కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్11 రాష్ట్రంలో అభివృద్ధిని చేసి చూపించిన పార్టీ తెరాస అని ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్, అన్నారు. మంగళవారం రెబ్బెన మండలం గోలేటి గ్రామ పరిధిలోని దుగ్గాపూర్, గోలేటి గ్రామాలలో సి సి రోడ్ పనులను ప్రారంభించారు. ఖైర్ గూడా గ్రామం వద్ద 5 కోట్లతో రోడ్ బ్రిడ్జి పనులను కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ మండలాన్ని దత్తత తీసు కొని గ్రామా గ్రామాన సి సి రోడ్లను వేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అని వర్గాల ప్రజలను సమ దృష్టితో అభివృద్ధి పరిచారని అన్నారు. గడచినా నాలుగేళ్లలో ఇప్పటి వరకు ఏ ప్రభుతం చేయని అభివృద్ధిని చేశామని అన్నారు. రాబోయే ఎన్నికలలో తెరాస పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎం ఎల్ ఏ కోవలక్ష్మి లు జడ్పీటీసీ అజమీర బాపు రావు, ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్, ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస్ రావు, తెరాస మండల సాధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి, తెరాస నాయకులూ బొమ్మినేని శ్రీధర్ కుమార్, మస్క రమేష్,రాజేశ్వర్, సంగం శ్రీను, సాంబ గౌడ్, వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment