కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్19 ; బీసీ ఎస్ సీ సబ్సిడీ రుణాలు మంజూరైన వారికి వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ , సి పి ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాడి గణేష్ లు డిమాండ్ చేశారు. బుధవారం రెబ్బెన మండల తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించి మాట్లాడారు. గత సంవత్సర కాలం నుంచి బ్యాంకు లు సబ్సిడీ రుణాలు మంజూరు చేయక పోవడంతో దరఖాస్తు దారులు తీవ్ర ఇబ్బందులకు గురిఅవుతున్నారని అన్నారు.ప్రభుత్వం ఎస్ సి బి సి సబ్సిడీ రుణాలు మంజూరు చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష వైఖరితో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సభ్యులు చల్లూరి అశోక్, నాయకులూ పగిది మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment