Wednesday, 30 September 2015

వైస్ చైర్మన్ కోరుతూ ఎంఎల్ఎ వినతీ పత్రం


ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎంఎల్ఎ కోవ లక్ష్మికు ఆదివారం నాడు త్వరలో నియామకం జరిగే మార్కెట్ కమిటీ పదవులలో వైస్ చైర్మన్ పదవిని రెబ్బెన మండల యూత్ ప్రెసిడెంట్ దాసారపు వెంకట్రాజం కు ఇవ్వాలని తెరాస తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైశ్వాల్  వినతీ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యాక్రమంలో జమ్మి, శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర్, తదీతరులు పాల్గొన్నారు

ఘనంగా కొండలక్ష్మణ్‌ జయంతి 




రెబ్బెన మండల కేంద్రమైన గోలేటిలో బీసీ హక్కుల సంఘర్షణ సమితీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు కొండలక్ష్మణ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ హక్కుల సంఘర్షణ సమితీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం మంత్రి పదవిని వదులుకున్న గొప్ప మహానీయుడు బాపూజియేనన్నారు. కొండలక్ష్మణ్‌ బాపూజీ అడుగుజాడల్లో నడుచుకోవాలన్నారు. కూల్చివేసిన ఇంటి వద్దనే ఆయన ఆడిటోరియం ఏర్పాటు చేయాలన్నారు. ఏదో ఒక జిల్లాకు కొండలక్ష్మణ్‌పేరు పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బోగే ఉపెంధర్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కడతల మల్లయ్య, రమేష్, సుధాకర్, ప్రభాకర్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.



గుడుంబా నిషేధం పై ఎక్ష్సిజ్ అధికారుల అవగాహన ర్యాలి

  

గుడుంబా నిషేదానికి ప్రతివొక్కరు సహకరించాలని ఎక్ష్సిజ్ అధికారి  సిఐ ఫకీర్ అన్నారు.  రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామపంచాయితిలో మంగళవారం నాడు గుడుంబా నిషేధం పై  ర్యాలి చేపట్టి ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఎక్ష్సిజ్ అధికారులు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యార్థులు,నాయకులు పెద్ద సంఖ్యలోపాల్గొని గుడుంబా వల్ల కుటుంబాలు చిన్న బిన్నం అవుతున్న తీరును వివరించారు.గుడుంబా తయారీ నిషేధం పై అవగాహన కల్పించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కొత్త గా ప్రవేశపెట్టిన  కోరారు గుడుంబా వల్ల పీడిత ప్రజలు ఆకాల మరణాలు చెందుతున్నారని దీని  వల్ల కుటుంబాలు రోడ్ న పడుతున్నారాని సి ఐ తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎస్సై సుందరసింగ్ తో పటు సిబ్బంది మరియు గ్రామా ఉపసర్పంచు రవినాయక్,సేవలాల్ కమిటి అద్యక్షులు దుప్పనయాక్,బలరాం నాయక్,రవి,దిలీప్,రవి,మోహన్ మరియు స్థానిక ప్రజలు పాల్గున్నారు.


  

ప్రాణహిత చేవెళ్ళని తుమ్మిడి హెట్టి వద్ద నిర్మించాలి





ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టును కాళేశ్వరం వద్ద కాకుండా తుమ్డిహెట్టి వద్ద నిర్మించాలని మాజీ మంత్రి, తూర్పు జిల్లా అధ్యక్షుడు బోడ జనార్ధన్ అన్నారు. మంగళవారం నాడు పాదయాత్ర రెబ్బెనకు చేరుకుంది. తెదేపా నాయకులు రెబ్బెన మండల తహశిల్దార్ రమేష్ గౌడ్ కు వినతీ పత్రం అందజేశారు. బోడ జనార్ధన్, రితేష్ రాథోడ్ మాట్లాడుతూ ఆసిఫాబాద్, రెబ్బెన మండలాలకు 23,500 ఎకరాల నీరు అందించే వట్టివాగు ప్రాజెక్టు కాలువలు చెడిపోయి తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ విషయంపై చాలా సార్లు రైతులు విన్నవించుకోగా అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదు. ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టును కాళేశ్వరం వద్ద నిర్మిస్తే దాని ద్వారా రైతులు తీవ్రంగా నష్ట పోవడము జరుగు తుంది. ప్రస్తుత పరిస్థితులలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని. రైతులను అస్సలు పట్టించుకోవడం లేదు. చివరి భూములు రైతులకు కూడా నీరందెల చూసి రైతులు ఆర్ధికంగా నష్టపోకుండా చేసి వారిని ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో జిల్లా తెదేపా మండల అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి. జిల్లా యువజన అధ్యక్షులు బావాడ తిరుపతి, మండల అధ్యక్షుడు మోడెమ్ సుదర్శన్ గౌడ్, తెదేపా నాయకులు, రైతులు పాల్గొన్నారు. 

వందశాతం వయోజన విద్యను అందించాలి

సాక్షర భారత్‌ ఆధ్వర్యంలో వయోజన విద్యను అందిస్తున్న అది పూర్తిస్థాయిలో అందడం లేదని చదువుకున్న విద్యార్థులే తల్లిదండ్రులకు విద్యను అందించే విధంగా చర్యలు చేపట్టాలని రెబ్బెన ఎంఈఓ వెంకటేశ్వరస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తాయి వీసీఓలు యువకులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. - 

.పశువైద్య శిబిరం


రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీలో బుధవారం పశువైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు డా.సాగర్‌ తెలిపారు. గాలికుంటు వ్యాధికి ముందస్తుగా చర్యలుగా ఈ టీకాలు వేస్తున్నట్లు గొలేటిలో దాదాపుగా 457 టీకాలు వేసినట్లు పశు వైద్యుడు సాగర్  తెలిపారు.పశువైద్య శిబిరంలో

నిమజ్జనం శాంతియుతంగా జరపాలి-ఎస్సై హనూక్

నిమజ్జనం శాంతియుతంగా జరపాలి-ఎస్సై హనూక్ 


గణేష్ నిమజ్జనం అందరు కలిసి మత సామరస్యంగా శాంతి యుతంగా జరపాలని రెబ్బెన ఎస్సై హనూక్ అన్నారు. శుక్రవారం రెబ్బెన తహశిల్దార్ రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రెబ్బెనలో గతంలో ఎలాంటి సంఘటనలు జరగిన దాఖాలు లేవని అదేవిధంగా కులమత భేదం లేకుండా సామరస్యంగా శనివారం రోజు నిమజ్జనం నిర్వహించాలని అన్నారు. మత్తు పానీయాలు సేవించరాదని, క్రమ పద్ధతిలో  వెళ్లాలని, ట్రాఫిక్ కు ఎలాంటి అడ్డంకులు కలగకుండా కమిటీ సభ్యులు చూసుకోవాలని అన్నారు. అనంతరం నిమజ్జన స్థలాలు పరిశీలించారు. ఈ కార్యాక్రమంలో ఎంపిపి కార్నాధం సంజీవ్, ఎమ్మార్వో రమేష్ గౌడ్, జడ్పిటిసీ అజ్మెర బాబురావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

శ్రీ సాయి గణేష్ మండలి

శ్రీ సాయి గణేష్ మండలి వద్ద ఎంఎల్ఎ కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు



మండల కేంద్రంలోని శ్రీ సాయి గణేష్ మండలి నినాయకునికి ఆసిఫాబాద్ ఎంఎల్ఎ కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు చేశారు. బ్రాహ్మణు వేద మంత్రాలతో కుమ్కుమారచనలు చేయించారు. అనంతరం తెరాస తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు  నవీన్ జైశ్వాల్ ఆధ్వర్యంలో తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్ కు ఎమ్మెల్సి రావాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నసంతర్పణ చేశారు. ఎంఎల్ఎ కోవ లక్ష్మి వచ్చిన భక్తులందరికీ అన్న సంతర్పణ   చేసింది. సాయంత్రం గణేష్ మండలి భక్తులు కీర్తనలు భజనలు చేశారు. ఎంపిపి కార్నాధం సంజీవ్, ఎమ్మార్వో రమేష్ గౌడ్, జడ్పిటిసీ అజ్మెర బాబురావు, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఘనంగా బక్రీద్ పండగ

రెబ్బెనలో ముస్లిం సోదరులు బక్రీద్‌ పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సామూహిక ప్రార్థనలు, ఖురాన్‌ సూక్తుల పఠనాలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. బంధువు, మిత్రులను కలిసి ముస్లిం సోదరులు ముబారక్‌ తెలిపారు మసీదులు, ఈద్గాల ప్రాంగణాల్లో నమాజ్‌లతో కిక్కిరిసిపోయాయి. ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మండలంలోని అన్ని గ్రామాలలో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.

Wednesday, 23 September 2015

మాజీ ఎంఈవో కు ఘన సన్మానం




రెబ్బెన మండలలో గతంలో మండల విద్యాధికారిగా విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్ళిన మండల విద్యాధికారి మహేశ్వర్ రెడ్డికి స్థానిక ఎంపిడీవో కార్యాలయంలో వీడ్కోలు సమావేశం నిర్వహించి ఘనంగా సన్మానించారు. వారు పని చేసిన ఏడాది కాలంలో విధ్యాభివృద్ధికి తనవంతు కృషి చేశారని అందరు ప్రశంశించారు. అందరితో స్నేహ పూర్వకంగా మెలుగుతూ స్నేహ దృక్పథంను ప్రదర్శిస్తూ మండల విద్యాధికారిగా అందరి మన్ననలను పొందారని అన్నారు. ఈ కార్యాక్రమంలో ఎంపీపీ కే,సంజీవ్ కుమార్, జడ్పిటీసి అజ్మెర బాబురావు, ఎంఈవో వెంకటేశ్వర స్వామి, ఎంపిడీవో ఎంఏ హలీం, ఎమ్మార్వో రమేష్ గౌడ్, మరియి పీఆర్టియి నాయకులు, మండల ఉపాధ్యాయిలు పాల్గొన్నారు.

జాతీయ పోటీలకు ఎంపిక

జాతీయ పోటీలకు ఎంపిక

చత్తిస్ గద లోని బిలాయ్ లో జరిగే జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎన్,శ్రీనివాస్, అజయ్, దిలీప్, శాంతి కుమార్, స్వాతి ఎంపికైనట్లు బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి తెలిపారు. వీరు 24, 26 తేదీలలో జరిగే పోటిలలో జరిగే పాల్గొంటారని తెలిపారు.

త్రాగు బోరులో కలిషిత నీరు,,విద్యార్థులతో వెట్టి చాకిరి

త్రాగు బోరులో కలిషిత నీరు,,విద్యార్థులతో వెట్టి చాకిరి

పూర్తికాని మరుగు దొడ్లు-- ఎన్,ఎస్,యు,ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి



రెబ్బెన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాటశాలలో త్రాగు నీటి బోరుబావిలో నీరు మొత్తం మురికిగా వస్తున్నాయని, విద్యార్థులతో వెట్టి చాకిరి చేస్తునారని ఎన్,ఎస్,యు,ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ అన్నారు, బుధవారం ఆయన స్వయంగా పాటశాలకు వెళ్లి పరిశీలించగా త్రాగు నీటి బోరుబావి పూర్తిగా మట్టితో కలిషితం అయ్యిందని, విద్యార్థులు ఈ నీటిని త్రాగి వ్యాదుల బారిన పడుతున్నారని, మరుగు దొడ్లు పూర్తిగా నిర్మించలేదని అన్నారు. అదేవిధంగా విద్యార్థులను కించపరిచేలా వారితో జాతీయ రహాదారిపై పెట్టెలను మోపిస్తున్నారని తెలిపారు.
ఎచ్ఎం స్వర్ణలత-- బోరుబావిలో నీరు మురికిగా వస్తున్నాయన్న మాట నిజమేనని కాని విద్యార్థులు వాటిని త్రాగడం లేదని, కొత్తగా వచ్చానని విద్యార్థులతో పనులు చేపించడం లేదని పునరావృతం కాకుండా చూస్తానని అన్నారు.

ఆర్జెడి ఆకస్మిక తనిఖీ

ఆర్జెడి ఆకస్మిక తనిఖీ


రెబ్బెనలోని ప్రభుత్వ ఉన్నత పాటశాలను వరంగల్ ఆర్జెడి బాలయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎచ్ఎం స్వర్ణలతను రికార్డులు, పాటశాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. గతంలో 32% ఉత్తిర్నత వచ్చిందని ఈ సం. 100% ఉత్తిర్నత వచ్చేలా విద్యార్థులను తయారు చేయాలని పాటశాల ఉపాద్యా యిలకు పేర్కొన్నారు.

Monday, 21 September 2015

ఘనంగా లక్ష్మణ్‌ బాపూజీ వర్థంతి వేడుకలు

ఘనంగా లక్ష్మణ్‌ బాపూజీ వర్థంతి వేడుకలు


తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్థంతి వేడుకలను సోమవారం రెబ్బెన మండలంలోని గోలేటిలో పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు పొన్న . శంకర్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్‌ బాపూజీ అలుపెరుగని పోరాటయోధుడని తెలంగాణ ఉద్యమంలో ఈయన  సేవలు మరువలేమని, 2012 సెప్టెంబర్‌ 21న పరమపదించిన కొండా లక్ష్మణ్‌ నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడటంతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై అనేక పోరాటాలు చేశారు. 1942-43 క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని ,1949 సాయుధ పోరాటంలో తెలంగాణా కోసం పోరాడారని అన్నారు. 5 సార్లు యం.ఎల్.ఎ  గా చేసి మంత్రి పదవిని కూడా చేపట్టారని అన్నారు. తెలంగాణా ఉద్యమం లో మంత్రి పదవిని తృణ ప్రాయంగా వదులుకొన్న గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో పద్మశాలి యువజన సంఘం అద్యక్షుడు బోగే . ఉపేందర్, నాయకులు రాజేశ్వర్ ,మొగిలి,సత్యనారాయణ, వెంకట నారాయణ, సందీప్, సాయి , శివకుమార్ లు పాల్గొన్నారు

బతుకమ్మ ఆడుతూ ఆశా కార్యకర్తల వినూత్న నిరసన

బతుకమ్మ ఆడుతూ ఆశా కార్యకర్తల వినూత్న నిరసన 


రెబ్బెనలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కార్యాలయం ముందు సమ్మెలో భాగంగా ఆశా కార్యకర్తలు తెలంగాణా ఆడపడుచుల ముఖ్య పండగైన బతుకమ్మ ఆడి  వినూత్నరీతిలో నిరసన తెలిపారు  సీ,అయ్,టీ,యు మండల అధ్యక్షురాలు ఆశ కార్యకర్త అనిత మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పించాలని, కనీస వేతనం రూ.15వేలు చెల్లించాలని, అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, కాలంలో  తమ నిరసన 20వ  రోజుకు చేరినా  ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోకపోవడం దుర దృష్టకర మన్నారు. గ్రామీణ స్థాయిలో పనిచేసే వైద్యసిబ్బందితో విధులు నిర్వహిస్తున్నప్పటికి ఉద్యోగ భద్రత కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రోగులకు వైద్యసేవలు అందించి  ఉన్నప్పటికి  కనీస వేతనంతో తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రమ, ఆసంఘం కార్యకర్తలు కవిత,స్వప్న, తిరుమల, ఛాయ ,రాజేశ్వరి,  నిర్మల,  రమాదేవి,  లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Sunday, 20 September 2015

పురాణం సతీష్ కు ఎమ్మెల్సి రావాలని అన్నసంతర్పణ

పురాణం సతీష్ కు ఎమ్మెల్సి రావాలని అన్నసంతర్పణ


తెరాస తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్ ఎమ్మెల్సి టికెట్టు రావాలని రెబ్బెనలోని శ్రీ బాలాజీ గణేష్ మండలి వద్ద తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్ ఆధ్వర్యంలో ఆదివారం అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో కొబ్బరికాయలు కొట్టి  వినాయకునికి ప్రత్యేక  పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులకు అన్నసంతర్పణ చేశారు. సాయంత్రం భక్తి గీతాలు, కీర్తనలు పాడుతూ భజనలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సై సేఎచ్ హనూక్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యాక్రమంలో జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ, టౌన్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్, వార్డు సభ్యులు చిరంజీవి, ఎస్,వీ, పాటశాల కరస్పాండెంట్ సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.

ఒంటి కాలు ఫై వినూత్న నిరసన

ఒంటి కాలు ఫై వినూత్న నిరసన

 రెబ్బెనలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కార్యాలయం ముందు నిరవధిక సమ్మె  ఆదివారానికి 19వ రోజుకు చేరిన తమ న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చడం లేదని ఆశా కార్యకర్తలు ఒంటి కాలు ఫై వినూత్నరీతిలో నిరసన  తెలిపారు. సమ్మెలో భాగంగా  సీ,అయ్,టీ,యు మండల అధ్యక్షురాలు ఆశ కార్యకర్త అనిత మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పించాలని, కనీస వేతనం రూ.15వేలు చెల్లించాలని, అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, కేవలం నాలుగు వందల రూపాయల వేతనంతో ముప్పై రోజులు కష్టపడి పనిచేస్తున్న సకాలంలో ఆగౌరవ వేతనం కూడ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోకపోవడం దుర దృష్టకర మన్నారు. గ్రామీణ స్థాయిలో పనిచేసే వైద్యసిబ్బందితో విధులు నిర్వహిస్తున్నప్పటికి ఉద్యోగ భద్రత కల్పించ డం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రోగులకు వైద్యసేవలు అందించిన్నప్ప టికి  కనీస వేతనం పెంచి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రమ, ఆ సంఘం కార్యకర్తలు రమాదేవి, రాజేశ్వరి, లక్ష్మీ, కవిత, చాయ,నిర్మల ,  స్వప్న, తిరుమల, తదితరులు పాల్గొన్నారు.

Saturday, 19 September 2015

అన్నదాన కార్యాక్రమాన్ని విజయవంతం చేయండి- శ్రీ బాలాజీ గణేష్ మండలి

అన్నదాన కార్యాక్రమాన్ని విజయవంతం చేయండి- శ్రీ బాలాజీ గణేష్ మండలి




వినాయకచవితి ఉత్సవాలు రెబ్బెన మండల శ్రీ బాలాజీ గణేష్ మండలి పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి.భక్తి శ్రద్ధలతో వినాయకునికి దూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ఈ రోజు శ్రీ బాలాజీ గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్ గారి ఆధ్వర్యంలో తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్ ఎమ్మెల్సి కావాలని కోరుకుంటూ నిర్వహిస్తున్నమని ప్రకటన లో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సర్వభూపాల వాహనంపై శ్రీవారు

తిరుమల, సెప్టెంబర్ 19: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రాత్రి మలయప్ప స్వామి ఉభయ వేదేరులతో కలిసి బాలకృష్ణుని రూపంలో సర్వ భూపాల వాహనంపై తిరుమాడవీధుల్లో ఊరేగారు. స్వామివారిని దర్శించుకున్న భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. తిరుమాడవీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. మరోవైపు శ్రీవెంకటేశ్వర స్వామి వారి గరుడసేవకు టీటీడీ సన్నద్ధమైంది. అశేష సంఖ్యలో తరలివస్తున్న భక్తజనానికి సేవలందించడానికి దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు

అకాల వర్షానికి భారి నష్టం

    పత్తిపంట రైతన్నలను నిండ ముంచిన భారి వర్షాలు 


అకాల వర్షానికి భారి పంట నష్టం,,సర్వే చేసిన అధికారులు



రెబ్బెన మండలలోని వంకులం గ్రామానికి చెందిన రైతులు రెండు రోజులుగా కురుస్తున్న భారి వర్షానికి వంకులం శివారులో పత్తి పంట బాగా నష్ట పోయిందని రైతులు అందించిన వినతీ పత్రానికి శనివారం నాడు తహశిల్దార్ రమేష్ గౌడ్ ఆదేశాల మేరకు ఆర్ఐ అశోక్, వీఆర్వో వాసుదేవ్, ఎఈవో మార్క్ ఆధ్వర్యంలో రైతుల సమక్షంలో సర్వేను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 119 మంది పట్టా రైతులకు సంబంధించిన 93 ఎకరాల పత్తి పంట నష్టపోయినట్టు సర్వేలో తేలిందని, సర్వే నివేదికను పైఅధికారులకు పంపిస్తామని త్వరలోనే నష్ట పరిహారం వచ్చేలా చూస్తామని అన్నారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వంకులంలోని రైతులు పూర్తిగా పత్తి పంటపై ఆధారపడి ఉన్నారన్నారు, రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా పెద్ద వాగు ఒడ్డున పువ్వు దశలో వున్న పత్తి పంట పూర్తిగా నేలరాలిందని దీంతో సుమారు 150 మంది పట్టా రైతులు అందరు రోడ్డున పడ్డారని, కావున నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇప్పించాలని వాపోయారు. ఈ సర్వేలోమాజీ సర్పంచ్ ప్రేమ్ దాస్, లోకండే పురుషోత్తం, రైతులు ఎలకర్ మనోహర్, ఎలాకర్ బాబాజి, లోనేరే ఇస్తారి,  శ్యామరే శంకర్, సాలె భీమయ్య, పాలి ఒమాజి, గ్రామ రైతులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

బాహుబలి వినాయక--నవయుగ గణేష్ మండలి

బాహుబలి వినాయక--నవయుగ గణేష్ మండలి



రెబ్బెనలో నవయుగ గణేష్ మండలి ఆధ్వర్యంలో గ్రామ పంచాయితి కార్యాలయం వద్ద బాహుబలి వినాయకున్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో వేదమంత్రాలతో దూపదీపలతో పూజలు చేశారు. బొజ్జ గణపయ్యకు మారేడు దళాలు, మాచీ, బదరీ, చూత, తులసీ,కరవీర తదితర పత్రాలతో విఘ్నేశ్వరుణ్ణి పూజించారు.  భక్తి ప్రపత్తులతో గణపయ్యకు ఇష్టమైన వంటకాలను,ఫలాలను సమర్పిస్తూ పూజలు నిర్వహించారు.  వెరైటి గణనాథులు ప్రజలను కనువిందు చేశాయి. రెబ్బెన గ్రామ పంచాయితి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బాహుబలి వినాయకున్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కమిటీ సభ్యులు భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

రేషన్ కార్డులోని తప్పులు సవరించుకోండి-తహశిల్దార్

రేషన్ కార్డులోని తప్పులు సవరించుకోండి-తహశిల్దార్



రేషన్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటె సవరించుకోవాలని రెబ్బెన మండల తహశిల్దార్ రమేష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని అందుకు గాను పాత కార్డులో తప్పులు ఉంటె ఆధార్ కార్డ్, రేషన్ కార్డు నకలును వీఆర్వో కు, దగ్గరలోని రేషన్ డీలర్ కు ఇచ్చి సవరించుకోవాలని అన్నారు.

తహశిల్దార్ కు రైతుల వినతీ పత్రం

తహశిల్దార్ కు రైతుల వినతీ పత్రం

రెండు రోజులుగా కురుస్తున్న భారి వర్షానికి నవేగాం శివారులో గల పత్తి పంట బాగా నష్ట పోయిందని శనివారం నాడు రెబ్బెన మండల నవేగాం గ్రామానికి చెందిన రైతులు మండల తహశిల్దార్ రమేష్ గౌడ్ కువినతీ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నవేగాంలోని రైతులు పూర్తిగా పత్తి పంటపై ఆధారపడి ఉన్నారన్నారు, రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా పెద్ద వాగు ఒడ్డున పువ్వు దశలో వున్నా 50 ఎకరాల పత్తి పంట పూర్తిగా నేలరాలిందని, కావున నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇప్పించాలని వాపోయారు. లక్ష్మిబాయి, సునీత, విమల, మీరాబాయి, పురుషోత్తం, గ్రామ రైతులు పాల్గొన్నారు

Friday, 18 September 2015

 శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు


వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు. గురువారంనాడు వరంగల్ ఎమ్ జీఎమ్ ఆస్పత్రి కి శృతి, సాగర్ ల మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం తీసుకొచ్చినప్పటినుండి అక్కడ ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఎన్ హెచ్ ఆర్సీ గైడ్ లైన్స్ ప్రకారం పోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు అక్కడ తలితండ్రులు ఉండాలని ప్రజా సంఘాలు చేసిన డిమాండ్ ను పోలీసులు తిరస్కరించారు. పోస్ట్ మార్టంకు ముందు మృతదేహాన్ని చూడనివ్వాలన్న శృతి తల్లి తండ్రుల విజ్ఝప్తిని కూడా పోలీసులు తిరస్కరించారు. అక్కడికి వచ్చిన వందలాదిమందిని అక్కడినుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. అయినా ప్రజా సంఘాల నాయకులు పట్టు విడువక పోవడంతో శ్రుతి మృతదేహాన్నిచూసేందుకు తల్లి రమాదేవి ని అనుమతించారు. ఆమె ఆస్పత్రి లోపలికి వెళ్ళి కొంత సేపటికి ఏడుస్తూ బైటికి వచ్చింది. విరసం నేత వరవరరావు దగ్గరికి వెళ్ళి తాను చూసింది చెప్పింది. ఆ తర్వాత వరవరరావు మీడియాతో మాట్లాడుతూ శృతిని అత్యాచారం చేసి చంపారని, శరీరంపై ఆసిడ్ పోసారని తల్లిగా తాను మీడియాకు చెప్పలేక తనతో చెప్పిందన్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భoగా రూ.10 ఫ్రీ టాక్టైం

బ్రహ్మోత్సవాల సందర్భoగా రూ.10 ఫ్రీ టాక్టైం
ఆక్సిజన్ సర్వీసెస్ ఇoడియా ఆఫర్
: తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆక్సిజన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దేశంలోని ప్రతి వ్యక్తి మొబైల్కు రూ. 10 ఉచిత టాక్టైమ్ అందిస్తోంది. బుధవారం నుంచి ఈనెల 24 వరకు ఇది వర్తిస్తుందని ఆ సంస్థ చైర్మన్ ప్రమోద్ సస్రేనా పేర్కొన్నారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ కార్యాలయంలో బుధవారం ఈ సౌకర్యాన్ని చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ప్రారంభించారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రతి ఒక్క భక్తుడూ గోవిందనామ స్మరణ చేయాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించామన్నారు. మొబై ల్ వినియోగదారులు ఫోన్లో గోవింద అనే పదాన్ని టైప్ చేసి తర్వాత స్పేస్ ఇచ్చి ఆపరేటర్ పేరును టైప్ చేసి 9963900600కి ఎస్ఎంఎస్ చేస్తే వెంటనే రూ.10 రీచార్జ్ లభిస్తుoదన్నారు. ఉదాహరణకు ఎయిర్టెల్ వినియోగదారులు GOVINDA AIRTEL అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పoపాలని కోరారు.
🍃🍃🍃🍃🍃🔺🔺🔺

అకాల వర్షానికి పత్తి రైతుల ఆవేదన

అకాల వర్షానికి పత్తి రైతుల ఆవేదన



రెండు రోజులుగా కురుస్తున్న భారి వర్షానికి పత్తి పంట బాగా నష్ట పోయిందని శుక్రవారం నాడు రెబ్బెన మండల వంకుల గ్రామానికి చెందిన రైతులు మండల తహశిల్దార్ రమేష్ గౌడ్ కు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వంకులంలోని రైతులు పూర్తిగా పత్తి పంటపై ఆధారపడి ఉన్నారన్నారు, రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా పెద్ద వాగు ఒడ్డున పువ్వు దశలో వున్నా 450 ఎకరాల పత్తి పంట పూర్తిగా నేలరాలిందని దీంతో సుమారు 50 మంది పట్టా రైతులు అందరు రోడ్డున పడ్డారని, కావున నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇప్పించాలని వాపోయారు. ఈ కార్యాక్రమంలో ఎంపీపీ సంజీవ్ కుమార్, మాజీ సర్పంచ్ ప్రేమ్ దాస్, రైతులు ఎలకర్ మనోహర్, బోర్కుటే నాగయ్య, ఎలాకర్ బాబాజి, లోనేరే ఇస్తారి, లోకండే పురుషోత్తం, శ్యామరే శంకర్, సాలె భీమయ్య, పాలి ఒమాజి, గ్రామ రైతులు, వార్డు సభ్యులు  పాల్గొన్నారు. 

ఆశావర్కర్ల భిక్షాటన

ఆశావర్కర్ల భిక్షాటన


గత 17రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో శుక్రవారం రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి ముందు సమ్మె చేసిన అనంతరం ఊరిలో తిరుగుతూ భిక్షాటన చేశారు.ఈ సందర్భంగా ఆశావర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు అనిత, కార్యదర్శులు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని 17రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. తమకు కనీస వేతనం 15వేలు ఇవ్వాలని, అలాగే ఆశావర్కర్లకు 2వ ఎఎన్‌ఎంలుగా గుర్తించాలని వారు డిమాండ్‌ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి పరిష్కరమయ్యేలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఆశావర్కర్లు, మండల ఉపాధ్యక్షులు రమ, ఆసంఘం కార్యకర్తలు కవిత, చాయ, నిర్మల, స్వప్న, తిరుమల, రమాదేవి, రాజేశ్వరి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Thursday, 17 September 2015

బాహుబలి వినాయక--నవయుగ గణేష్ మండలి

బాహుబలి వినాయక--నవయుగ గణేష్ మండలి



రెబ్బెనలో నవయుగ గణేష్ మండలి ఆధ్వర్యంలో గ్రామ పంచాయితి కార్యాలయం వద్ద బాహుబలి వినాయకున్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో వేదమంత్రాలతో దూపదీపలతో పూజలు చేశారు. బొజ్జ గణపయ్యకు మారేడు దళాలు, మాచీ, బదరీ, చూత, తులసీ,కరవీర తదితర పత్రాలతో విఘ్నేశ్వరుణ్ణి పూజించారు.  భక్తి ప్రపత్తులతో గణపయ్యకు ఇష్టమైన వంటకాలను,ఫలాలను సమర్పిస్తూ పూజలు నిర్వహించారు. వెరైటి గణనాథులు ప్రజలను కనువిందు చేశాయి. రెబ్బెన గ్రామ పంచాయితి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బాహుబలి వినాయకున్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కమిటీ సభ్యులు భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

వైభవంగా వినాయక చవితి వేడుకలు

శ్రీ బాలాజీ గణేష్ మండలి 
వినాయకచవితి ఉత్సవాలు రెబ్బెన మండల వ్యాప్తంగా వైభవంగా కొనసాగాయి.గ్రామాలలో వీధివీధిన గణనాథులను మంటపాలలో ప్రతిష్టించారు. వెరైటి గణనాథులు ప్రజలకు కనువిందు చేశాయి.భక్తి శ్రద్ధలతో వినాయకునికి దూపదీప నైవేద్యాలతో పూజలు చేశారు. బొజ్జగణపయ్యకు మారేడు దళాలు, మాచీ, బదరీ, చూత, తులసీ ,కరవీర తదితర పత్రాలతో విఘ్నేశ్వరుణ్ణి పూజించడంలో భక్తి ప్రపత్తులతో ఇష్టమైన వంటకాలను, ఫలాలను సమర్పిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ రోడ్, దేవులగూడ, ఇంద్రానగర్, నక్కలగూడ, గంగాపూర్, గోలేటి లలో ప్రతిష్టించారు, రెబ్బెన గ్రామ పంచాయితి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బాహుబలి వినాయకున్ని చూసేం దుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వినాయక ఉత్సవాల సందర్భంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.



Wednesday, 16 September 2015

తహశిల్దార్ కు ఎస్,ఎఫ్,ఐ వినతీ పత్రం

తహశిల్దార్ కు ఎస్,ఎఫ్,ఐ వినతీ పత్రం

ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో విఫలమయిందని రెబ్బెన మండల తహశిల్దార్ రమేష్ గౌడ్ కు బుధవారం నాడు పలు డిమాండ్లతో కూడిన వినతీ పత్రాన్ని ఎస్,ఎఫ్,ఐ ఆధ్వర్యం లో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్,ఎఫ్,ఐ జిల్లా సహాయ కార్యదర్శి గోదిసెల కార్తిక్, డివిజన్ ఉపాధ్యక్షులు బీ,వినోద్ మాట్లాడుతూ మండలంలో ఎస్సి,ఎస్టీ,బీసీ ప్రభుత్వ వసతీ గృహాల్లో కనీస వసతులు లేవని, కస్తూర్బా వసతీ గృహాలకు ప్రహరి గోడ లేక బాలికలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వ నియమ నిబంధల ప్రకారం పెట్టడం లేదని, సన్న బియ్యం పేరుకు మాత్రమే పెడుతున్నారని  అన్నారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం
రాష్రంలో నెలకొన్న విద్యారంగా సమస్య లు పరిష్కరించడంలో రాష్ట్ర  ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎ,అయ్,ఎస్,ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ అన్నారు. ఈ సందర్బంగా రెబ్బెన మండలంలోని గోలేటి లో సీపిఅయ్ కార్యాలయంలో మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్న నేటి వరకు విద్యార్థులకు పూర్తి స్తాయిలో పాట్యపుస్తకాలు అందించలేదన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించకపోవడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. రాష్రంలో ఖాళీగా ఉన్న డీఈవో, ఎంఈవో, వార్డెన్ ,వాచ్ మెన్ ,కమిటి తదితర పోస్టులు భర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో విద్యార్ధుల పాత్ర కీలకమని చెప్పిన కెసీఆర్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఎ,అయ్,ఎస్,ఎఫ్ గా ఖండిస్తున్నామన్నారు. కేజీ నుంచి పీజీ ఉచిత పై నేటి వరకు నిర్దిష్ట ప్రణాళిక ప్రారంభించకుండా ఉండడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఎ,అయ్,ఎస్,ఎఫ్ ఆద్వర్యంలో దశల వారిగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎ,అయ్,ఎస్,ఎఫ్ మండల అభ్యర్ది ,కార్యదర్శులు కస్తూరి రవీందర్ ,పుదారి సాయికిరణ్, తదీతరులు పాల్గోన్నారు.

ఆశా కార్యకర్తల వినూత్న నిరసన

ఆశా కార్యకర్తల వినూత్న నిరసన

నిరవధిక సమ్మె బుధవారనికి 15వ రోజుకు చేరిన తమ న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చడం లేదని ఉరివేసుకొని ఆశా కార్యకర్తలు వినూత్నరీతిలో రెబ్బెనలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కార్యాలయం ముందు నిరసన తెలిపారు. సమ్మెలో భాగంగా  సీ,అయ్,టీ,యు మండల అధ్యక్షురాలు ఆశ కార్యకర్త అనిత మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పించాలని, కనీస వేతనం రూ.15వేలు చెల్లించాలని, అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, కేవలం నాలుగు వందల రూపాయల వేతనంతో ముప్పై రోజులు కష్టపడి పనిచేస్తున్న సకాలంలో ఆగౌరవ వేతనం కూడ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోకపోవడం దుర దృష్టకర మన్నారు. గ్రామీణ స్థాయిలో పనిచేసే వైద్యసిబ్బందితో విధులు నిర్వహిస్తున్నప్పటికి ఉద్యోగ భద్రత కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రోగులకు వైద్యసేవలు అందించి  ఉన్నప్పటికి  కనీస వేతనంతో తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రమ, ఆసంఘం కార్యకర్తలు కవిత, చాయ, నిర్మల, స్వప్న, తిరుమల, రమాదేవి, రాజేశ్వరి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

ఐ ఫోన్ కోసం కిడ్నీ అమ్మకానికి పెట్టిన ఘనుడు !

ఐ ఫోన్ కోసం కిడ్నీ అమ్మకానికి పెట్టిన ఘనుడు !




కొత్త కొత్త టెక్నాలజీలు అందు బాటులోకి వస్తున్నాకొద్దీ వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు కొందరు. ముఖ్యంగా సెల్ ఫోన్ ఇంటర్ నెట్ పిచ్చి తో కొందరు ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. అట్లాంటి ఓ ఘనుడు పిచ్చి పీక్స్ కు వెళ్ళి ఐఫోన్ కోసం కిడ్నీ అమ్మకానికి పెట్టాడు. ఐఫోన్ కొనేలనే కోరిక అతని ప్రాణాలమీదకు తెచ్చింది. చైనాలోని జాంగ్‌గ్జూ అనే రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. హువాంగ్ అనే 17 ఏళ్ల యువకుడు కిడ్నీ అమ్మడం కోసం ఆన్‌లైన్‌లో బ్రోకర్‌ను సంప్రదించాడు. అంతేకాకుండా ఆస్పత్రికి వెళ్లి టెస్టులన్నీ చేయించుకున్నాడు. హువాంగ్‌కు వ్యూ అనే స్నేహితుడున్నాడు. అతడికి ఈ విషయం తెలిసింది. విషయం తెలిసిన వెంటనే వ్యూ, హువాంగ్‌ను వారించాడు. అయినా హువాంగ్ తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. దీంతో వ్యూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కిడ్నీ సేకరించడానికి సిద్ధమైన ఆస్పత్రి సిబ్బందిని, బ్రోకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Monday, 14 September 2015

గణేష్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి

గణేష్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి 


గణేష్ ఉత్సవాలను అందరూ కులమతాలకు అతీతంగా ఐక్యమత్యంతో సోదరభావంతో 11రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని తాండూర్ సీఐ కరుణాకర్ పిలుపునిచ్చారు. సోమవారం పోలీసు స్టేషన్లో గణేష్ ఉత్సవ కమిటి సభ్యుల అవగాహన సమావేశం నిర్వహించారు.ఈసందర్బంగా సీఐ కరుణాకర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 11రోజుల పాటు భక్తి శ్రద్దలతో సాంప్రదాయ బద్దంగా నిర్వహించాలని గణేష్ మండళ్ల నిర్వహకులకు సూచించారు. ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే మైకులు వాడాలని ఆతర్వాత ఎట్టి పరిస్థితుల్లో మైక్‌ వాడరాదని రెండు స్పీకర్లు మాత్రమే వాడాలని డిజె సౌండ్‌ సిస్టమ్‌ వాడటానికి అనుమతించబడని సూచించారు. ఈ సమావేశంలో రెబ్బన ఎస్సై హనూక్, ఎంపీపీ కార్నాధం సంజీవ్, జడ్పిటిసి బాబురావు, గణేష్ ఉత్సవకమిటీ సభ్యులు పాల్గొన్నారు.

13వ రోజుకు చేరిన ఆశాకార్యకర్తల నిరసనలు



ఆశాకార్యకర్తల నిరవదిక సమ్మెలో భాగంగా రెబ్బెన మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆశాకార్యకర్తలు చేస్తున్న దీక్షలు సోమవారంతో 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా చీపురుతో ఊడుస్తూ నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.15వేల వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు దీక్షవిరమించేది లేదని అన్నారు.ఈకార్యక్రమంలో సీ,అయ్,టీ,యు మండల అధ్యక్షురాలు అనిత, ఉపాధ్యక్షుాంలు రమ ఆశాకార్యకర్తలు రాజేశ్వరి, స్వప్న, కవిత, నిర్మల,చాయ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

కనీస వసతులు కల్పించాలి

కనీస వసతులు కల్పించాలి



గోలేటి బస్టాండ్ ఆవరణలో మరుగు దొడ్లు నిర్మించాలని, గ్రంధాలయంలో కనీస వసతులు కల్పించాలని ఎ,అయ్,వై,ఎఫ్ మరియు ఎ,అయ్,ఎస్,ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం రెబ్బెన మండలంలోని గోలేటి జనరల్ మేనేజర్ కు వినతీ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోలేటికి రోజు అనేకమంది ప్రజలు వస్తారని, వారిలో వృద్ధులు వికలాంగులు చిన్న పిల్లలు మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, అలాగే కార్మిక పిల్లలు, గ్రామ ప్రజలు చదువుకునే గ్రంధాలయంలో కనీస వసతులు కల్పించాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో ఎ,అయ్,వై,ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపెంధర్, ఎ,అయ్,ఎస్,ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్, ఎ,అయ్,ఎస్,ఎఫ్ మండల అధ్యక్షుడు కస్తూరి రవికుమార్, పూదారి సాయికిరణ్  పాల్గొన్నారు.

కొనసాగుతున్న 3 మండలాల కబడ్డీ పోటీలు

రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీలో మూడు మండలాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించగా 16 జట్లు పాల్గొన్నాయి. అందులో ఆదివారం క్వాటర్‌ ఫైనల్‌కు 8 జట్లు చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి గోలేటికి చెందిన క్రీడాకారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.






12వ రోజుకు చరిన ఆశాకార్యకర్తల సమ్మె

12వ రోజుకు చరిన ఆశాకార్యకర్తల సమ్మె

రెబ్బెన మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆశాకార్యకర్తల తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆశా వర్కర్లు చేపట్టిన సమ్మె ఆదివారం 12వ రోజుకు చేరుకుంది సీ,అయ్,టీ,యు మండల అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ పండుగలు, పబ్బాలు విడిచిపెట్టి చేస్తున్న ధర్నాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పనికి తగ్గ గుర్తింపు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యక్షుాంలు రమ ఆశాకార్యకర్తలు రాజేశ్వరి, స్వప్న, కవిత, నిర్మల, చాయ రమాదేవి తదితరులు పాల్గొన్నారు

Saturday, 12 September 2015

అమ్మాయిల పేస్ బుక్ టాలెంట్ కు పోలీసుల షాక్

పేస్ బుక్ లో అబ్బాయిలకు వల వేస్తున్న యువతుల అరెస్ట్.. అమ్మాయిల టాలెంట్ కు పోలీసుల షాక్పేస్ బుక్ లో అబ్బాయిలకు వల వేస్తున్న యువతుల అరెస్ట్.. అమ్మాయిల టాలెంట్ కు పోలీసుల షాక్

పేస్ బుక్ లో అబ్బాయిలు అమ్మాయిలకు వల వేస్తుండడం ఎన్నో చూసాం.. కాని పోలీసులే నివ్వెరపోయే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అమ్మాయిలు పేస్ బుక్ లో అబ్బాయిలకు వల వేసి వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక అబ్బాయి అయితే ఏకంగా రూ.40 వేల కెమెరా ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఈ యువతుల టాలెంట్ చూసి పోలీసులే నివ్వెర పోయారంట. 

ఇద్దరు అమ్మాయిలు కలసి ఫేక్ అకౌంట్ లు రెడీ చేసి అందమైన ఫొటో పెట్టి అబ్బాయిలను బుట్టలోకి దింపుతున్నారు. ఇద్దరు కలసి వందల మంది అబ్బాయిలను మోసం చేశారు. వీరి దెబ్బకు ఎంతోమంది యువకులు వేలకు వేలు సమర్పించుకున్నారు. ఎంతో మంది యువకులను దేవదాసులను చేసారు. చివరికి బాదితులంతా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడం తో ఆ యువతుల మోసం వెలుగు చూసింది. 
అయితే ఎవరి వద్ద ఎంతెంత తీసుకున్నది ఇంకా తెలియాల్సి ఉందని డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే పోలీసు స్టేషన్ వద్దకు 17 మంది యువకులను పోలీసులు పిలిచి విచారించారు. 
ఇందులో మరో ట్విస్టు ఏమిటంటే.. ఈ ఇద్దలు కేడి గల్స్ ఇంటి నుండి పారిపోయి, హైదరాబాద్ కి వచ్చి.. ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారు.

పేస్ బుక్ లో అబ్బాయిలకు వల వేస్తున్న యువతుల అరెస్ట్.. అమ్మాయిల టాలెంట్ కు పోలీసుల షాక్



25 వరకూ తగ్గబోతుంది..!!


ఇండియాలో లీటరు పెట్రోలు ధర రూ. 25 వరకూ తగ్గబోతుంది..!!

ఇండియాలో లీటరు పెట్రోలు ధర రూ. 25 వరకూ తగ్గబోతుంది..!!

భారత్ లో లీటరు పెట్రోలు ధర రూ. 25 వరకూ తగ్గబోతుంది. ఆహా.. వింటేనే ఎంత హాయిగా ఉందో కదా..  మరి నిజంగా జరిగితే..? 
జరుగుతుంది అని అంటున్నారు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ గోల్డ్ మన్ శాక్స్. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర పాతాళానికి దిగజారనుందని.. లండన్ కమోడిటీ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 6 ఏళ్ళ కనిష్ఠ స్థాయిలో 48 డాలర్ల వద్ద ఉండగా.. ఈ ధరలు మరింత దిగజారి 20 డాలర్ల స్థాయిని తాకవచ్చని గోల్డ్ మన్ శాక్స్ భావిస్తున్నట్టు తెలిపింది. మార్కెట్లోకి వస్తున్న సరఫరా అధికంగా ఉండటమే ఇందుకు ముఖ్య కారణమని తెలిపింది. చైనా ఆర్థిక వ్యవస్థలోని ఆందోళన సైతం ఇది ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తున్నారు. అమెరికా నుంచి రోజుకు 5.85 లక్షల బ్యారళ్ల ముడి చమురు మార్కెట్లోకి వస్తోందని వెల్లడించారు. 
కాగా.. మార్చి 2009 తరువాత ముడిచమురు ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. గత ఏడాది జూన్ లో 115 డాలర్ల వద్ద ఉన్న క్రూడాయిల్ ధర 60 శాతానికి పైగా తగ్గింది. గోల్డ్ మన్ శాక్స్ అంచనాల ప్రకారం క్రూడాయిల్ ధర 20 డాలర్లకు చేరితే.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 'పెట్రో' ఉత్పత్తులపై అమ్మకపు, ఎక్సైజ్ పన్నులను పెంచ కుండా ఉంటే.. భారత్ లో లీటరు పెట్రోలు ధర రూ. 25 తగ్గడం ఖాయం.

కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిపి తినొద్దు



ఎలాంటి ఆహారమైనా ఆరోగ్యకరమే! అయితే కొన్ని పదార్థాల్ని కలిపి తినకూడదు. విడిగా తింటే ఆరోగ్యాన్నందించే కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిపి తింటే ఆరోగ్యాన్ని హరిస్తాయి. కాబట్టి అలాంటి ప్రమాదకరమైన ఫుడ్‌ కాంబినేషన్స్‌                                                                    గురించి  తెలుసుకుందాం.

భోజనంతో పండ్లు
సాధారణంగా మనం భోజనం చేసిన తర్వాత పండ్లు తింటూ ఉంటాం. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే జీర్ణాశయంలోకి చేరుకునే పళ్లు తేలికగా అరిగిపోయి పేగుల్లోకి శోషణ చెందుతాయి. ఈ పళ్లకు మాంసం, ధాన్యాలు కలిస్తే అరుగుదల ఆలస్యమవుతుంది. ఆలోగా పళ్లు కుళ్లిపోవటం (ఫర్మెంటేషన్‌) మొదలవుతుంది. ఫలితంగా పేగుల లోపలి పొర దెబ్బతింటుంది.

మాంసకృతులు, పిండి పదార్థాలు
మాంస ఉత్పత్తుల్లోని మాంసకృతులు, పిండి పదార్థాలతో కలిస్తే వాటిలోని మాక్రోన్యూట్రియెంట్స్‌ ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఈ రెండు పదార్థాల అరుగుదల కోసం ఉత్పత్తయ్యే జీర్ణరసాలు కలిసిపోవడం వల్ల కడుపులో గ్యాస్‌ పుడుతుంది. దాంతో కడుపు ఉబ్బరిస్తుంది.

నిమ్మరసం, దగ్గుమందు
దగ్గుమందు తీసుకుంటున్నప్పుడు నిమ్మరసం జోలికి వెళ్లకూడదు. నిమ్మరసం కొలెసా్ట్రల్‌ను తగ్గించే స్టాటిన్స్‌ను విరిచేస్తుంది. దాంతో దగ్గు మందులోని డెక్స్‌ట్రోమిథార్పాన్‌ ప్రభావం రెట్టింపవుతుంది. ఫలితంగా తల తిరుగుడు, నిద్రలేమిలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి.

పిండి పదార్థాలు, టమాటలు
టమాటల్లో సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. వీటిని స్టార్చీ కార్బొహైడ్రేట్స్‌తో కలిపి తినటం ప్రమాదం. చిలకడ దుంపలు, బియ్యంలాంటి స్టార్చీ కార్బొహైడ్రేట్స్‌తో టమాటలు కలిపితింటే అజీర్తి సమస్య తలెత్తుతుంది. భోజనం తర్వాత అలసటగా అనిపిస్తుంది.

పెరుగు, పళ్లు
పాల ఉత్పత్తులు సైన్‌సలను మూసేస్తాయి. జలుబు, ఇతర అలర్జీలను పెంచుతాయి. ఈ ఉత్పత్తులను పళ్లతో కలిపి తింటే ఈ సమస్యలు రెట్టింపవుతాయి. కాబట్టి పెరుగును, పళ్లను విడివిడిగా తినాలి

పోలాల పండుగ సందడి

పోలాల పండుగ సందడి
రెబ్బెన మండల కేంద్రంలో పోలాల పండుగ శనివారం నిర్వహించడంతో సందడి నెలకొంది. ఈపండుగకు వ్యవసాయ రైతులు పశువులను వివిధ రంగులతో అలంకరిస్తారు. దీంతో పశువుల అలంకరణ కోసం వస్తుసామాగ్రిల ప్రత్యేక దుకాణాలు వెలిసాయి. పశువులకు వేసే రంగులు వివిధ రకాల వస్తువులు రైతులు కొనుగోలులో సందడిగా ఉన్నారు. శనివారం పండ గ రోజు ఎద్దులను అలంకరించి గ్రామాల్లోని ఆలయాల చుట్టు ప్రదక్షణలు నిర్వహించి పిండివంటలు నైవేద్యంగా పెడతారు. 



మంత్రి హరీష్‌ రావ్‌కు వినతి పత్రం

మంత్రి హరీష్‌ రావ్‌కు వినతి పత్రం

రాష్ట్రంలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న తెలంగాణ గ్రామీణ నిర్మూలన సంస్థ గత 15 సంవత్సరాలుగా 3262 మంది ఉద్యోగులు పేదరిక నిర్మూలన కార్యక్రమంలో అంకితాభావంతో పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సేవలు అందిస్తున్నారని ఏసీఎస్‌కేజ డ్‌ఆర్‌ రాజ్‌కుమార్‌ ఏపీఎంలు మాట్లాడుతూ డీఆర్డీఏ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మహిళల స్వయం సంఘాలకు 11లక్షలు వడ్డీలేని రుణాలు అందించాలన్నారు. టీఆర్డీఏ , బీవోఏలకు కనీస గౌరవ వేతనం ఐదువేలు అందించాలన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇంక్రీమెంట్‌ను ఉద్యోగులకు అందించాలన్నార ు. 

ఆరోగ్యకార్యాలయం ముందు ఆశాకార్యకర్తల ధర్నా

ఆరోగ్యకార్యాలయం ముందు ఆశాకార్యకర్తల ధర్నా 

ఆరోగ్యకార్యాలయంఆశాకార్యకర్తల ధర్నారెబ్బెనలో శనివారనికి  11వరోజుకు చేరుకుంది. సీ,అయ్,టీ,యు మండల అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ  కనీస వేతనం రూ.15వేలుచెల్లించాలని, ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పించాలని. అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని,  కేవలం నాలుగువందల రూపాయల వేతనంతో ముప్పై రోజులు కష్టపడి పనిచేస్తున్న సకాలంలో ఆగౌరవ వేతనం కూడ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోకపోవడం దుర దృష్టకరమన్నారు. గ్రామీణ స్థాయిలో పనిచేసే వైద్యసిబ్బందితో విధులు నిర్వహిస్తున్నప్పటికి ఉద్యోగ భద్రత కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద యం నుంచి రాత్రుల్లో రోగులకు వైద్యసేవలు అందించి  ఉన్నప్పటికి తమ న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చడం లేదని, కనీస వేతనంతో తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రమ, ఆసంఘం కార్యకర్తలు కవిత, నిర్మల, చాయ రమాదేవి, రాజేశ్వరి, స్వప్న, తిరుమల, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. 

రైతుల సంక్షేమమే తెరాస ప్రభుత్వం

రైతుల సంక్షేమమే తెరాస ప్రభుత్వం 

-మిషన్ కాకతీయలో భాగంగా ఎల్లమ్మచెరువు పర్యవేక్షణ
-ఎల్లమ్మ గుడి శంకుస్థాపన

రెబ్బెన మండలం లోని శుక్రవారం రోజున మంత్రులు భారి నీటీ పారుదల శాఖ మంత్రి హరీష్ రావు , అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎల్లమ్మ చెరువును మిషన్ కాకతీయలో భాగంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా సందర్భంగా గౌడ కులస్థుల కుల దేవతైన ఎల్లమ్మ గుడికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారి నీటీ పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మిషన్ కాకతీయలో భాగంగా మండలంలో గుర్తించిన అన్ని చెరువుల, కుంటల పను వేగవంతంచేసి అన్ని పొలాలకు సాగు నీరు అందేల రూపకల్పన చేస్తామన్నారు. ఈ సభలో మండల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు,  పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా కాళోజీ 101 జయంతి

ఘనంగా కాళోజీ 101 జయంతి


రెబ్బెన మండల తహశిల్దార్ కార్యాలయంలో ప్రజా కవి కాళోజీ నారాయణ రావు 101వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తహశిల్దార్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపు కోవడం సంతోషకర విషయమన్నారు. కాళోజీ సేవలు మరువలేనివని, ఆయన కవిత్వ శైలి అందరికి అర్ధం అయ్యేవిధంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యాక్రమంలో కార్యాలయ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


నేడు ఇరిగేషన్‌ మంత్రి హరీష్‌ రావ్‌ పర్యటన 

నేడు  జిల్లా రాష్ట్ర ఇరిగేషన్‌ , మార్కెటింగ్‌ శాఖామంత్రి టి హరీష్‌ రావ్‌ రెబ్బెన మండలంలో  పలు అభివృద్ది కార్యాక్రమాలకై పర్యటించనున్నారనీ తెలంగాణ జిల్ల ఉపాద్యక్షుడు నవీన్ కుమార్ జైస్వాల్ తెలిపారు  అధికారులు, ప్రజాప్రతి నిధులు మండల ప్రజలు అధిక సంఖ్యలో  హాజరై ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.


వీరవనిత  చాకలి ఐలమ్మ 30వ వర్థంతి,

తెలంగాణ రాష్ట సాయుధ పోరాటంలో  వీరవనిత పేరుగాంచిన చాకలి ఐలమ్మ 30వ వర్థంతి వేడుకలు గురువారం రోజున స్థానిక  అతిదిగృహం  ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా  చాకలి ఐలమ్మ చిత్రపటానికి  రజక సంఘ   నాయకులు అద్యక్షు కార్యదర్శులు రామడుగు శంకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి  మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలకుల అండ దండలతో దొరలు సాగించిన దోపిడిలకు చాకలి ఐలమ్మ ఎదురోడ్డి నిలిచారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాటం చేసి వీర వనితగా చరిత్రలోకి ఎక్కినా మహిళగా పేరుగాంచింది ఈ  కార్యక్రమంలో తెలంగాణా  వేదిక జిల్లా  ఉపాధ్యక్షుడు మేడి వినోద్ కదతల సాయి  ,సత్యనారాయణ కదతల తిరుపతి టి వి వి నాయకులు విజయ్ పవన్ రమేష్ హరికృష్ణ శాశిదర్ తదితరులు పాల్గున్నారు 

రైతుల సంక్షేమమే తెరాస ప్రభుత్వం 

-మిషన్ కాకతీయలో భాగంగా ఎల్లమ్మచెరువు పర్యవేక్షణ
-ఎల్లమ్మ గుడి శంకుస్థాపన

రెబ్బెన మండలం లోని శుక్రవారం రోజున మంత్రులు భారి నీటీ పారుదల శాఖ మంత్రి హరీష్ రావు , అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎల్లమ్మ చెరువును మిషన్ కాకతీయలో భాగంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా సందర్భంగా గౌడ కులస్థుల కుల దేవతైన ఎల్లమ్మ గుడికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారి నీటీ పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మిషన్ కాకతీయలో భాగంగా మండలంలో గుర్తించిన అన్ని చెరువుల, కుంటల పను వేగవంతంచేసి అన్ని పొలాలకు సాగు నీరు అందేల రూపకల్పన చేస్తామన్నారు. ఈ సభలో మండల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు,  పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Wednesday, 9 September 2015

ప్రజాకవికి ఘన నివాళి

ప్రజాకవికి ఘన నివాళి


ప్రజాకవి కాళోజి నారాయణ రావు జయంతిని రెబ్బెన మండలంలోని వంకులం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాటశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈవో వెంకటేశ్వర స్వామీ కాళోజీ స్మారక గ్రంధాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాళోజి నారాయణ రావు ప్రజాకవిగా, ఉద్యమకారుడిగా, తెలంగాణా వాదిగా నిలబడ్డ మహా మనిషి అని కొనియాడారు. ఈ కార్యాక్రమంలో ప్రదానోపాధ్యాయురాలు జ్యోతి, పాటశాల యాజమాన్య కమిటీ చైర్మన్ చౌదరి తిరుపతి, వైస్ చైర్మన్ నాగుల సరోజన, పాటశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా కాళోజీ 101 జయంతి


ఘనంగా కాళోజీ 101 జయంతి





రెబ్బెన మండల తహశిల్దార్ కార్యాలయంలో ప్రజా కవి కాళోజీ నారాయణ రావు 101వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తహశిల్దార్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపు కోవడం సంతోషకర విషయమన్నారు. కాళోజీ సేవలు మరువలేనివని, ఆయన కవిత్వ శైలి అందరికి అర్ధం అయ్యేవిధంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యాక్రమంలో కార్యాలయ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.