Tuesday, 4 September 2018

లబ్దిదారులకు నేరుగా పథకాల అందిస్తున్నతెరాస ప్రభుత్వం ; ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  సెప్టెంబర్ 4 ; తెలంగాణా ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ సంక్షేమ పథకాల  లబ్దిదారులకు నేరుగా పథకాల లబ్దిని అందిస్తున్నదని  ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఎమ్మెల్యే కోవ లక్ష్మీఅన్నారు. మంగళవారం   రెబ్బెన మండలం లోని కైర్ గాం నుండి నవేగాం గ్రామం వరకు కోటి ఎనభై లక్షలతో బిటి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాదారు.  ఉద్యమ పార్టీ నాయకుడుగా, ముఖ్యమంత్రి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ప్ర్రారంభించిన కళ్యాణలక్ష్మి, షాదిముబారక్, కెసిఆర్ కిట్, రైతు బందు, రైతు భీమా పథకాలను దేశంలోని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తినుకుంటున్నాయని అన్నారు. కార్యకర్తలే తెరాస పార్టీకి పట్టుగొమ్మలని అన్నారు. తెరాస పార్టీ నిబద్ధత కలిగిన పార్టీ అని  చెప్పింది  తప్పకుండ చేసి చూపిస్తుందని అన్నారు.కేవలం ఎలెక్షన్లలో గెలవడానికి ఎదో ఒకటి చెప్పి గెలిచినా తర్వాత ప్రజలకు  మొహం చాటేసే పార్టీ తెరాస కాదని అన్నారు.రాబోయే రోజులలో వితంతు పెన్షన్ తదితర పెన్షన్లు పెరిగే అవకాశమున్నాడని అన్నారు.పంట  పండించే రైతులు తమ పంటకు మద్దతు ధరరాక, పెట్టిన పెట్టుబడి కూడా రాని  పారిస్తుతులలో రైతులకు పంట పండించడానికి కావలసిన పెట్టుబడి సాయంకింద ఎకరానికి 4000 రూపాయలు రెండు పంటలకు కలిపి 8000 సహాయం అందిస్తున్నదని అన్నారు.   విపక్షాలు  తెరాస పార్టీ మీద అక్కసుతో నిరాధారమైన ఆరోపణలుచేస్తున్నాయనిఅన్నారు. కార్యక్రమంలో  ఎంపీపీ సంజీవ్ కుమార్, జడ్పీటీసీ అజమీర బాపు రావు, ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాదేక్షురాలు కుందారపు శంకరమ్మ, తెరాస మండల అధ్యక్షులు పోటు  శ్రీధర్ రెడ్డి,  నవీన్ జెస్వాల్. తెరాస  రెబ్బెన టౌన్ మహిళా అధ్యక్షురాలు మన్యం పద్మ,  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట్రావు, మరియు తెరాస నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment