కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన సెప్టెంబర్ 4 ; బదిలీపై కార్పొరేట్ కు వెళ్తున్న ఏజీఎం కే కొండయ్య, శ్రీరామ్ పూర్ కు వెళ్తున్న డిజిఎం ప్రసాదరావు లకు సింగరేణి బెల్లంపల్లి ఏరియా గోలేటిలో మంగళవారం ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం శాలువాలతో సన్మానించి జీఎం కె రవిశంకర్ మాట్లాడారు ఉద్యోగ జీవితంలో బదిలీలు సర్వసాధారణమని అయితే ఇచ్చిన బాధ్యతలను ఎంతో అంకితభావంతో సక్రమంగా క్రమశిక్షణతో పూర్తి చేసి నిబద్ధత కలిగిన అధికారులు ఇక్కడ నుంచి వెళ్లిపోతుంటే కొంత బాధ కలుగుతుందని అన్నారు వారు తమ వంతుగా కీలక పాత్రలను విజయవంతంగా నిర్వహించారని వారిని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం సాయిబాబా, ప్రాజెక్టు అధికారులు చింతల శ్రీనివాస్, మోహన్ రెడ్డి , డీజీఎం పర్సనల్ జె కిరణ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment