Thursday, 6 September 2018

ముఖ్యమంత్రి ఇచిన హామీలను వెంటనే అమలు చేయాలి

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 06 ;   గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఇచిన హామీలను వెంటనే అమలు చేయాలని  ఏఐటీయూసీ జిల్లా  అధ్యక్షులు బోగే ఉపేందర్  డిమాండ్ చేశారు. గురువారం రెబ్బెన మండల ఎంపీడీఓ కార్యాలయంలో   వినతి పత్రాన్ని అందచేసి మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు 33 రోజుల సమ్మె  చేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికీ కనీస వేతనం 8500 చేస్తామని హామి ఇచ్చారని కానీ నేటివరకు హామీని నెరవేర్చలేదన్నారు. దానిని వెంటనే అమలు చేయాలని కోరారు.  .   అర్హులైన ఉద్యోగులను పంచాయతీ కార్యదర్సులుగా నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కోశాధికారి రాయిళ్ళనర్సయ్య,    గ్రామ పంచాయతీ కార్మికుల మండల అధ్యక్షులు రాచకొండ రమేష్, కార్యదర్శి దుర్గం వెంకటేష్, తిరుపతి, గోగర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.




No comments:

Post a Comment