కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన సెప్టెంబర్ 4 ; డెంగ్యు జ్వరాన్ని ప్రాధమికంగా గుర్తిస్తే ప్రాణాంతకంకాదు అని, డానికోసం మొబైల్ రక్త పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసి చికిత్స అందించాలని తెలంగాణా జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం రాష్ట్ర పర్యటనలో భాగంగా రెబ్బెనమండల కేంద్రములో పార్టీ జండా ఎగురవేసి మాట్లాడారు. వర్షాకాలం కావడంతో రాష్ట్రమంతటా విషజ్వరాల తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. డెంగ్యు జ్వరాలు రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో వ్యాపించాయన్నారు. తెలంగాణా ప్రభుత్వ ఉదాసీనతతో చాలామంది మృత్యువాత పడుతున్నారన్నారు. ఈ జ్వరాన్ని ప్రాధమిక స్థాయిలో నిర్ధారణ చేయడానికి మొబైల్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేయాలని కేంద్రప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రాష్ట్రాలకు సూచించిందన్నారు. కానీ తెరాస ప్రభుత్వం ముబైల్ పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చెయ్యకుండా తాత్సారం చేయడంతో, గ్రామాలలో ప్రజలు మృత్యువాత పడుతున్నారన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవాలన్నారు. ఏఈ కార్యక్రమంలో జె ఏ సి రాష్ట్ర నాయకులూ గురజాల రవీందర్, టి జాక్ ఆసిఫాబాద్ కన్వీనర్ రమేష్, పోడేటి సంజీవ్, జిల్లా కన్వీనర్ ప్రేమ్ కుమార్, మండల కన్వీనర్ గోగర్ల రాజేష్, రాపాల శేఖర్, బాలాకిషన్, ప్రవీణ్, రాజేష్, భీంరావు, బొడ్డు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment