కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 27 ; రెబ్బెన మండల కేంద్రంలోని రెబ్బెన ఆర్ట్స్ &సైన్స్ డిగ్రీ కళాశాల కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువును అక్టోబర్ 1 వరకు పెంచుతూ కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ జి వీరన్న ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రిన్సిపాల్ జాకీర్ ఉస్మాని, కో_ఆర్డినేటర్ పూదరి మల్లేష్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు తెలిపారు మండల కేంద్రంలోని రెబ్బెన ఆర్ట్స్ &సైన్స్ డిగ్రీ కళాశాల కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం లో నిర్వహిస్తున్న కోర్సులలో ప్రవేశానికి డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అంగన్వాడీ కార్యకర్తలు యువతీ యువకులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు
No comments:
Post a Comment