Thursday, 6 September 2018

రాబోయే ఎన్నికలలో బీజేపీ గెలుపు తధ్యం

రెబ్బెన: రాబోయే ఎన్నికలలో బీజేపీ గెలుపు తధ్యమని , దానికి గాను కార్యకర్తలు బీజేపీ పథకాలను ఇంటిటికి తిరిగి ప్రచారం చేయాలని బీజేపీ జిల్లాఅధ్యక్షులు జె  బి   పౌడెల్  అన్నారు. గురువారం రెబ్బెన మండలం గోలేటిలో  బీజేపీ  జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన  విలేఖరుల సమావేశం లో మాట్లాడారు. శుక్రవారం ఉట్నూరులో ఏర్పాటుచేసిన జిల్లా అత్యవసర సమావేశానికి తెలంగాణా స్టేట్ ఫ్లోర్ లీడర్ ఎండల లష్మినారాయణ హాజరవుతున్నారని కావున జిల్లాలోని మండల అధ్యక్షులు, కార్యదర్సులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్  గుల్బమ్ చక్రపాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి సేర్ల  మురళీధర్, శ్రీనివాస్, రాజేష్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment