Monday, 31 October 2016

పాలనాధికారి ఆకస్మిక తనిఖీ

పాలనాధికారి ఆకస్మిక తనిఖీ 

కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి): రెబ్బెన రెబ్బెన తహసీల్దార్  కార్యాలయం లో కొమురం  భీం జిల్లా పాలనాధికారి చంపాలాల్ సోమవారం కార్యాలయం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు అందులో భాగంగా నూతన జిల్లా ఏర్పడ్డక  మొదటి సరిగా రెబ్బెన మండలం  కి వచ్చి రైతుల సమస్యలు మరియు ఇతర సమస్యల గురించి మరియు  కార్యాలయం లో జరుగుతున్న ఇతరత్ర పనుల అధికారుల వివరాలు  గురించి అడిగి తెల్సుకున్నారు.

సర్ధార్ వల్లభాటేయి పటేల్ జయంతి వేడుకలు

సర్ధార్ వల్లభాటేయి పటేల్  జయంతి వేడుకలు 
కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి): రెబ్బెన  సర్ధార్ వల్లభాటేయి పటేల్ సేవలు మరవరానివాని రెబ్బెన తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ అన్నారు . సోమవారం రెబ్బెన తహసీల్దార్ గారి కార్యక్రమం లో సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు . అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివాస్  ప్రతిజ్ఞ చేశారు . అనంతరం అయన మాట్లాడుతూ సర్ధార్ వల్లభాయి పటేల్ భారత రాజ్యాంగాన్ని కీలక పాత్ర పోషించి అతి ముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీ చేర్మెన్ గ నిర్వహించి మన భారత దేశానికి ఎన్నో సేవలు చేశారని అలాగే ఆయనకు ఉక్కు  మనిషి అని బిరుదు లభించింది అన్నారు . అయన మరణించిన నాలుగు దశాబ్దాల అనంతరం కూడా భారత ప్రభుత్వం గుర్తించి భారత రత్న అవార్డు ని పురస్కరించారని అన్నారు . ఈ కార్యక్రమం  లో  మండల విద్యదికారి వెంకటేశ్వరా స్వామి , సీనియర్ అసిస్టెంట్ ఊర్మిళ , విలెజ్ రెవెన్యూ అధికారులు , గ్రామా రైతులు పాల్గొన్నారు.

పదవి విరమణ పొందిన అధికారి కి సన్మానం

పదవి విరమణ పొందిన అధికారి కి సన్మానం

కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి): రెబ్బెన బెల్లంపల్లి ఏరియా గోలేటి జి . యం  ఆఫీస్ లో పర్చేజ్ డిపార్ట్మెంట్ నందు పని చేసిన శ్రీ క్రిస్టఫర్ డిప్యూటీ సూపరిండెంట్ ఈ రోజు పదవి విరమణ అవుతున్న సందర్భంగా  అతన్నియాజమాన్యం తరపున ఘనంగా సన్మానించడం జరిగింది శాలువాతో సత్కరించి బహుమతి అందజేసినారు . ఈ కార్యక్రమం లో జి. వి రారాజి ఎస్. ఈ  పర్చేజ్  ఏరియా ఇంజనీర్ రామారావు ఎస్ ఆర్ . పో  రామశాత్రి , యూనియన్ నాయకులూ సదాశివ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 

విజిలెన్సు అవగాహనా వారోత్సవాలు


విజిలెన్సు అవగాహనా వారోత్సవాలు 

కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి): విజిలెన్సు అవగాహనా వారోత్సవాలు -2016 కార్యక్రమం లో భాగంగా బెల్లంపల్లి ఏరియా గోలేటి  జనరల్ మేనేజర్  కె రవి శంకర్.  అలాగే  కార్యాలయం లో   సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్బంగా 'జాతీయ ఐక్యత దినోత్సవ ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ సందర్భం గ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయి పటేల్ ఉప ప్రధాని గా బాధ్యతలు చేపట్టి దేశాన్ని ఒక్క తాటి పై నిలిపాడని తెలిపారు . దేశ ఐక్యత ను , సమగ్రతను , బాధ్యతను కాపాడేందుకు అంకితమవ్వాలని పిలుపునిచ్చారు . అలాగే విజిలెన్సు అవగాహనా వారోత్సవాల నిర్మానలో ప్రజల భాగస్వామ్యం అనునది ఈ సంవత్సరం సందేశమని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎస్ఓ టు జి. యం  శ్రీ కొండయ్య టి.బి.జి.కె.ఎస్  వైస్  ప్రెసిడెంట్ప్రెసిడెంట్ శ్రీ ఎన్  సదాశివ్ ఏ.ఐ.టీ.యు.సి  బ్రాంచి సెక్రెటరీ శ్రీ ఎస్ తిరుపతి డి. వై. పి.యం  ఎ . రాజేశ్వర్ మరియు అధికారులు కార్యాలయ సిబ్భంది పాల్గొన్నారు.

Friday, 28 October 2016

మత్స్యుకారులకు కు న్యాయం చేయాలి

మత్స్యుకారులకు  కు  న్యాయం చేయాలి 

  కొమురం బీమ్ రెబ్బెన (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల మత్సుకారులు  గురువారం తమకు  చేయాలనీ  తహసీల్ధార్ రమేష్ గౌడ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా  నంబాల  ఎంపీటీసీ సభ్యుడు కొవ్వూరి శ్రీనివాస్ మరియు  మత్స్యుకార సంఘం అధ్యక్షులు బక్క సత్య నారాయణ, ఉపాధ్యక్షులు బక్క భానుప్రసాద్ లు మాట్లాడుతూ రెబ్బెన  మండలం లోని నిరు పేద మత్స్యుకారులు గత యాభై సంవత్సరాలు గ చేపలు పట్టడమే వారి  జీవనాదారం చేసుకొని జీవిస్తున్నారని,వీరు  ఒక్క సెంటు భూమి లేని పేదవారిని ,మండలం లోని చెరువులలో ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది అగస్ట్ నెలలో రెబ్బెన లోని ఎల్లమ్మ చెరువులో లక్ష రూపాయల విలువ గల సుమారు గ లక్ష ఇరవై వేల చేప పిల్లలని వేసినారని అయితే ఒక్కరిద్దరు ప్రైవేట్ వ్యక్తులు ఎలాంటి సొసైటీ లేకుండా  అనుమతి లేకుండా చేపలు పట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అదే విధంగా మత్స్యుకారులకు, సొసైటీ కి  తెలియ పరచకుండా నేడు అధికారులను తప్పు తోవ పట్టించి, నూతన జిల్లా అధికారుల అవగాహన లోపం తో, మరల అదే ఎల్లమ్మ చెరువులో ప్రభుత్వం ఇచ్చినటువంటి చేప పిల్లలని వేసినారు.  అయ్యా......  ప్రత్యేక రాష్ట్రం వచ్చి మా బ్రతుకులు మారాలని మత్స్యుకారులందరం తట్ట బుట్ట వలలతో రోడ్డు ఫై ఉద్యమం చేసామని   కానీ స్వరాష్ట్రంలో మా నోట్లో మట్టి కొట్టడం ఏంత వరకు సమంజసం ,ఈ రోజు ఏ ఒక్క మత్స్యుకారుడు లేకుండా అధికారులు,కొందరు ప్రజాప్రతినిధులు చెరువులో చేప పిల్లలని వేయడం ఎంత వరకు సమంజసం,వెంటనే ఇట్టి విషయం అయ్యి తగు చర్యలు తీసుకొని యడల ఉద్యమం చేస్తామని మత్స్యుకారుల పొట్టకొట్టే ప్రయత్నాలు విరమించుకోవాలని,సంభందిత అధికారుల ఫై చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేసారు.ఇట్టి విషయం ఫై  స్పందించిన తహసీల్దార్ మాట్లాడుతూ  దీనిని వెంటనే సబ్-కలెక్టర్  గారి ద్రుష్టి కి తీసుకెళ్లి  సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం  లో కుల పెద్దలు బక్క నాగయ్య లక్ష్మేన్,బిమయ్య ,పోచం, రమేష్ , శంకర్, మల్లేష్ ,సాగర్,వెంకటేష్ ,పోషయ్య ,రాజ్ కుమార్,పాల్గొన్నారు.

చేపలు పెంచి జీవనోపాధి పొందండి -ఏ డి

చేపలు పెంచి జీవనోపాధి పొందండి  -ఏ డి

 కొమురం బీమ్ రెబ్బెన (వుదయం ప్రతినిధి): మత్సకారులు చేపలను పెంచి జీవనోపాధిని పొందాలని మత్స శాఖ ఏ డి సత్యనారాయణ అన్నారు . శుక్రవారం రెబ్బెనలోని ఎల్లమ్మ చెరువు లో చేప పిల్లలను వదిలారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స కారుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని , ప్రత్యేకంగా వారికి చెరువులను కేటాయించిందని , వాటిని సద్వినియోగం చేసుకొని జీవనోపాధి పొందుతూ అభివృద్ధి కావాలని అన్నారు . ఈ కార్య క్రమములో ఎం పి  పి  సంజీవ్ కుమార్ , సర్పంచ్ వెంకటమ్మ , జెడ్ పి  టి సి బాబు రావు , గోలేటి సర్పంచ్ లక్ష్మణ్ , తహశీల్ధార్ రమేష్ గౌడ్ , ఎం పి  డి ఓ సత్యనారాయణ సింగ్ ,ఏ పి ఎం వెంకట రమణ .ముదిరాజ్ సంగం అధ్యక్షులు మధునాహ్ తదితరులు ఉన్నారు.

రైతుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ వినతి

రైతుల సమస్యలు  పరిష్కరించాలని  తహసీల్దార్ వినతి

కొమురం బీమ్  (వుదయం ప్రతినిధి): రెబ్బెన రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదురుకుంటున్న సమస్యలు పరిష్కరించాలని బి జె పి  పార్టీ ఆద్వర్యం లో రెబ్బెన   తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి,అనంతరం  తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి బోనగిరి సతీష్ బాబు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు చాల నష్ట పోయారని,పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక[పోవడం ద్వారా  రైతులుచాల తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం లో వున్నారని అన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి  నకిలీ విత్తనాలు సప్లై చేసిన దళారుల ఫై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఒకే దఫా రైతుల రుణ మాఫీ చేయాలనీ ,దళిత రైతులకు మూడెకరాల భూమి ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేసారు,అర్హులైన పేద వారికి డబల్ బెదురూమ్ ఇల్లు వెంటనే కట్టించి ఇవ్వాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పసల్ భీమా రైతులకు ఉపయోగ పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.కేంద్రం విడుదల చేసిన  700 కోట్ల రూపాయలను రైతులస్ కోసం విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో మండల ప్రెసిడెంట్ కే బాలకృష్ణ ఎంపీటీసీ మద్దెల సురేందర్ రాజు ,చెర్ల మురళి,మండల మధుకర్  గుల్భము చక్రఫణి, మహిళా నాయకురాళ్లు కృష్ణ కుమారి, నమిత డాలిపాల్గొన్నరు.

Thursday, 27 October 2016

ఎంప్లైఐ మెంట్ కార్డు నమోదు చేసుకోండి... జిల్లా ఏంప్లైఐ మెంట్ అదికారి

ఎంప్లైఐ మెంట్ కార్డు నమోదు చేసుకోండి... జిల్లా ఏంప్లైఐ మెంట్ అదికారి

కొమురం బీమ్  (వుదయం ప్రతినిధి): జిల్లా  లోని నిరుద్యోగులకు ఉద్యోగం కొరకు  ఎంప్లైఐ మెంట్ కార్డు కోసం ఎక్కడికో వెళ్లనవసరం లేకుండా మన  జిల్లాలోని అన్ని మండలంలో ఉన్న వారందరు,  కార్డ్స్ రినివాల్ చేయించని వారు తమ కార్డ్స్ తో పాటు సెల్ఫ్ డిక్లేరేక్సన్ పట్టుకోని కార్యాలయంకు వచ్చినట్లైతే  నూతనంగా నమోదు చేస్తామని   జిల్లా ఏంప్లైఐ మెంట్ అదికారి బ్రామ్మనంద రెడ్డి గురువారం తెలిపారు. నూతనం గా ,  ఇంతకముందు   తమ కార్డ్స్  వేరే ప్రాంతాల  కార్యాలయం నుండీ పొందిన వారు ఉంటే వారి కార్డ్స్ లను అయ ఆఫీస్ లకు పంపిస్తామని తద్వారా తమ  కార్డులను నూతన జిల్లా నుండి తీసుకొనే వీలు కలిపిస్తామని ఈ  సదవకాశాన్ని  కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా లోని అన్ని మండలాల  నిరుద్యోగులు ఉపయోగించుకొవాలని   అన్నరు.

ఏకగ్రీవం గా సి అర్ పి ల నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక






ఏకగ్రీవం గా సి అర్ పి  ల నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక 

కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లో జిల్లా  పరిషత్ బాలుర పాఠశాలలో సి అర్ పి  ల నూతన జిల్లా కార్యవర్గం ఏకగ్రీవం గా ఎన్నుకోవటం జరిగింది. అధ్యక్షునిగా దహెగాం పవన్ కుమార్, ప్రధాన కార్యదర్శి గా మారుమొకం రాజేష్, ఉపాధ్యక్షునిగా సి హెచ్ సుభాష్ , కోశాధికారి గా దుర్గం సందీప్, ప్రచార కార్యదర్శి గా  వి. సత్యనారాయణ, దేవన్న,  సహాయకార్యదర్శి యం  రాజేష్ , ఏ దేవేందర్ , సలహాదారులు ఏ శ్రీనివాస్ రాజేష్ కార్యవర్గ సభ్యులు శేఖర్, విలాస్, మహేష్, హన్మంతరావు, శ్యామ్, స్వరూప తదితరులు వున్నారు. అధ్యక్షుడు దహెగాం పవన్ కుమార్ మాట్లాడుతూ సి అర్ పి ల సమస్యలపై పోరాడతానని అన్నారు. ఈ సందర్భం గా  నూతనం గా ఎన్నికైన  కార్యవర్గం సభ్యులు కలిసి   డి ఈ ఓ ను శాలువాతో సన్మానించారు.

రైతు సమస్యపై చేపట్టే ఘూర్ణను విజయవంతం చేయండి

రైతు సమస్యపై  చేపట్టే ఘూర్ణను విజయవంతం చేయండి 




కొమురం బీమ్  రెబ్బెన; (వుదయం ప్రతినిధి): బీజేపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు రెబ్బెన  మండలకేంద్రం లో  రైతు సమస్యపై, రుణమాఫీ అంశాలపై   చేపట్టే ధర్నాని మండలం లోని  నాయకులు,  రైతులు  అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని బీజేపీ మండల ప్రచార కార్యకర్త తెలిపారు 

పులజీబాబా భక్తులు యంఎల్ఎ కు ఘన సన్మానం

పులజీబాబా భక్తులు యంఎల్ఎ కు ఘన సన్మానం   




కొమురం బీమ్  రెబ్బెన; (వుదయం ప్రతినిధి):రెబ్బెన మండలం లోని పుంజమేరా గ్రామ  పులజీబాబా భక్తులు గురువారం నాడు జిల్లా ఏర్పాటుకు కారణమైన  యంఎల్ఎ కోవ లక్ష్మి  ని  ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామస్థులు నూతనం గా ఏర్పడిన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లో వెనుకంజలో వున్న తమ  గ్రామంను సందర్శించి , గ్రామం లో  పులజీబాబా ఆలయ  అభివృద్ధి కార్యకలాపాలను జరపవలసిందిగా వారు కోరారు.   అనంతరం  యంఎల్ఎ కోవ లక్ష్మి  మాట్లాడుతూ  గ్రామమును త్వరలోనే  సందర్శించి  ఏర్పడ్డ సమస్యలను పరిష్కరిస్తాం అన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులూ నవీన్, వెంకన్న,  గ్రామస్థులు గుర్లె పుంజుమేర, గుర్లె సోమయ్య, వాడై హన్మంతు, గుర్లె శ్రీనివాస్, వాడై నాను బాయి, వాడై సావిత్ర బాయి, నీకొదే చిన్నుబాయి తదితరులు పాల్గొన్నారు. 

దివాళి బోనస్ చెక్కుల పంపిణి

దివాళి బోనస్ చెక్కుల పంపిణి

కొమురం బీమ్  (వుదయం ప్రతినిధి): రెబ్బెన;రెబ్బెన  మండలం లోని గోలేటి సింగరేణి ఏరియా కార్మిక వర్గానికి దివాళి బోనస్ చెక్కుల పంపిణి ఏరియా జనరల్ మేనేజర్ చేతుల  మీదుగా పంపిణి చేశారు . కార్మిక సంక్షేమమే ప్రధమ దేయంగా బెల్లంపల్లి సింగరేణి ఏరియా కొనసాగుతుందని ఈ సందర్బంగా జి యం  అన్నారు . ప్రతి పండుగకు కార్మికుల కుటుంబాలు సంతొషంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో వారికీ ప్రోత్సహాలను ఇస్తున్నామని తెలిపారు . మాత సమరస్యాలకు అతీతంగా పండుగలను జరుపుకొనుట ఒక్క భారత దేశంలోనే సాధ్యమని ప్రతి పండుగను హిందు ముస్లిం అన్న విభేదాలు లేకుండా పండగలు జరుపుకొనడం జరుగుతుందని జి యం అన్నారు . 

ఫ్రెండ్స్ యూత్ స్వచ్చంద సంస్థ మండలకమిటీ ఎన్నిక

ఫ్రెండ్స్ యూత్ స్వచ్చంద సంస్థ  మండలకమిటీ ఎన్నిక 

కొమురం బీమ్  (వుదయం ప్రతినిధి): రెబ్బెన;రెబ్బెన మండలంలోని మంగళవారం అతిధి గృహంలో  ఫ్రెండ్స్ యూత్ కమిటీలో సభ్యులను ఎన్నుకొన్నారు . ఫ్రెండ్స్ యూత్ మండల కమిటీ అధ్యక్షుడిగా  అంకం పాపయ్య,  ఉపాధ్యక్షుడిగా అజమేరా ఈశ్వర్ ,డోంగ్రి సునీల్ ,సయ్యద్ సమీర్ పాషా మరియు కోశాధికారిగా తైదెలా వెంకటేష్ ,ప్రధాన కార్యాధికారి కీర్తి మహేందర్ ఎక్సిక్యూట్ మెంబర్ గా  టి.సంతోష్,కార్తీక్ ,గుడిసెల వినయ్ ,అంకం స్వామి , వినోద్ కుమార్  లను ఏక గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది . దీనిలో భాగంగా ఈ సభ్యులందరు కలసి ఉచిత సేవ కార్య క్రమాలు చేపట్టనున్నామని అన్నారు.  

గ్రామా రెవిన్యూ సహాయకుల సంగం మండల కమిటీ

గ్రామా రెవిన్యూ సహాయకుల సంగం మండల కమిటీ 

రెబ్బెన రెవిన్యూ సహాయకుల సంఘం మండల కమిటి మండల మంగళ వారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నుకోవడం జరిగిందని కొమరం భీం జిల్లా కన్వీనర్ ఎస్ డి అఙ్గర్  ఆలీ తెలిపారు . మండల అధ్యక్షులుగా కాటిపల్లి వెంకటేశం ,ప్రధాన కార్యదర్శి దుర్గం దుర్గయ్య ,కోశాది కారి దుర్గం దుర్గయ్య , ప్రచార కార్య దర్సులు  దుర్గం శ్రీనివాస్ ,దుర్గం రాజు , సెక్రెటరీ ఎస్ కె జమీర్ పాషా ,ఉపాధ్యక్షులు మాదే గణపతి ,ఎం  వినోద్ కుమార్ ,సలహా దారుడు ముంజం బుద్దులు ని ఎన్నుకున్నారు . 

Tuesday, 25 October 2016

విద్యార్థుల చదువుకు దూరం చేస్తే ఉద్యమం తప్పదు---- ఎ బి వి పి ప్రధాన కార్యదర్శి

విద్యార్థుల చదువుకు దూరం చేస్తే ఉద్యమం తప్పదు---- ఎ  బి వి పి ప్రధాన కార్యదర్శి 


కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  విద్యార్థుల చదువుకు దూరం చేస్తే ఉద్యమం తప్పదు అని అఖిల  భారతీయ విద్యార్థి పరిషత్   ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్ మంగళవారం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కొమురం భీం జిల్లా పాలనా అధికారి చంపాలాల్ కి వినతి పత్రం అందచేశారు ఈ సందర్భముగా మాట్లాడుతూ విద్యార్థులకు విడుదల చేయాల్సిన ఫీజు రీయంబర్స్ మెంట్ కు నిధులు కేటాయించకుండ పేద మధ్య తరగతుల విద్యార్థులను చదువులకు దూరం చేస్తూ వారి జీవితాలతో ప్రభుత్వం ఆదుకోక పోవడం సమంజసం కాదని అన్నారు .  విద్యార్థుల కు స్కాలర్ షిప్స్,మరియు రియంబర్స్ మెంట్ ప్రభుత్వం త్వరగా విడుదల చేయక పోతే కె సి ఆర్ ఇంటిని ముట్టడిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ సుచిత్,  మహేందర్,కార్యదర్శి దేవేందర్ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు మెరుగైన విద్య ,వైద్య సదుపాయాలు కల్పించాలి

విద్యార్థులకు మెరుగైన విద్య ,వైద్య సదుపాయాలు  కల్పించాలి  

 కొమురం బీమ్  (వుదయం ప్రతినిధి):  అఖిల భారత విద్యార్ధి సమాఖ్య సిర్పూర్ కాగజ్నగర్  నియోజకవర్గ, మండల, పట్టణ నూతన కమిటీని ఎస్సీ వసతి గృహం లో  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం రవీందర్ అద్వర్యం లో ఎన్నుకోవడం జరిగింది.అనంతరం రవీందర్ మట్లడుతూ రాష్ట్రము లో దేశంలో విద్యారంగంలో అనేకసమస్యలతో విద్యార్థులు  సతమతమవుతున్నారని అన్నారు. తెరాస ప్రభుత్వం హామీలు ఇవ్వడం తప్ప ఆచరణలో చూపించడం లేదన్నారు . విద్యారంగానికి ఇచ్చిన హామీలు KG  TO PG  కళాశాలల్లో మధ్యాహ్న భోజనం డిగ్రీ కళాశాలలకు పాలిటెక్నిక్ కళాశాలలకు   ఏర్పాటు చేస్తామని చెప్పిన కెసిఆర్ ఎప్పటి వరకు హామీలు అమలు చేయలేదన్నారు . విద్యారంగ సమస్యలపై నూతనంగా ఏర్పడిన నియోజకవర్గ సమితి ఆందోళనల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి సమస్యలు పరిస్కారం అయ్యేంత వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. కమిటీ అధ్యక్షులుగా ఇరిగిరాళ్ల శ్రీకాంత్ ,కార్యదర్శి గ నిక్కోదే తిరుపతి,కాగజ్నగర్ మండల అధ్యక్షుని గ కోట రవివర్మ,ఉపాధ్యక్షులు గ స్వామీ,రాజేంద్ర ప్రసాద్, కార్యదర్శిగా పి . సంపత్, జాయింట్ కార్యదర్శులుగా సాయి, మల్లేష్, పట్టణఅధ్యక్షులుగ  షారుఖ్,పి.శేఖర్     లను ఎన్నుకోవడం జరిగింది  అన్నారు. 

అఖిల భారత విద్యార్ధి సమాఖ్య గోలేటి పట్టణ నూతన కమిటీ ఎన్నిక

 అఖిల భారత విద్యార్ధి సమాఖ్య గోలేటి పట్టణ నూతన కమిటీ ఎన్నిక 

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): అఖిల భారత విద్యార్ధి సమాఖ్య  నూతన కమిటీని గోలేటిలోని కే ఎల్  మహేంద్ర భవనంలోని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూదరి సాయి అద్వర్యం లో ఎన్నుకోవడం జరిగింది.అనంతరం సాయి మాట్లాడుతూ రాష్ట్రము లో దేశంలో విద్యారంగంలో అనేకసమస్యలతో విద్యార్థులు  సతమతమవుతున్నారని అన్నారు. తెరాస ప్రభుత్వం హామీలు ఇవ్వడం తప్ప ఆచరణలో చూపించడం లేదన్నారు . విద్యారంగానికి ఇచ్చిన హామీలు KG  TO PG  కళాశాలల్లో మధ్యాహ్న భోజనం డిగ్రీ కళాశాలలకు పాలిటెక్నిక్ కళాశాలలకు   ఏర్పాటు చేస్తామని చెప్పిన కెసిఆర్ ఎప్పటి వరకు హామీలు అమలు చేయలేదన్నారు . విద్యారంగ సమస్యలపై నూతనంగా ఏర్పడిన మండల సమితి ఆందోళనల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి సమస్యలు పరిస్కారం అయ్యేంత వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. గోలేటి పట్టణ అధ్యక్షులుగా పడాల సంపత్ ,ఉపాధ్యక్షులుగా కందుల శ్రీకాంత్ ,బోధస్ ,సాయి , కార్యదర్శిగా జాడి సాయి సహాయ కార్యాధ్యక్షులుగా దుర్గం మహేష్ రాజేశం ,కోశాధికారిగా మహేష్లను ఎన్నుకొన్నారు ఏ కార్యక్రమంలో అఖిల భారత విద్యార్ధి సమాఖ్య జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవి , డివిజన్ కార్యదర్శి పుదారి సాయి పాల్గొన్నారు.


స్కాలర్ షిప్స్ ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలి

స్కాలర్ షిప్స్ ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలి

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  అఖిల  భారతీయ విద్యార్థి పరిషత్  ఆధ్వర్యంలో  విద్యార్థుల కు స్కాలర్ షిప్స్,మరియు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలి అంటూ రెబ్బెన తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక జూనియర్ అసిస్టెంట్ ఊర్మిళ కు  వినతి పత్రం అందచేశారు అనంతరం  మండల కన్వీనర్ అరుణకుమార్  మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా  పెండింగ్ లో వున్నా విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎ బి వి పి నాయకులు అఖిల్ ,ప్రవీణ్ ,శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు వట్టివేనా

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు వట్టివేనా

కొమురం బీమ్  (వుదయం ప్రతినిధి): రెబ్బెన; తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు వట్టివేనా అని బి.జె .పి అసెంబ్లీ కన్వీనర్ జె .బి . పౌడెల్ ,జిల్లా ఉపాదాక్షుడు కేసరి ఆంజనేయులు గౌడ్ అన్నారు.  బి. జె .పి మండల అధ్యక్షుడు కుందారపు బాలకృష్ణ అద్వర్యంలో మంగళ వారం రెబ్బెన అతిధి గృహం లో బి.జె .పి మండల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి రైతుల రుణ మాఫీలు ఒకేసారి చెల్లించకుండా రైతుల జీవితాలతో చెలగాలాడు రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారు అని అన్నారు . దళితులకు మూడు ఎకరాల భూమి మరియు అర్హులు ఐన వారికీ రెండు పడకల ఇండ్లు ఇస్తా అన్న హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తున్నారు అన్నారు .  అలాగే బి.జె.పి పార్టీ బలోపేతం కోసం మండల నాయకులూ అందరు కృషి చేసి రాబోయే ఎన్నికలలో బి.జె.పి ని అధికారంలోకి రావడం కోసం కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లాకాంట్రాక్టు సెల్ అధ్యక్షుడు గుల్బమ్ చక్రపాణి ,గోలేటి ఎం.పి .టి .సి మద్దెర్ల సురేందర్ రాజ్ ,రెబ్బెన పట్టణ  అధ్యక్షుడు మండల మధుకర్ ,మండల్ ప్రధాన కార్యదర్శి మాల్రాజు రాంబాబు ,మాజీ మండల అధ్యక్షుడు రాచకొండ రాజు బి. జె .వై .ఎం  మండల అధ్యక్షుడు  బత్తిని రాము , పట్టణ  కార్యదర్శి పసునూటి మల్లేష్ తదితర నాయకులూ ఉన్నారు . 

Monday, 24 October 2016

కమ్యూనిటీ హల్ కోసం స్థలం కేటాయించండి

కమ్యూనిటీ హల్  కోసం స్థలం కేటాయించండి 
కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల కేంద్రములో కమ్యూనిటీ హాల్ , షాదీఖానా కోసం స్థలాన్ని కేటాయించాలని కో ఆప్సన్ సభ్యుడు జాకీర్ ఉస్మాని అన్నారు . సోమా వారము రెబ్బెన తహశీల్ధార్ రమేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు .  గతములో  మంత్రి జోగు రామన్నకు వినతి  అందజేశామని ,   జారీచేసిన  పత్రాన్ని తహశీల్ధార్ కు చూపించారు . అదే విదంగా ఎం ఎల్ ఏ  కోవా  లక్ష్మి , ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్  దృష్టికి తీసుకెళ్లగా వారు  కూడా ఆదేశాలు జారీ చేసిన  విషయాన్ని తెలిపారు . స్థలాన్ని తప్పకండా కేటాయించాలని అన్నారు .  ఈ కార్య  క్రమములో అన్వార్ , అప్పు తదితరులు వున్నారు    

లారీ ఢీకొని బాలిక మృతి

లారీ ఢీకొని బాలిక  మృతి 
కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల కేంద్రములో రాష్ట్రీయ రహదారిపై రోడ్డు దాటు తుండగా పాసిగామ్ గ్రామానికి చెందిన నీకొదే తిరుపతి కుమార్తె కీర్తి ( 5 ) ఆది వారం రాత్రి మరణించింది . మృతురాలు  న రోజు కావడంతో షాపింగ్  రెబ్బెన కు  తండ్రితో   రోడ్డు  దాడుతుండగా   మహారాష్ట్ర నుండి హైడెరాబ్యాడ్ కు వెళ్తున్న లారీ డీ కొట్టడం తో  బాలిక కాళ్లపై నుండి టైరు వెళ్లడంతో కాళ్ళు నుజ్జు నుజ్జయి పోయాయి .   హుటా హుటిన  ఆసుపత్రికి ,  మంచిర్యాల ఆసుపత్రికి అనంతరం హైద్రాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా కీర్తి మరణించినట్లు బంధువులు తెలిపారు . పాప పుట్టిన రోజు మరణించడముతో మండలములో విషాద ఛాయలు అలుముకున్నాయి .

Sunday, 23 October 2016

అఖిల భారత విద్యార్ధి సమాఖ్య మండల నూతన కమిటీ ఎన్నిక

 అఖిల భారత విద్యార్ధి సమాఖ్య మండల నూతన కమిటీ ఎన్నిక 

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): అఖిల భారత విద్యార్ధి సమాఖ్య రెబ్బెన మండల నూతన కమిటీని గోలేటిలోని కే ఎల్  మహేంద్ర భవనంలోని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం రవీందర్ అద్వర్యం లో ఎన్నుకోవడం జరిగింది.అనంతరం రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రము లో దేశంలో విద్యారంగంలో అనేకసమస్యలతో విద్యార్థులు  సతమతమవుతున్నారని అన్నారు. తెరాస ప్రభుత్వం హామీలు ఇవ్వడం తప్ప ఆచరణలో చూపించడం లేదన్నారు . విద్యారంగానికి ఇచ్చిన హామీలు KG  TO PG  కళాశాలల్లో మధ్యాహ్న భోజనం డిగ్రీ కళాశాలలకు పాలిటెక్నిక్ కళాశాలలకు   ఏర్పాటు చేస్తామని చెప్పిన కెసిఆర్ ఎప్పటి వరకు హామీలు అమలు చేయలేదన్నారు . విద్యారంగ సమస్యలపై నూతనంగా ఏర్పడిన మండల సమితి ఆందోళనల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి సమస్యలు పరిస్కారం అయ్యేంత వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. కమిటీ మండల అధ్యక్షులుగా మలిశెట్టి మహిపాల్ ,ఉపాధ్యక్షులుగా సందీప్ ,తిరుపతి, హరీష్, మహీందర్, కార్యదర్శిగా ప్రదీప్, సహాయ కార్యాధ్యక్షులుగా గౌతమ్, సంతోష్, హరీష్, సాయి కోశాధికారిగా వెంకటేష్ లు ఉన్నారు. ఏ కార్యక్రమంలో అఖిల భారత విద్యార్ధి సమాఖ్య జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవి , డివిజన్ కార్యదర్శి పుదారి సాయి పాల్గొన్నారు. 

