కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 26 ; ప్రజలకు సంక్షేమ పథకాలను గడిచిన నాలుగేండ్ల నుండి ప్రవేశ పెడుతు అభివృద్ధిలో ముందుకు సాగుతుందని, తెలంగాణ ఉద్యమ పార్టీ ప్రజల కష్టాలు తెలిసిన పార్టీ తెలంగాణా రాష్ట్ర సమితి అని ఎమ్మెల్సీ పురాణం సతీష్, తాజా మాజీ ఎం ఎల్ ఏ కోవలక్ష్మి లు అన్నారు. బుధవారం .రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఇతర పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు భారీగా తెరాస పార్టీలోకి చేరిన వారిని ఎమ్మెల్యే కోవా లక్ష్మి,ఎమ్మెల్సీ పురాణం సతీష్ వారికీ తెరాస కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చేపట్టిన కల్యాణ లక్ష్మి పథకం, ఆసరా పింఛను, మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ,24 గంటల కరెంటు,విద్య,రోడ్ల సదుపాయం, రైతు బంధు పథకం ద్వారా ప్రతి రైతుకు ఎకరానికి 4 వేలు పంట పెట్టుబడి సహాయం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రజలందరికి తెరాస ప్రభుత్వం అండగా ఉందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కోవలక్ష్మి కి ఓటేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందజేస్తాము అన్నారు. గత ప్రభుత్వ పాలకులు ప్రజలకు ఇది చేస్తాం అది చేస్తాం అని మాటలు చెప్పి మభ్య పెట్టి ఓట్లు దండుకొని పదవిని అనుభవించేవారు తప్ప వారు ప్రజలకు, చేసింది ఏమి లేదని ఘాటుగా విమర్శించారు. ఇప్పడికి అభివృద్ధిని ఓర్వలేక ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తుంటే విపక్ష నాయకులు అభివృద్ధికి అడ్డుపడుతు తెరాస పై విమర్శలు చేస్తున్నారు అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అందులో భాగంగా ప్రతి గ్రామానికి రోడ్లు,నీటి సౌకర్యం తెరాస ప్రభుత్వం కలిపిస్తుంది అని అన్నారు. అదేవిదంగా గత ప్రభుత్వాలు ఏ రోజు ఆడబిడ్డ పెళ్లి కోసం ఆలోచించ లేదని నేడు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డ పెళ్లి కోసం లక్ష రూపాయలు అందజేస్తుంది అన్నారు.రైతులకు ఎకరానికి రెండు పంటలకు 8 వేలు పంట పెట్టుబడికోసం రైతు బంధు పథకం ద్వారా అందజేస్తున్నామని తెలిపారు. .ఈ కార్యక్రమంలో ఎంపిపి కర్నాధం సంజీవ్ కుమార్,జడ్పిటిసి అజ్మీర బాపురావు,టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాస్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శెంకరమ్మ, తెరాస పార్టీ మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి,నాయకులు చెన్నె సోమశేఖర్, రామన్న, పళ్ళ రాజేశ్వర్,వాస్, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment