పాము కాటుతో మహిళా మృతి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్11 ; రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామంలో పాము కాటుకు గురై మహిళ మృతిచెందిందని రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కరెంటు పోవడంతో సోమవారం రాత్రి దీపం వెలిగించే క్రమంలో చౌదరి శారద (22) చేతిపై పాము కాటువేసిందని, రెబ్బెన ప్రాధమిక ఆరోగ్యకేంద్రానికి తరలించగా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బెల్లంపల్లికి అక్కడనుంచి మంచిర్యాల తరలించగా మంచిర్యాలలో డాక్టర్ అప్పటికే మృతి చెందినట్లు చెప్పారన్నారు. భర్త భీంరావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసిఫాబాద్ తరలించినట్లు తెలిపారు. రెబ్బెన మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, పాముకాటుకు మందులు అందుబాటులో ఉంటె తన భార్య బ్రతికేదని భర్త భీం రావు , బంధువులు రోదిస్తూ తెలిపారు.
No comments:
Post a Comment