కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 05 ; ప్రపంచ జర్నలిస్ట్ డే పురస్కరించుకొని రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సింగరేణి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే వారు జర్నలిస్టులు అని అన్నారు జర్నలిస్ట్ వృత్తి కత్తిమీద సాములాంటిదని అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కలగి వృత్తిలో రాణించిన వారికి మంచి గుర్తింపు లభిస్తుందన్నారు ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు( టి యు డబ్ల్యూ జె ఐజెయు) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సంపత్ కుమార్, జె సత్యనారాయణలను శాలువాలు పూలమాలతో సన్మానించారు ఈ కార్యక్రమం లో గోలేటి లయన్స్ క్లబ్ కోశాధికారి భాస్కర్ ,సీనియర్ ఉపాధ్యాయులు హన్మంతు, నర్సారెడ్డి ,అనురాధ ,సతీష్ బాబు ,బాబునాయక్, యశ్వంత్రావు, శోభ, సౌభాగ్య తదతరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment