Wednesday, 5 September 2018

తెలంగాణ సాయుధ పోరాట యోధుని వర్ధంతి

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 05 ; తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మనుబోతుల కొమరయ్య ఇరవై రెండో వర్ధంతి సందర్భంగా రెబ్బెనమండలం  గోలేటి కేఎల్ మహేంద్ర భవనంలో ఏఐటీయూసీ  నాయకులు బుధవారం  ఘనంగా నివాళులు అర్పించారు. . ఈ సందర్భంగా ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం మాట్లాడుతూ మనుబోతుల కొమరయ్య  సింగరేణికి   కార్మికులకు ఎనలేని సేవలు  అందించారని  కార్మికుల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిన మహనీయుడని   కొనియాడారు. వారసత్వ ఉద్యోగాలు కుటుంబ పెన్షన్ లాభాల బోనస్ కార్మికులకు ఇరవై రెండు సంవత్సరాలకు అవగానే ప్రమోషన్లు క్యాడర్ స్కీములు సాధించడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప కార్మిక నేత అని అన్నారు. ఈ కార్యక్రమంలో గోలేటి బ్రాంచ్ ఉపాధ్యక్షులు బయ్య మొగిలి, ఆర్గనైజర్ కార్యదర్శులు జగ్గయ్య, కిరణ్ బాబు , సత్యనారాయణ, నాయకులు సాయి, మల్లయ్య, యుగేందర్, మూర్తి ,అశోక్,సాగర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment