Saturday, 1 September 2018

పశుసంవర్ధక , మత్యశాఖ ఆధ్వర్యంలో హరితహారం



కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  సెప్టెంబర్ 1 ;  రెబ్బెన మండలంలోని ఇందిరానగర్ , తుంగేడ   గ్రామాలలో పశుసంవర్ధక మరియు మత్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో యాదవ సోదరులకుమొక్కలు పంపిణి చేశారు. అనంతరం ఆ గ్రామాలలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ,  మండల పశు  వైద్యాధికారి సాగర్, మాజీ సర్పంచ్ పెసర వెంకటమ్మ, సింగల్ విండో డైరెక్టర్ పెసర మధునయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment