కొమురంభీం ఆసిఫాబాద్ సెప్టెంబర్ 18 ; రెబ్బెన ; మండలంలోని నంబాల గ్రామంలో చేపల వేటకు వెళ్లి ఎరుగటి పోషమల్లు(38) అనే వ్యక్తి మృతి చెందినట్లు రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం మృతిచెందిన వ్యక్తి , అల్లుడు రాజ్ కుమార్ ,మాంతయ్య లు చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లారు. నీరు ఎక్కువగా ఉండడంతో అందులో మునిగి చనిపోయినట్లు తెలిపారు. భార్య శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment