కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 25 ; అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ స్టడీ సెంటర్ ను రెబ్బెనలోనే కొనసాగించాలని ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. మంగళవారం రోజున రెబ్బెన తహసిల్దార్ సాయన్నకు వినతి పత్రం ఇచ్చిన అనంతరం రవీందర్ మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాల నుండి రెబ్బెనలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ కొనసాగడం వల్ల సుమారు వేయి మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారని అన్నారు. రెబ్బెనలో స్టడీ సెంటర్ ఉండడం వల్ల రెబ్బెన,తాండూర్,బెల్లంపల్లి,మంచిర్యాల నుండి రెబ్బెన స్టడీ సెంటర్ లో అడ్మిషన్లు తీసుకున్నారని అన్నారు. యూనివర్సిటీ అధికారులు స్టడీ సెంటర్ ను రెబ్బెన నుండి కాగజ్ నగర్ కు తరలించడం వల్ల దూర ప్రాంత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ స్టడీ సెంటర్ ను రెబ్బెనలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో AISF జిల్లా కొశాధికారి కస్తూరి రవికుమార్,డివిజన్ ఉపాధ్యాక్షులు పర్వతి సాయి లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment