కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్19 ; రెబ్బెన మండల కేంద్రం లోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్యకేంద్రాన్ని బుధవారం వైద్య ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ ప్రభావతి, లెప్రసి మరియు ఎయిడ్స్ డైరెక్టర్ జాన్సన్ లు సందర్శించారు. ఆసుపత్రి రికార్డు లు, సిబ్బంది హాజరు పై విచారించారు. ఈ సందర్భంగా రెబ్బెన తెరాస నాయకులూ మోడెమ్ సుదర్శన్ గౌడ్, ,చెన్న సోమశేఖర్ లు రెబ్బెన ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రి గా చేయాలని, 24 గంటలు డాక్టర్ అందుబాటులో ఉండేటట్లు చూడాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులూ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment