కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్19 ; రెబ్బెన మండల కేంద్రంలోని రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కాకతీయ దూర విద్య కేంద్రం నిర్వహించే వివిధ పి జి కోర్స్ లలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల కరెస్పాండంట్ శ్రీనివాస రాజు , ప్రిన్సిపాల్ ఎం ఏ జాకిర్ ఉస్మాని లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే డిగ్రీ పూర్తి చేసిన గ్రామీణ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రారంభించబోయే కోర్స్ ల వివరాలు ఎం ఏ సోషియాలజీ, రురల్ డెవలప్మెంట్, తెలుగు, ఇంగ్లీష్,, హిందీ, ఎం కామ్ లు ఉన్నాయని అన్నారు. అభ్యర్థులు ఈ నెల 27 లోపు దరఖాస్తులు పొందవచ్చని అన్నారు. పార్టీ వివరాలకు కోఆర్డినేటర్ మల్లేష్ ను చరవాణి ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.
No comments:
Post a Comment