Friday, 28 September 2018

అందరికీ విద్యా,ఉపాధి అవకాశాలు కల్పించాలి


రెబ్బెన ;  దేశంలో ఉన్న విద్యార్థులకు, నిరుద్యోగులకు విద్యా,ఉపాధి అవకాశాలు కల్పించాలని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున 111వ జయంతి వేడుకలు సందర్భంగా రెబ్బెనలోని డిగ్రీ కళాశాలలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కొరకు పొత్తిళ్ళలోనే పిడికిలి బిగించి స్వాతంత్ర్యం మా జన్మ హక్కు అని తన ప్రాణాన్ని అర్పించిన గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్ అని అన్నారు. చిన్న వయస్సులోనే స్వాతంత్ర్యం కొరకు ఉరి కొయ్యకు వేలాడిన వీరుడని అన్నారు. నేటి యువత చెడు వ్యసానాలకు దూరంగా ఉండి అవినీతికి,మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్ గ్యారెంటీ ఎప్లాయిమెంట్ యాక్ట్ చట్టం తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో AISF జిల్లా కొశాధికారి కస్తూరి రవికుమార్,డివిజన్ ఉపాధ్యాక్షులు పర్వతి సాయి,AITUC జిల్లా కార్యదర్శి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment