Wednesday, 5 September 2018

ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు పెరిగిన వేతనాలను చెల్లించాలి

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 05 ; సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు పెరిగిన వేతనాలను వెంటనే చెల్లించాలని జిఎం రవిశంకర్ కు  బుధవారం ఏఐటీయూసీ బ్రాంచి అధ్యక్షుడు బోగే ఉపేందర్ వినతిపత్రాన్ని అందజేశారు అనంతరం మాట్లాడుతూ సింగరేణి సంస్థలో గత పదిహేను సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు పెరిగిన జీతాలను   అమలుచేయాలని కోరారు.  సింగరేణి లాభాల వాటిల్లో సెక్యూరిటీ గార్డులు  కీలక పాత్ర పోషించారని 2013 నుంచి హెచ్చించిన  వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.  వీరితో పాటు సాగర, అశోక్, శ్రీనివాస్,ఆంజనేయులుగౌడ్ రామ్ కుమార్  తదితరులున్నారు.

No comments:

Post a Comment