చే గర్భిణీ స్త్రీలకు ప్రతి మంగళవారం   అల్పాహారం పంపిణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి  తెరాస మండల ప్రధాన కార్యదర్శి  అన్నపూర్ణ అరుణ, ఎస్సై శివకుమార్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి, భోగే ఉపేందర్, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి  దుర్గం రవీందర్,  ఆస్పత్రి సిబ్బంది డా.,  మాధురి, భాగ్య లక్ష్మి, రాజేశ్వరి, కాంత లీల    తదితరులు పాల్గొన్నారు. 

Monday, 16 July 2018

పోలీస్ ఉద్యోగార్ధులకు సింగరేణి సేవ సమితి ఉచిత శిక్షణ


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 16 ;  తెలంగాణ ప్రభుత్వం పదహారు వేల తొమ్మిదొందల  పోలీస్ ఉద్యోగలకొరకు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా పోలీసు ఉద్యోగాల కొరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న బెల్లంపల్లి ఏరియా అభ్యర్థులకు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల23 నుండి  సుశిక్షితులైన సీఐఎ్సఎఫ్ జవాన్లచే  శారీరిక మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే రాత పరీక్ష కొరకు   కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నామని ఏరియా డీసీఎం పర్సనల్ శ్రీ కె కిరణ్ తెలిపారు. కావున పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ పేర్లను 27 వ తేదీ  లోపు జీఎం ఆఫీసులోని పర్సనల్  డిపార్ట్మెంట్ లో  పేరు నమోదు చేసుకోగలరని,  గోలేటి భీమన్న స్టేడియం గ్రౌండ్ నందు కోచింగ్ క్యాంప్ ప్రారంభం కానున్నదని తెలిపారు. 

బదిలీ పై వేల్తున టీచర్ వీడ్కోలు సన్మానం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 16 ; వంకులం గ్రామం లోని ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల లో పని చేసీ బదిలీ పై వేల్తున టీచర్- జ్యోతి , జనార్దన్ , వీణా , స్వరూప  టీచర్ లను వంకులం  పాఠశాల టీచర్ ల బృందం మరియు రేబేన మండల meo వేంకటేశ్వర్లు , గ్రామ ప్రజలు  సమీక్షంలో వీడ్కోలు సన్మానం చేయడం జరిగింది.దీనీలో వంకులం పాఠశాల హేడ్ మాస్టర్ - ప్రభాకర్, కమలాకర్ ,  రేబేన మండల రైతు సమన్యయ కమీటీ కో ఆర్డినేటర్- భోర్కుటే నాగయ్య , నాయకులు - అజ్మేర శంకర్ నాయక్ , బాలాజీ , ch.శంకర్ , మహేందర్ లు పాల్గొన్నారు.

ఆయుర్వేదశిబిరానికి మంచి స్పందన


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 16 ; బెల్లంపల్లి ఏరియా గోలేటిలో సింగరేణి సేవ సమితి ఆధ్వర్యంలో  సి వి ఆర్ క్లబ్ లో సోమవారం ఆయుర్వేదశిబిరం నిర్వహించారు. ఈ ఆయుర్వేద శిబిరానికి మంచి స్పందన వచ్చినట్లు మాత ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్ డాక్టర్ విశ్వనాథ మహర్షి తెలిపారు. ప్రజలకు ఆయుర్వేద వైద్య విధానంపై క్రేమేపి పెరుగుతున్న ఆదరణకు ఈ స్పందనే నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులో సింగరేణి సంస్థ వారి సౌజన్యంతో మరిన్ని శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు. 

నోట్ పుస్తకాలు పంపిణీ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 16 ; రెబ్బెన మండలం లోని  వంకులం UPS లో ఖతర్ నివాసి శ్రీ B.వెంకట్ రెడ్డి గారి సహకారంతో వేకువ ఫౌండేషన్ ప్రతినిధి అవధూత శ్రీనివాస్ గారు విద్యార్థులకు నోట్ పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్,ఉప సర్పంచ్, ,HM జాడి ప్రభాకర్, MEO వెంకటేశ్వర స్వామి  మరియు ఉపాధ్యాయులు రాజ్ కమలాకర్ రెడ్డి,సుభాష్,రామకృష్ణఉపద్యానిలు,జ్యోతి,వీణ విద్యార్థులు గ్రామస్థులు పాల్గొన్నారు.

రెవిన్యూ , ఫారెస్ట్ అధికారుల సంయుక్త సర్వే


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 16 ; రెబ్బెన మండలం గోలేటిలో సోమవారం రెవిన్యూ , ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా రెబ్బెన ఎం ఆర్ ఓ సాయన్న  గోలేటి గ్రామంలో 313,343 సర్వే నంబర్ల భూమిని  సర్వే చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన ఫారెస్ట్ ఆర్ ఐ ఊర్మిళ , ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రవి, మరియు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Sunday, 15 July 2018

టిబిజికెఎస్ కార్యాల యంలో హరితహారం



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బన జులై 15 ;   మండలం గోలేటిలోని    తెలంగాణ భవన్ ప్రాంగణంలో టిబిజికెఎస్   కార్యాలయం  టిబిజికెఎస్  ఏరియా ఉపాఢ్యక్షుడు మల్రాజ్ శ్రీనివాసరావు  ఆధ్వర్యంలో హరితహారం లో భాగంగా 100 మొక్కలను నాటడం జరిగింది.గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  మొదలుపెట్టిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఈ కార్యక్రమమ్ చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా మల్రాజ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ  ప్రతి సింగరేణీయుడు ఈ వర్షాకాలంలో కనీసం ఒక మొక్కనైన నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యుడు అబ్బు శ్రీనివాసరెడ్డి, ఏరియా నాయకులు మహేందర్ రెడ్డి,మరీనా వెంకటేష్, కుమారస్వామి, చంద్రశేఖర్, పిట్ కార్యదర్శి టి పి   రాములు,నాయకులు దంకుమార్,మెకార్తి మల్లేష్,కొండు సత్తయ్య,,సాంబశివ రావు తదితరులు పాల్గొన్నారు.