రైతులకు అందుబాటులో ఉంటూ సకాలంలో సేవలు అందించాలి ; జె.సి అశోక్ కుమార్

రైతులకు అందుబాటులో ఉంటూ  సకాలంలో సేవలు అందించాలి ;  జె.సి  అశోక్ కుమార్



కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  అధికారులు అందుబాటులో వుంటూ  సకాలంలో రైతులకు సేవలు అందించాలని జె.సి  అశోక్ కుమార్  అన్నారు ఆదివారం రెబ్బెన తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించి కార్యాలయ సిబ్బందిని పరిసరాల యొక్క రైతుల పంటల వివరాలు తెలుసుకున్నారు . అలాగే పరిసర ప్రాంతాలలోని ప్రోజెక్టుల వివరాలు అడిగి తెలుసుకున్నారు . మిషన్ కాకతీయ  చెరువుల  వివరాలు ఆరాతీసారు . కుమ్రo భీం   జిల్లా నూతనంగా  ఏర్పడిన తరువాత  మొదటి సరిగా ఉప పాలనాధికారి రెబ్బెన తహసీల్దార్ కార్యాలయం  విచ్చేసినందుకు పూల గుచ్చాలతో స్వాగతం పలికారు  . ఈ సందర్బంగా రెబ్బెన తహసీల్దార్ రమేష్ గౌడ్ , డిప్యూటీ తహసీల్దార్  రామ్ మోహన్ రావు , జూనియర్ అసిస్టెంట్ ఊర్మిళ  మరియు కార్యాలయ సిబ్బంది బాపన్న,ఉమ్ లాల్ తదితరులు ఉన్నారు. 

Saturday, 22 October 2016

ఉత్తీర్ణత శాతాన్ని పెంచండి - ఎం ఈ ఓ



ఉత్తీర్ణత శాతాన్ని పెంచండి - ఎం ఈ  ఓ 


కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): పాఠశాల ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని ఎం ఈ  ఓ వెంకటేశ్వరా స్వామీ అన్నారు.  శని వారం గోలేటి లోని ఆశ్రమ పాఠశాల ను తనిఖీ చేశారు . అనంతరం మాట్లాడుతూ మార్చిలో జరుగ బోయే ఎస్ ఎస్ సి పరీక్షలకు ఇప్పటినుండే విద్యార్థులను సన్నధం చేయాలని తెలిపారు . పరిసరాలను శుభ్రాంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు . విద్యార్ధులపై శ్రద్ధ వహించాలని , సమయ పాలన పాటించే విదంగా విద్యార్థులను పాఠశాలకు వచ్ఛే విదంగా చూడాలని , అప్పుడే  మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు . ఈ కార్యక్రమములో ఎచ్ ఎం సోమయ్య , వార్డెన్ దేవయ్య , ఉపాధ్యాయులు ఉన్నారు. 

పట్టుదలతో చదివితే సాదించ లేనిది ఏది లేదని ;డి ఐ ఈ ఓ

 పట్టుదలతో చదివితే సాదించ లేనిది ఏది లేదని ;డి ఐ ఈ ఓ 



కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): నేటి విద్యార్థులు  ప్రగతికి మెట్లు అని పట్టుదలతో చదివితే సాదించ లేనిది ఏది లేదని  డి ఐ ఈ ఓ నాగేందర్ అన్నారు. శుక్రవారం రోజున రెబ్బెన  ప్రభుత్వ కళాశాలలో  నూతన విద్యార్థులకు ఘన స్వాగతం సమావేశంలో  కాలేజీకి ముఖ్య అతిధిగా  జెడ్ పి ఎచ్ ఎస్ ప్రధాన ఉపాధ్యాయురాలు స్వర్ణలత తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు కళాశాలకు విచ్చేసిన  డి ఐ ఈ ఓ నాగేందర్   విద్యార్థులను ఉద్దేశించి  భావితరాల భవిష్యత్తును గుర్తు చేసి పై చదువులపై అవగాహన కల్పించారు అదేవిధముగా ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి,క్రమశిక్షణ తో  చదివితే మంచి భవిష్యత్ ఉంటుంది అని తెలిపారు  విద్యార్థు లు అట, పాటలతో   నృత్యాలు చేసి ప్రత్యేకంగా ఆకర్షితులు అయ్యారు  ఈ  కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు శాంతి ,అతియా ,వనమాల ,ప్రకాష్ ,శ్రీనివాస్,గంగాధర్ ,అమరేందర్, విద్యార్థులు మరియు తదితరులు  `పాల్గొన్నారు.

గీత కార్మికులకు ఈత చెట్లు పెంచడానికి భూమి ఏర్పాటు చేయాలనీ తహసీల్దార్ కి వినతి

గీత కార్మికులకు ఈత చెట్లు పెంచడానికి  భూమి  ఏర్పాటు చేయాలనీ తహసీల్దార్ కి వినతి  

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలం లో జి ఓ నెంబర్ 560 ప్రకారం గీత కార్మికులకు ఈత చెట్లు పెంచడానికి 5 ఎకరాల భూమి ఇప్పించగలని రెబ్బెన తహసీల్దార్ కి శుక్రవారం రోజున గౌడ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందచేశారు అనంతరం అధ్యక్షుడు తాళ్లపెల్లి కిష్టాగౌడ్ మాట్లాడుతూ రెబ్బెన శివారులో ప్రభుత్వ భూమి లో వున్నా ఈత చెట్లను కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించు కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు జి ఓ ప్రకారం రెబ్బెన మండల గౌడ సంఘం పేరున పట్టా పాసు పుస్తకం ఇప్పించగలరని గౌడ సంఘం సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సర్వేశ్వర్ గౌడ్ ,నియోజక ఇంచార్జ్ సుదర్శన్ గౌడ్ ,జిల్లా కోశాధికారి కొయ్యడ  రాజా గౌడ్ ,యూత్ అధ్యక్షుడు శాంతి గౌడ్ ,మండల నాయకులు చిరంజీవి గౌడ్ ,నర్స గౌడ్ ,ఉమేష్ గౌడ్ మరియు సభ్యులు వున్నారు 

ఏ ఐ టి యూ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుదాస్


సమస్యలు పరిష్కరించకుంటే బొగ్గు ఉత్పత్తిని ఆపుతాం
  
          ఏ ఐ టి యూ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుదాస్  



(రెబ్బెన వుదయం ప్రతినిధి);  కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిస్కారించకుంటే సింగరేణి మొత్తం బొగ్గు ఉత్పత్తి స్తంభింప చేస్తామని ఏ ఐ టి యూ సి రాష్ట్ర ప్రధాన కార్య దర్శి భాను దాస్ అన్నారు . శనివారం గోలేటి లోని జి  ఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు . అనంతరం మాట్లాడారు . సింగరేణిలో గత 15 సం,, నుంచి పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను కాంట్రాక్టరు మార్చినంత మాత్రన కార్మికులను మర్చరాదని ,కార్మికుల సకల జనుల సమ్మె  వేతనాలు చెల్లించాలని సింగరేణి  కాంట్రాక్టు వర్కర్స్‌ మాట్లాడుతూ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కొనసాగించాలని, సకల జనుల సమ్మెలో పాల్గొన్న కార్మికులకు వడ్డీతో సహా వేతనాలు చెల్లించాలని,  తెలంగాణ రాష్టంలో నిస్వార్ధంగా 35 రోజులు పాటు సమ్మెలో పాల్గొన్న  కాంట్రాక్టు కార్మికులకు  వేతనాలు ఇవ్వాలని,   . ఆసుపత్రి అవసరం కొరకు పుస్తకాలు అందరికి ఇవ్వాలని అన్నారుకార్మికులను పర్మినెంట్ చేయాలని అన్నారు .  ఇప్పటికి అయినా రాష్ట్ర ప్రభుత్వం ,  సింగరేణి యాజమాన్యంమీద ఒత్తిడి తెచ్చి కంట్రాక్టర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రీజినల్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ , నాయకులు బ్రహ్మానందం ,  గోలేటి బ్రాంచి కార్యదర్శి చల్లూరి అశోక్, ఉపాధ్యక్షుడు లేకురి సుధాకర్, సహాయ కార్యదర్శిలు అర్ మల్లేష్, కుమార్, రాంకుమార్ పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతులపై చిన్న చూపు - టి.వి.వి.జనరల్ సెక్రటరీ (ఈ.చంద్రశేఖర్)

తెలంగాణ ప్రభుత్వం రైతులపై చిన్న చూపు - టి.వి.వి.జనరల్ సెక్రటరీ (ఈ.చంద్రశేఖర్) 


కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  తెలంగాణ ప్రభుత్వం రైతులపై చిన్న చూపు చూస్తూ రుణమాఫీని ఒకేసారి అమలు చేయకుండా రైతు ఆత్మహత్యలకు కారకులు అవుతున్నారని తెలంగాణ విద్యార్థి వేదిక జనరల్ సెక్రటరీ ఈ. చంద్రశేఖర్ అన్నారు శనివారం రెబ్బన అతిధి ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశం లో కరపత్రాలను విడుదల చేసారు. అనంతరం మాట్లాడుతూ భూమి,నీరు,విత్తనాలపై రైతుల హక్కుల సాధనని దూరం చేస్తున్నారని, బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా రుణమాఫీ మొత్తని ప్రభుత్వం ఒకేసారి చెల్లించాలని, వస్తావసాగుదారులందరికి పంట రుణాలని ఇవ్వాలని  రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిరసనగా  సమగ్ర వ్యవసాయ విధానం కోసం ఆత్మహత్యలు లేని తెలంగాణ సాధించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో టి.వి.వి ప్రెసిడెంట్ యం.దేవేందర్ , టి.వి.వి వైస్ ప్రెసిడెంట్ ఎల్.రమేష్ , రైతులు దుర్గంసోమయ్య , ఆర్.నర్సయ్య ,బానోతు.కిషన్,లక్ష్మి నారాయణ గౌడ్,కిషన్ గౌడ్,హరిలాల్ నాయక్ అజ్మీరా,ప్రేమ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 19 October 2016

కొమురవెల్లి గ్రామా సమస్యలు పరిష్కరించాలి

కొమురవెల్లి  గ్రామా సమస్యలు పరిష్కరించాలి 

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  కొమురవెల్లి గ్రామా సమస్యలు తీర్చాలని రెబ్బేన ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్ మరియు ఎం పి పి సంజీవకుమార్ కి బుధవారం కొమురవెల్లి యూత్ కమిటీ వారు వినతి పత్రం అందచేశారు అనంతరం యూత్ కమిటి అధ్యక్షులు వాడ్నలా  దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో చేతి పంపులు  చెడిపోయి తాగునీటి సమస్య ఉందని అలాగే మురికి కాలువలు శుభ్రం చేయక చెత్త చెదారం  నిండి పోయి వర్షం కురిసినప్పుడు వర్షం నీరు వెళ్ళడానికి దారిలేక మురికి నీరు రోడ్ పై మురికినీరు ఏరులై పారుతుందని అలానే రోడ్ గుంతలలో నీరు నిలిచి రవాణాకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు గ్రామా సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి గోలెం సాయికృష్ణ ,సభ్యులు పెద్దింటి శ్రీకాంత్ ,మానిగొండ కిరణ్ ,నరేష్ గౌడ్ ,సత్యనారాయణ   సందీప్ శ్రీనివాస్ గౌడ్ రాజుగౌడ్ టి ఆర్ ఎస్ నాయకులూ గోడిశెల వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

కొమరంభీం జిల్లా తహశీల్ధార్ యూనియన్ అధ్యక్షుడిగా -బండారి రమేష్ గౌడ్

కొమరంభీం జిల్లా తహశీల్ధార్ యూనియన్ అధ్యక్షుడిగా -బండారి రమేష్ గౌడ్


కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  రెబ్బెన మండల తహశీల్ధార్ బండారి రమేష్ గౌడ్ కొమరంభీం జిల్లా తహశీల్ధార్ యూనియన్ అధ్యక్షుడి గా  ఎన్నుకోబడ్డారు  రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరాం ఆధ్వర్యంలో  నిర్మల్ కడెం రెసెర్చ్లో ఏర్పాటు చేసిన  తెలంగాణ తహసీల్ధార్ల సమావేశంలో  ఎన్నుకోబడ్డారు. తహశీల్ధార్ బండారి రమేష్ గౌడ్  మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు వచ్చిన  అధ్యక్షులుగా ముందుండి కలిసికట్టుగా పరిష్కరించుకుందాం అన్నారు.

Tuesday, 18 October 2016

'రెబ్బన'లో గ్రామసభ

'రెబ్బన'లో గ్రామసభ 

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  రెబ్బెన గ్రామా పంచాయితి లో మంగళవారం నాడు పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఏ .పి .ఎం వెంకటరమణ ,కార్యదర్శి మురళీధర్,సర్పంచి పెసరు వెంకటమ్మ, ఏ.ఎం.సి వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ ఆధ్వర్యం లో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో వారు మాట్లాడుతూ రెండో విడత ఓ.డి.ఎఫ్ ఫథకం కింద అమలు చేసిన మరుగుదొడ్డ్లను    ఇంటింటి నిర్మించాలని   'స్వచ్ భారత్'లోభాగంగా పరిషారాల పరిశుభ్రత  కొరకు ప్రతి  ఇంటికి  మరుగుదొడ్లు లేని వారు ఇంటింటి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని అన్నారు. అలానే పారిశుద్యంలో బాగంగా ప్రతి ఒక కాలనీలో మురికి కాలువలు శుబ్రం చేపిస్తున్నాం అన్నారు.గ్రామా పంచాయితి లో పన్నులు వాసులు చేసి,పంచాయతీ ఆదాయాన్ని పెంచాలని, 100 శాతం పన్నులు వసూలుకు ప్రజలు సహకరించాలని కోరారు.ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ గ్రామంలో శ్వాసకోశ వ్యాధులు ప్రభులుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే గ్రామంలో 100 శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. ఈ సమావేశంలో పంచాయితి వార్డ్ మెంబర్లు,గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఏ ఐ టి యూ సి డోర్లి-1 ఫిట్ కార్యదర్శి గ జి నరసింహ్మ రావు

ఏ ఐ టి యూ సి డోర్లి-1 ఫిట్ కార్యదర్శి గ జి నరసింహ్మ రావు 

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  గోలేటి కే ఎల్ మహేంద్ర భవన్  ఏ ఐ టి యూ సి ఆఫీస్ లో జరిగిన  డోర్లి-1 ఓపెన్ కాస్ట్ జనరల్ బాడీ సమావేశం లో డోర్లి-1 ఓపె కాస్ట్ ఫిట్ సెక్రటరీ గ జి.నరసింహ్మ రావు, బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గ డి.నర్సింగరావు  ను ఎన్నుకోవడం జరిగిందని ఏ ఐ టి యూ సి గోలేటి బ్రాంచ్ కార్యదర్శి  ఎస్.తిరుపతి తెలిపారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధి గ విచ్చేసి ఆయన మాట్లాడుతు డోర్లి-1 ఓపె కాస్ట్ లో కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం కృషిచేయాలని సింగరేణిలోనే ఉత్పత్తి లో మొదటి స్థానం లో ఉన్న డోర్లి-1 ఓపె కాస్ట్ లోని కార్మికులకు ప్రోత్సహకాలు అందించాలని కాంటీన్ ను విశ్రాంతి గదులలో వసతులని మెరుగు పరచాలని హెచ్ ఈ ఎం ఎం మిషనరిల మెయిన్టెనెన్సు ను పూర్తి స్థాయి లో నిర్వహించాలని జనరల్ షిఫ్ట్ కార్మికులకు క్వారీ కాన్వేయన్సు  ను మెరుగు  పరచాలని ఆయన డిమాండ్ చేసారు ఏ ఐ టి యూ సి కార్మికుల సమస్యల కోసం మరియు సంక్షేమానికి నిరంతరం పోరాడుతుందని  కార్మికుల జండా ఎర్రజండా అని దానిని కార్మిక వర్గం ఆదరించాలని ఆయన కోరారు.ఈ సమావేశం లో బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఎం. రామారావు బి.జగ్గయ్య ఓసీపీ ల ఇంచార్జి ఎం.లక్ష్మీనారాయణ  సిపిఐ మండల కార్యదర్శి పొన్న.శంకర్ నాయకులు పి .ఆర్.ప్రకాష్ ఖుద్దూస్ డి.శ్రీనివాస్ కోట.బాపు చంద్రయ్య శ్రీనివాస్ పాల్గొన్నారు. 

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి;-ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం రవీందర్

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి;
ఏ ఐ ఎస్ ఎఫ్  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం రవీందర్

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  కుంమ్రం భీం జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎ ఐ ఏస్ ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం రవీందర్  పరిష్కరించాలని మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ చాంపాన్ లాల్ కు జిల్లా సమితి పక్షాన వినత పత్రం అందజేశారు . అనంతరం రవీందర్ మాట్లాడుతూ  ఎస్ కె ఈ  డిగ్రీ కళాశాలను ప్రభుత్వపరం చేయాలని అలాగే ఖాళీగా ఉన్న అధ్యపక పోస్టులను భర్తీ చేయాలని,జిల్లాలో డిగ్రీ,పాలిటెక్నిక్,ఐ టి ఐ  కళాశాలలను మంజూరు చేయాలని,రెబ్బెనలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను స్వంత భవనంలోకి తరలించాలని,పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ ,రియింబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో మూసివేసిన సంక్షేమ వసతి గృహలను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా సమితి ఆద్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో  ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యాక్షులు ఆత్మకురి ప్రశాంత్,డివిజన్ అధ్యక్షుడు బవునే వికాస్,కార్యదర్శి పూదరి సాయి,నాయకులు ప్రదీప్,మహేష్,సందీప్,సాయి,భీమ్ తదితరులు పాల్గొన్నారు.

Monday, 17 October 2016

కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని ఇస్తున్న నాయకులు

కేంద్ర మంత్రికి    వినతి పత్రాన్ని ఇస్తున్న నాయకులు

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  బెల్లం పెళ్లికి వఛ్చిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు సీ పీ ఐ ,  ఏ ఐ టి యు సి కాంట్రాక్ట్ కార్మిక సంగం బెల్లంపెల్లి ఏరియా నుండి వినతి పత్రాన్ని సోమవారం అందజేశారు . ఈ సందర్బంగా ఏరియా కాంట్రాక్ట్ కార్మికులకు ఉన్న సమస్యలను వివరించారు .సి పి  ఐ మాజీ ఈము ఎల్ ఏ , రాష్ట్ర నాయకులు గుండా మల్లేష్ మాట్లాడుతూ  రాష్ట్ర  ప్రభుత్వామ్ కాంట్రాక్ట్ కార్మికుల పై సవతి తల్లి ప్రేమను చూపెడుతున్నదని , సింగరేణి కార్మికులతో సమానంగా పని చేస్తూ , తక్కువ జీతాలు తీసుకొంతున్నామని అన్నారు . సింగరేణి సంస్థ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నామని , సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ కార్మికులతో ఊడిగం చేయించు కార్మికులను పట్టించుకోవడం లేదని అన్నారు . హాస్పిటల్ పుస్తాకాలు ఇవ్వలేదని , సి ఎం పి  ఎఫ్ వివరాలు తెలుపడం లేదని పేర్కొన్నారు . కాంట్రాక్ట్  కార్మికులను వెంటనే పామినెంట్ చేయాలని అన్నారు .  ఈ కార్య క్రమములో   ఏ ఐ టి యు సికాంట్రాక్ట్ బెల్లంపల్లి ఏరియా అధ్యక్షుడు బోగే ఉపేందర్ లతో పాటు తదితరులు ఉన్నారు.

గ్రామా సమస్యను పరీక్ష రించాలి ---- కొమురవెల్లి యూత్

గ్రామా సమస్యను పరీక్ష రించాలి ---- కొమురవెల్లి యూత్ 

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెండు నెలలు క్రితం రోడ్డును అడ్డంగా మురికి నీటి పైపు నిర్మాణం కోసం తవ్వి  నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు  మురికి నీరు పైపు నిర్మాణం చేయకపోవడంతో రహదారికి ఇబ్బందిగా మారింది అని కొమురవెల్లి యూత్ కమిటీ యువకులు  ఆరోపించారు కావున ఈ పైపు లైను నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి గ్రామస్తుల ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు

పాఠశాల భవనం త్వరగా పూర్తి చేయాలన్నారు -----ఎం పి పి


పాఠశాల  భవనం త్వరగా పూర్తి చేయాలన్నారు -----ఎం పి పి 

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): కొండపెల్లి పాఠశాలలో నూతనముగా నిర్మిస్తున్న భవనాన్ని సకాలంలో పూర్తి చేయాలి అని ఎం పి పి  సంజీవ్ కుమార్ సందర్శించి సదరు భవనం కాంట్రాక్టర్ జె ఈ లను ఆదేశించారు అలాగే పాఠశాల విద్యను  మరియు భోజనాన్ని పరిశీలించి మరింత నాణ్యతగా మెరుగు పర్చాలని అన్నారు ఈ భవనం ఆర్ వి ఎం నిధుల నుంచి 12 లక్షల వ్యాయామంతో నిర్మిస్తున్నట్టు ఈ భవనం సకాలంలో పూర్తి అయినట్లు అయితే విద్యార్థులకు విద్య బోధన  మెరుగు పడుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎచ్ ఎం ప్రభాకర్ ,ఉప సర్పంచ్ హరి ప్రసాద్ ఉపాధ్యాయులు  మరియు తదితరులు వున్నారు.

పగలే వెలుగు తున్న దీపాలు

పగలే వెలుగు తున్న దీపాలు 

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రాత్రి వెలగ ల్సిన విధి దీపాలు పగలే వెలుగు తున్నాయి రెబ్బెన మండలంలోని కిష్టాపూర్ గ్రామా పంచాయితీ లో ఈ దుస్థితి నెలకొల్పింది అని గ్రామస్తులు వాపోయ్యారు రాత్రి వెలగాల్సిన విధి దీపాలు పగలు కూడా వెలుగు తూ వున్నడం వల్ల దీపాలు నాణ్యత కోల్పోయి రాత్రి వెలగడం లేదని ,ఒక పక్కన విద్యుత్తుని నీరుని వృధా చేయరాదు అంటూ ఉండగా ఇలాంటి వాటితో  ప్రభుత్వఆదాయానికి గండి పడుతుందని గ్రామా ప్రజలు అంటున్నారు.

ఓ డి ఎఫ్ పథకంలో మరుగు దొడ్ల భూమి పూజ

ఓ డి ఎఫ్ పథకంలో మరుగు దొడ్ల భూమి పూజ 


కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలంలో ఇంద్ర నగర్ లోని సోమవారం రోజున  నూతన మరుగు దొడ్లకు  భూమి పూజ చేశారు ఈ  సందర్భముగా ఎం పి పి  సంజీవ్ కుమార్ జడ్ పి టి సి  బాపూరావు పెసర వెంకటమ్మ మాట్లాడుతూ స్వచ్ భరత్ లో భాగముగా ఓ డి ఎఫ్ పథకంలో గ్రామా పంచాయితీ లో మొత్తం 560 నివేదిక పంపగా 360 మాత్రమే మంజూరు అయినాయి వాటిని సకాలంలో పూర్తి చేసి పర్యావరణ కాలుష్యాన్ని నివారిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్ తహసీల్దార్ రమేష్ గౌడ్  ఏ ఐ ఎం సి వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ ,ఆర్ ఎస్ డబ్ల్యూ సోని సెక్రటరీ మురళీధర్సిం,ఉప సర్పంచ్ శ్రీధర్ , సింగిల్  విండో డైరెక్టర్ మధునయ్య ,నాయకులు సుదర్శన్, నవీన్ ,వెంకన్న ,అశోక్ ,చిరంజీవి ,బరత్వాజ్,తదితరులు పాల్గొన్నారు  

జోడేఘాట్ ను జిల్లా పర్యాటక క్షేత్రముగా రూపు దిద్దుతం


జోడేఘాట్ ను జిల్లా  పర్యాటక క్షేత్రముగా రూపు దిద్దుతం




కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): జోడేఘాట్ ను జిల్లా  పర్యాటక క్షేత్రముగా అభివృద్ధి చేస్తామని మంత్రులు చందూలాల్, జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి లు   అన్నారు.  కొమురం భీం జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్ కొమురం భీం 76 వ వర్థంతి ని ఆదివారం ఘనముగా నిర్వహించారు.  ఈ సందర్భముగా జోడేఘాట్ లో రూ  25 కోట్లతో నిర్మించిన ట్రైబల్ మ్యూజియం ని మంత్రులుఆదిలాబాద్ ఎం పి గోడం నగేష్ ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కొవ లక్ష్మి సిర్పూర్ ఎం ఎల్ ఏ కోనేరు కోనప్ప తో కల్సి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ జల్ జంగిల్ జమీన్ కోసం నిజాం నవాబు గుండెల్లో వణుకు పుట్టించిన పోరాట యోధుడు కొమురం భీం అని , ఆ యోధుడి 76 వ వర్ధంతిని అధికారికంగా ఎంతో ఘనంగా నిర్వహించామని  అన్నారు.   ఈ మహావీరుడి ది తెలంగాణ కావడం, ప్రతి తెలంగాణీయుడు గర్వించే విషయం అని కొనియాడారు . అనంతరం జిల్లా అదికారులు ఏర్పాటు చెసిన స్టాల్ లను పరిశీలంచారు .ఈ కార్యక్రమం లో ఏర్పాటు చెసిన దర్బారులో పాలుగోని భీం గురించి గెరిల్లా పోరాటం మరియు జల్ జంగల్ జమీన్ గురించి పోరాడి అశువులు బాసిన మహానీయుడు అన్నారు  తెలంగాణ లోని కొత్త 31వ జిల్లా గా ఏర్పడిన కుంరం భీం, అసిఫాబాద్ నియోజకవర్గం లోని భీం పురిటి గడ్డ జోడేఘాట్ కావడం తో కె సి ఆర్  అసిఫాబాద్ ను జిల్లా గా ఏర్పాటు చేశారు .స్వంత జిల్లాలో కుంరం భీం 76వ వర్దన్తి ఐ టి డి ఏ  అదికారులు ఏర్పాట్లు చేశారు .ఈ గిరిజన దర్బారు కు అద్యక్షులు గా అసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి వహించారు .భీం వర్దన్తి లో బాగంగా గిరిజన మ్యూజియం ,భీం 8 అడుగుల  కాంస్య విగ్రహం ను ఆవిష్కరించారు .పర్యాటక శాక ఛైర్మన్ పి రాములు ,మాజీ ఎం ఎల్ ఏ  ఆత్రం సక్కు ,మాజీజెడ్ పి  ఛైర్మన్ సీడం .గణపతి ,జిల్లాలోని అదికారులు కలెక్టర్ చంపాలాల్ జె సి అశోక్ కుమార్ ,డి ఆర్ ఓ అద్వైత్ కుమార్ సింగ్ పర్యటకశాక కమిషనర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు 

Saturday, 15 October 2016

అబ్దుల్ కలాం సేవలు మరువ లేనివి -డి.విజయ కుమారి

అబ్దుల్ కలాం సేవలు మరువ లేనివి -డి.విజయ కుమారి 

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం సేవలు మరువలేనివని ఎస్ . వి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ దీకొండ  విజయ కుమారి అన్నారు . శనివారం పాఠశాలలో అబ్దుల్ కలాం 85 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగా విజయ కుమారి మాట్లాడారు . రాష్ట్ర పతి గా అబ్దుల్ కలాం నిరాడంబ జీవితాన్ని గడిపారని పేర్కొన్నారు . దేశానికి సైన్సీస్టుగా ఎన్నో సేవలు చేశారని , అతని సేవలు మరువలేనివని కొనియాడారు . పేద కుటుంబములో పుట్టి , శాస్త్రవేత్తగా ఎదిగి , రాష్ట్ర పతిగా దేశానికి ఎనలేని సేవలు చేసి దేశ గౌరవం కాపాడిన మహా గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం అని తెలిపారు . విద్యార్థులు అతన్నీ ఆదర్శనంగా తీసుకొని , సమాజములో మంచి గుర్తింపు పొందాలని అన్నారు  . అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచారు . ఈ కార్యక్రమములో ప్రధానోపాధ్యాయుడు దీకొండ  సంజీవ్ కుమార్ , ఉపాధ్యాయులు జాడి తిరుపతి  , లెక్కల రాజన్న , ఎస్ డి . రేష్మ , మల్లేశ్వరి ,యై .  సుజాత , ఉష , వినీత , విద్యాసాగర్ , ఆశ లతో పాటు విద్యార్థుల తల్లి తండ్రులు , విద్యార్థులు ఉన్నారు .

ఉద్యోగాల పునరుద్ధరణ కె సి ఆర్ ఘనతే- వెకట్ర్రావు


ఉద్యోగాల పునరుద్ధరణ    కె సి ఆర్  ఘనతే- వెకట్ర్రావు 

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): సింగరేణి ఉద్యోగులకు వారసత్వ పునరుద్ధరణ కేవలం ముఖ్యమంత్రి కె సి ఆర్ ఘనతయేనని , సింగరేణిలో గులాబీ జెండా ఎగుర వేయడం ఖాయమని టి బి జి కె ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ రావు అన్నారు . గోలేటి లోని తెలంగాణ భవన్  లో ఏర్పాటు చేసిన సభ లో ఆయన మాట్లాడారు .  ఆదిలాబాద్ ఎం ఎల్ సి పురాణం సతీష్ మాట్లాడుతూ సింగరేణి వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ చేయడం కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ ఘనతే అని అన్నారు. సకల జనుల సమ్మెలో కార్మికులు  అందరు ఏకమయి టి ఆర్ ఎస్ పార్టీకి అండగా ఉందన్నారు కార్మికులు తెలంగాణ రాష్ట్రము కోసం ఎంతో బలాన్ని ఇచ్చారు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎం ఎల్ ఏ దుర్గం చిన్నయ్య , ఆసిఫాబాద్ మార్కెట్  వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ,  టి బి జి కె ఎస్ నాయకులు మిర్యాల రాజి రెడ్డి ,బాపురావ్ ,టి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు 

సింగరేణి గుర్తింపు సంఘం టి బి జి కె ఎస్ కార్మికులను మోసం చేస్తున్నది


సింగరేణి గుర్తింపు సంఘం టి బి జి కె ఎస్ కార్మికులను  మోసం చేస్తున్నది 

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): సింగరేణి గుర్తింపు కార్మిక  సంగం 4 సంవత్సరాల నుండి కార్మికులను మోసం చేస్తున్నాడని గోలేటి బ్రాఞ్చ  తిరుపతి అన్నారు .    రెబ్బెన  మండలం గోలేటి లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎ ఐ టి యు సి  కార్యదర్శి ఎస్ తిరుపతి మాట్లాడుతూ వి ఆర్ ఎస్ ,డిస్మిస్ కార్మికుల ఉద్యోగ అవకాశాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు  వారసత్వంపై  ముఖ్యమంత్రి  కె సి ఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నామని,ఆ ప్రకటనలో  స్పష్టత లేక పోవడం లో సింగరేణి కార్మికులంతా అయోమయోల్లో వున్నారు అని అయన తెలిపారు   ఎ ఐ టి యు సి ఆధ్వర్యంలో వారసత్వ ఉద్యోగాలు కోసం అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని గనుల వద్ద నిరసన కార్యక్రమాలు జి ఎం కార్యాలయం ముందు ధర్నాలు ,అదేవిధముగా గోలేటి గని నుంచి మణుగూరు వరకు గనులను సందర్శిస్తూ పోరుయాత్ర నిర్వహించామన్నారు పది వేల కార్మికులతో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని  ఎ ఐ టి యు సి ఆధ్వర్యంలో ముట్టడి చేసాము అని అన్నారు ఈ ఆందోళన ఫలితంగానే వారసత్వంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు సింగరేణి గుర్తింపు సంఘం టి బి జి కె ఎస్ కార్మికులను నాలుగేళ్లు మోసం చేస్తూనే వస్తుందని అంతర్గత కుమ్ములాటలతో డబ్బుల కోసం కోర్టుల చుట్టూ తిరిగి నాయకులు జైలుపాలయ్యర న్నారు గెలవ గానే మొదటి సంతకం వారసత్వ ఉద్యోగాలపై పెడతామని, పెట్టలేదని ఇది కార్మికులను మోసం చేసినట్టు కదా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఆర్గనైజేషన్ కార్యదర్శులు,తిరుపతి, గుండె వెంకటి, నాయకులూ సత్యనారాయణ, సురేష్, శంకర్ తదితరులు వున్నారు .