కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్15 ; అఖిల భారత విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహసభలకు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ పిలుపునిచ్చారు. ఈ నెల 19,20,21 తేదీలలో రంగారెడ్డి జిల్లాలో జరిగే మహసభల పోస్టర్లను శనివారం రెబ్బెనలో ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ కేంద్రంలోబీజేపీ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు విద్య వ్యాపారీకరణ,కార్పొరేటికరణ,కాషాయీకరణను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో విద్యారంగానికి అనేక హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన పాలకులు హమీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసేందుకే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కెజి టూ పిజి ఉచిత విద్య హమీ అమలు చేయకుండా అసెంబ్లీని రద్దు చేసినకెసిఆర్ కు ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాక్షులు పూదరి సాయి, జిల్లా కోశాధికారి కస్తూరి రవికుమార్,డివిజన్ ఉపాధ్యాక్షులు పర్వతి సాయి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment