కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 05 ; రెబ్బెన లోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు ఉన్నతపాఠశాలు మరియు పాఠశాలల లో బుధవారం గురుపూజోత్సవాన్నిరెబ్బెన మండల విద్యా వనరుల కార్యాలయంలో మండల విద్యాధికారి వెంకటేశ్వరస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. పులికుంట గ్రామంలోని మన్నెగూడ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బత్తుల సదానందం, నక్కలగూడ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్, పులికుంట కాలనీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఇందిరానగర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు డి రవికుమార్, ల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆయా పాఠశాలలలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలను బోధించి అందరిని ఆకట్టుకున్న్నారు. ఈ సందర్భంగా వక్తలు భారతరత్న శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని స్మరించుకొని ఆయన జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తన ఇరవైఒక్కటవ యేట ప్రొఫెసర్ గా తన ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి భారత ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఈ దేశానికీ సేవలందించడమే కాకుండా విద్యాసంస్కరణలపై దృష్టి పెట్టి పలు సూచనలు చేసారు. ఆయన సేవలను గుర్తించి ప్రతియేటాఆయన జన్మదినమైన సెప్టెంబర్ ఐదవ తారీఖున టీచర్స్ డే గ నిర్వహించుకుంటున్నామన్నారు. . ఈ కార్యక్రమాలలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment