Friday, 21 September 2018

అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా దుర్గం రవీందర్

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 21 ;   అఖిల భారత విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభలు ఈ నెల 19 నుండి 21 వరకు రంగారెడ్డి జిల్లాలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని జాతీయ అధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన దుర్గం రవీందర్ ను ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన దుర్గం రవీందర్ మాట్లాడుతూ 2006 నుండి 2009 వరకు ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జిగా, 2009 నుండి 2013 వరకు రెబ్బెన మండల కార్యదర్శి గా, 13 నుండి 2015 వరకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సహాయ కార్యదర్శిగా, 2015 నుండి 2016 వరకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా, 2016 నుండి 2017 వరకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బధ్యతలు నిర్వహించి విద్యారంగ సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగిందని, జిల్లాల పునర్విభజన అనంతరం 2017లో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవడం జరిగిందని తెలిపారు. విద్యారంగ సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నందున రాష్ట్ర కార్యవర్గంలో రెండవసారి స్థానం లభించిందని అన్నారు. తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గానికి ఎన్నిక చేసినందుకు జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రెండవ సారి రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించడంతో తనపై మరింత బధ్యత పెరిగిందని అన్నారు.రవీందర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికవడంతో జిల్లా ఉపాధ్యాక్షుడు పూదరి సాయి,కొశాధికారి కస్తూరి రవికుమార్,డివిజన్ ఉపాధ్యాక్షులు పర్వతి సాయి,మండల అధ్యక్షుడు జాడి సాయి హర్షం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment