Wednesday, 5 September 2018

క్రీడాకారులు కోల్ ఇండియా పోటీలలో ప్రతిభకనపరచలి ; జీఎం కె రవిశంకర్

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 05 ; క్రీడాకారులు ప్రతిభ కనపర్చి కోల్  ఇండియా పోటీలలో ప్రతిభకనపరచి సింగరేణికి పెరుతేవాలని జీఎం  కె  రవిశంకర్ అన్నారు.  బుధవారం బెల్లంపల్లి సింగరేణి ఏరియా డబ్ల్యూ పి  ఎస్ అండ్ జి ఏ  ఆధ్వర్యంలో  రెబ్బెన  మండలం గోలేటి  సి ఈ ఆర్ క్లబ్ లో ఏరియా లెవెల్ షటిల్, టేబుల్ టెన్నిస్ పోటీలు జీఎం  కె  రవిశంకర్ క్రీడా పతాకాన్ని ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ    క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి తో ఆడాలని అన్నారు. ఈ పోటీలలో ప్రతిభ కనపర్చి కోల్  ఇండియా పోటీలలో కూడా ప్రతిభకనపరచి సింగరేణికి పేరుతేవాలని అన్నారు. సింగరేణి సంస్థ కేవలం ఉత్పత్తే కాకుండా కార్మికులలో క్రీడాసక్తిని ప్రోత్సహహించడానికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నదన్నారు. మొత్తం 11 టీం లు ఈ పోటీలలో పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టూ జిమ్ కె  సాయిబాబా,  డిజిఎం  పర్సనల్ జె  కిరణ్, డి వై పి  ఎం  మరియు హానరరీ సెక్రటరీ జె రాజేశ్వర్, స్పోర్ట్స్ సూపర్ వైజర్  లు సౌందర్ రాజు, జాన్ వెస్లీ ,శ్రీనివాస్, రమేష్, కోఆర్డినేటర్ జి పి  చంద్ర కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment