కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్16 ; తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన వి ఆర్ ఓ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రెబ్బెన మండల కేంద్రంలో 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ పాఠశాల కేంద్రంలో 183 మంది అబ్యదులకు 63 మంది, రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 300 మందికి 110, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 240 మందికి 82 మంది హాజరైనట్లు ఆయా కేంద్రాల చీఫ్ సూపెరింటెండెంట్లుతెలిపారు. రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ మూర్తి ఆధ్వర్యంలో ఎస్సై దీకొండ రమేష్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
No comments:
Post a Comment