Saturday, 1 September 2018

అధికారులు, కార్మికుల సహకారంతో కొత్త వ్యూహాలు

కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  సెప్టెంబర్ 1 ; నిర్దేశిత లక్ష్యాలను  అధిగమించడానికి  అధికారులు,  కార్మికుల సహకారంతో కొత్త వ్యూహాలను అమలుచేస్తామని  బెల్లంపల్లి  సింగరేణి ఏరియా జీఎం  కె రవిశంకర్ అన్నారు. శనివారం రెబ్బెన మండలం గోలేటి జీఎం   కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.  ఆగష్టు మాసంలో 490000టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 396043 టన్నుల ఉత్పత్తి సాధించడం జరిగిందని అన్నారు. ఏరియా లోని ఖైర్గుడ్ ఓ సీ  పి  లో 270000 టన్నులకుగాను 63 శాతంతో 168938 టన్నుల ఉత్పత్తిని, బి పి  ఏ  ఓ సీ  పి  2 లో 60000టన్నులకు 68 శాతంతో 40946 టన్నులు, దొర్లి ఓ సీ  పి  లో 160000 టన్నులకు 116 శాతంతో 186159 టన్నుల బొగ్గు  ఉత్పత్తి సాధించినట్లు పేర్కొన్నారు.  ఆగష్టు నెలలో కురిసిన భారీ వర్షాలతో లక్ష్యాలను సాధించలేకపోయామని అన్నారు. రాబోయే నెలలలో ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. ఏరియా లోని కార్మికులు కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఏరియాలో రిటైరయిన కార్మికులకు అదే రోజున బెనిఫిట్స్ అందేలా చూస్తున్నామన్నారు. కార్మికుల కుటుంబ సభ్యులకు టైలరింగ్, మోటార్ డ్రైవింగ్ కోర్స్ లను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టూ జీఎం సాయిబాబా, డీపీయం లు  రామశాస్ట్రీ, సుదర్శనం,  డిజిఎం  యోహాన్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment