
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన సెప్టెంబర్ 3 ; కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని మాజీ శాసనసభ సభ్యులు సి పి ఐ కార్యదర్శి గుండా మల్లేష్ అన్నారు. రెబ్బెన మండలం ఎడవెల్లిలో సోమవారం జరిగిన జిల్లా సీ పి ఐ కార్యవర్గ సభ్యులు సమావేసాయానికి ముఖ్య అతిధి గా పాల్గొని మాట్లాడారు. కేంద్రలో అధికారంలోఉన్న బీజేపీ పార్టీ గడచినా నాలుగున్నరేళ్లలో దేశ ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు. . ప్రధానమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేశారన్నారు. స్విస్ బ్యాంకు లో ఉన్న అవినీతి సొమ్మును దేశానికి తీసుకువచ్చి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామన్న మాటే మరిచారన్నారు. బీజేపీఅహకారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయన్నారు.ఆర్ ఎస్ ఎస్, భజరంగ్ దళ్ ల ఆగడాలు పెరిగాయన్నారు. ఇక రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లయినా ఎన్నికలముందు చేసిన వాగ్దానాలైన దళితులకు 3 ఎకరాల భూమి. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు వంటి హామీలను మరచి ప్రజలను మాయచేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సి పి ఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ, కార్యవర్గసభ్యులు ఎస్ తిరుపతి, జాడి గణేష్, రాయిలా నర్సయ్య, ప్రకాష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment