Saturday, 1 September 2018

ప్రగతి నివేదన సభకు తరలని ఇంటింటా బొట్టు పిలుపు



కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  సెప్టెంబర్ 1 ; ప్రగతి నివేదన సభకు తరలి రావాలని ఇంటింటా బొట్టు పిలుపు కార్యక్రమం  జిల్లా తెరాస మహిళా ప్రధాన కార్యదర్శి, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు  కుందారపు శంకరమ్మ శనివారం  రెబ్బెన మండలం లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఎం ఎల్ ఏ  కోవలక్ష్మిసూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.  తెరాస    ప్రభుత్వం అందిస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్,  మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు భీమా తదితర  పథకాల గురించి వివరించరు. తెలంగాణా ప్రభుత్వం  చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి  నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు మండలంలోని ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని కోరుతూ గడప గడపకు వెళ్లి ఆడపడుచులకు బొట్టుపెట్టి ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోలేటి ఎంపీటీసీ వనజ, మాజీ సర్పంచ్ పెసర వెంకటమ్మ, తెరాస మండల టౌన్ మహిళా  అధ్యక్షురాలు మన్యం పద్మ,  పి  లలిత, ఏ  అరుణ, సువర్ణ, పి  పద్మ, పి  లత, రజిత, లక్ష్మి,  మణి , ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

1 comment:

  1. Ekkada thiragaledu Vallinti munde photos thisi fake news pettinava

    ReplyDelete