Wednesday, 12 September 2018

ఏ ఐ ఎస్ ఎఫ్ కుమురం భీం జిల్లా కమిటీ ఎన్నిక

 
 కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్12 ; రెబ్బెన మండలం   గోలేటిలోని కె.ఎల్.మహేంధ్ర భవన్ లోమంగళవారం జరిగిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య  జిల్లా ద్వితీయ మహసభల్లో జిల్లా కమిటీని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ స్టాలిన్ గారి ఆద్వర్యంలో ఎన్నుకోవడం జరిగిందని  జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ బుధవారం  తెలిపారు. నూతనంగా ఎన్నికైన నాయకత్వం విద్యా కాషాయీకరణ,వ్యాపారీకరణ,కార్పొరేటికరణ పైన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షునిగా బి .వికాస్ ఉపాధ్యాక్షులుగా: పూదరి సాయి, ప్రధాన కార్యదర్శిగా దుర్గం రవీందర్, సహయ కార్యదర్శిగా: నికొడె తిరుపతి,కోశాధికారిగా కస్తూరి రవికుమార్, అలాగే 21 మంది కౌన్సిల్ సభ్యులను, 11 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. దుర్గం రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్ అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాల పైన పోరాటం కొనసాగిస్తామని, కెజి టూ పిజి ఉచిత విద్యకై పోరాటం చేస్తామని అన్నారు. జిల్లాలో డిఈవొ లేక విద్యారంగం మరుగునపడుతుందని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ,పాలిటెక్నిక్,ఐటీఐ కళాశాలలు ఏర్పాటు చేయాలని,జిల్లాలో విద్యాభివృద్ధికై ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న రాష్ట్ర నాయకత్వానికి,సిపిఐ జిల్లా పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.

No comments:

Post a Comment