శ్రామికుల హక్కుల సాధన ఏ ఐ టి యూ సి తోనే సాధ్యం : అంబాల ఓదెలు
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 30 ; శ్రామికుల హక్కుల సాధన ఏ ఐ టి యూ సి తోనే సాధ్యం అని ఏ ఐ టి యూ సి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబాల ఓదెలు అన్నారు. బుధవారం రెబ్బెన మండలం గోలేటిలోనే కేఎల్ మహేంద్ర భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధనకై నిరంతరం శ్రమించే కార్మిక సంఘం ఏ ఐ టి యూ సిమాతృసమేనని రాబోయే సింగరేణి కార్మిక ఎన్నికలలో అందరు తమ యూనియన్ నే సమర్ధించాలని కోరారు. ప్రస్తుతమున్న టి జి బి కే ఎస్ కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా ,వారసత్వఉద్యోగాలపై అవగాహనా రాహిత్యంతో వ్యవహరిస్తూ,జాతీయ యూనియన్లను తప్పుపట్టుతున్నాయని తెలిపారు. కార్మిక హక్కులకోసం పోరాడే ఏ ఐ టి యూ సి ని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి, ఖైర్గుడా పిట్ కార్యదర్శి జూపాక రమేష్, నాయకులూ జాడి తిరుపతి, సురేంకురి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment