Saturday, 19 August 2017

నూతన ఆధునిక విచారణ పద్దతులు అవలంబించడం యే నిజమైన పురోగతి - జిల్లా సన్ ప్రీత్ సింగ్

నూతన ఆధునిక విచారణ పద్దతులు అవలంబించడం యే నిజమైన పురోగతి - జిల్లా సన్ ప్రీత్ సింగ్

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 19 ;  కేసుల పురోగతి కోసం నూతన అదునిక విచారణ విధానాలు అవలంబించినప్పుడే నిజమైన పురోగతి కనిపిస్తుందని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.శనివారం స్థానిక AR హెడ్ క్వార్టర్ లోని పోలీస్ సమావేశ మందిరం లో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు,మొదటగా జిల్లా ఎస్పీ హరితహరం లో పోలీస్ లు నాటిన మొక్కల వివరాలు సబ్ డివిజన్ , సర్కిల్,పోలీస్ స్టేషన్ ల వారి గా పరిశీలించి నియమిత లక్ష్యం ను చేరుకునే విధంగా పని చేయాలని నాటిన మొక్కలను ఖచ్చితంగా సంరక్షించుకోవాలి అని సిబ్బందిని ఆదేశించారు.జిల్లా లో గణేశ్ ఉత్సవాలు, బక్రీద్ వంటి పండుగలు శాంతియుత వాతావరణం లో జరిగేలా 4 అంచెల భద్రత ను ఏర్పాటు చేయాలని   సమావేశం లో ఎస్పీ తెలిపారు అవి 1 స్టాటిక్ బందోబస్తు,2 సున్నిత ప్రాంతా లలో పికెట్ , 3మొబైల్ పార్టీ లను,4 స్త్రైకింగ్ ఫోర్స్. సున్నిత మైన ప్రదేశాలు గురుంచి ఎప్పటికప్పుడు సమా చారం తెలపాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు అంతేకాక అక్రమపశువుల సంత లు ఏర్పాటు చేసేవారిని, .అక్రమ రవాణా చేసేవారిని నిఘా తో అరికట్టాలని సూచించారు.రానున్న పండుగలకు జిల్లా మొత్తం ప్రణాళిక బద్దమైన పటిష్ట బందోబస్తు  ను ఏర్పాటు చేశామని తెలిపారు. 

No comments:

Post a Comment