కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్15 ; స్వచ్ఛతాహి కార్యక్రమంలో సింగరేణి ఉద్యోగులు ముందుండాలని జీఎం రవిశంకర్ అన్నారు. శనివారం బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటి బస్సు స్టాండ్ పరిసర ప్రాంతాలలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమానికి జీఎం కే రవిశంకర్ ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఆలా చేసినట్లయితేనే మనం భావి తరాలకు స్వచ్ఛ భారత్ ను అందించగలమని అన్నారు. హెల్త్ ఆఫీసర్ లలిత పరిశుభ్రత పైతీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో దఁగన్ పర్సనల్ జె కిరణ్, ఎస్ ఓ టూ జీఎం సాయి బాబా , ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ కృష్ణాచారి, సీనియర్ సేవ సభ్యులు సొల్లు లక్ష్మి, కుందారపు శంకరమ్మ, కమ్యూనికేషన్ సెల్ కో ఆర్డినేటర్ కుమారస్వామి ,డీపీఎం లు సుదర్శనం, రామశాస్ట్రీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు సింగరేణి ఆతాల విద్యార్థులు పాల్గొన్నరు.
No comments:
Post a Comment