Tuesday, 11 September 2018

నిరుద్యోగులను, విద్యార్థులను వంచించిన తెరాసకు బుద్ధి చెప్పాలి ; ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం అశోక్ స్టాలిన్

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్11   నిరుద్యోగ విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి అవేమి చేయకుండా  వంచించిన  తెరాస అధినేత కెసిఆర్ కు తగిన బుడ్డి చెప్పాలని ఏ  ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం అశోక్ స్టాలిన్ అన్నారు. రెబ్బెన మండలం గోలేటి లోని అమరజీవి కొమురం బీమ్ ప్రాంగణంలో జరిగిన ఏ  ఐ ఎస్ ఎఫ్ కొమురంభీం జిల్లా ద్వితీయ మహాసభలకు ముఖ్య అతిధిగా  పాల్గొని మాట్లాడారు. అమరవీరుల త్యాగాలతో సిద్దించిన తెలంగాణా ను   కేవలం కెసిఆర్ కుటుంబ పాలనకే పరిమితం చేశారన్నారు. పార్టీ 5 సంవత్సరాలు పాలించమని అధికారమిస్తే సమస్యలను పరిష్కరించలేక ఇంకా 9 నెలల సమయం మిగిలి ఉండాగానే శాసన సభను రద్దు చేసి భాద్యతా రాహిత్యంగా పలాయనం చిత్తగించారన్నారు. ఎన్నికల ముందు చేసిన కే జి టూ పి  జి   ఉచిత విద్య, లక్ష ఉద్యోగాల భర్తీ, తదితర హామీలను గాలికి వదిలేశారని అన్నారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. 31 జిల్లాలకు పూర్తి స్థాయి  నియమించలేదని అన్నారు. అధికారంలోకి వస్తే ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి, పేదలకు డబల్ బెడ్ రూమ్ నులని చెప్పి, మోసగించిన కెసిఆర్ కు ప్రజలు రాబోయే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.  అంతకు ముందు ఏ  ఐ ఎస్ ఎఫ్  జిల్లా మాజీ నాయకులూ బోగే ఉపేందర్ శ్వేతాఅరుణ పతాకాన్ని ఎగుర వేసి మహాసభలనుప్రారంభించారు. ఈ సభలో ఏ  ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్, సి పి  ఐ పట్టణ  నాయకులు  బి జగ్గయ్య,  నాయకులూ బోగే ప్రకాష్, పూదరి సాయి, రవికుమార్, ఎన్  తిరుపతి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment