Friday, 11 August 2017

పోలీస్ అధికారులు పారదర్శకంగా విధులు నిర్వర్తించాలి ; జిల్లా పోలీస్ ఉన్నతాధికారి సన్ ప్రీత్ సింగ్


పోలీస్ అధికారులు పారదర్శకంగా విధులు నిర్వర్తించాలి  జిల్లా పోలీస్ ఉన్నతాధికారి సన్ ప్రీత్ సింగ్ 
 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 11 ;   కుమురం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ లు ప్రజలకు ఎల్లవేళలా ఆందుబాటులో ఉంటూ పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని జిల్లా పోలీస్ ఉన్నతాధికారి  సన్ ప్రీత్ సింగ్ అన్నారు.శుక్రవారం జిల్లాలో  స్పెషల్ బ్రాంచ్ ఇనస్పెక్టర్ గా విధులు నిర్వర్తించిన ఏ వెంకటేశ్వర్ కాగజ్ నగర్ టౌన్ సి.ఐగా,వాంకిడి సి.ఐగా విధులు  నిర్వర్తించిన ఎన్.ప్రసాదరావు  కాగజ్ నగర్ రూరల్ సి.ఐగా జిల్లా పోలీస్ కార్యాలయంలో  బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతు జిల్లాలో   శాంతిభద్రతలను కాపాడాలని,అందుకు  పర్యవేక్షణలో నూతన సాంకేతికతను సమర్ధవంతంగా ఉపయాగించుకోవాలని  సూచించారు.ఈ కార్యక్రమంలొ కాగజ్ నగర్ డిఎస్పి హబిబ్ ఖాన్,పరిపాలనాధికారి  ప్రహ్లద్, సీనియర్ అసిస్టెంట్ లు ఇంతియాజ్,సూర్య కాంత్,ఎస్పి సి.సి డి.శ్రినివాస్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment