Monday, 14 August 2017

ఉత్తమ కార్మికులను సన్మానించనున్న యాజమాన్యం

ఉత్తమ కార్మికులను సన్మానించనున్న యాజమాన్యం 
  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 14 ;  విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చి ఉత్తమ కార్మికులుగా ఎంపికైన కార్మికులను నేడు 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఏరియా జనరల్ మేనేజర్ కె.రవిశంకర్ పాల్గొని  అవార్డులు అందించి,సన్మానించనున్నారు.కాగా కైరీగూర ఓపెన్ కాస్ట్  నుండి ,ఈపీ ఆపరేటర్  కె.రమేష్,  ఎం. రాములు, ఎస్. రమణారెడ్డి ,ఎస్ గిరీష్ చంద్ర ,ఆర్ . శ్రీనివాస్ లను ఎంపిక చేసినట్టు డి వై పి ఎం బి. సుదర్శనం తెలిపారు బెల్లంపల్లి ఏరియా నుండి ఉత్తమ  ఎన్  సి  డబ్ల్యూ ఏ  ఉద్యోగులుగా  శ్రీ కోరుట్ల యాదగిరిని ఎంపిక చేసినట్టు తెలిపారు సెంట్రల్ ఫంక్షన్ కొత్తగూడెం లో  సి అండ్ ఎం డి   చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నారు గోలేటిలోని సింగరేణి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కుమారి జంగంపల్లి చందనను ఉత్తమ  మెరిటోరియస్ విద్యార్థినిగా  ఎన్నుకోవడం జరిగిందని గోలేటిలో జరుగు స్వతంత్ర వేడుకలలో ప్రశంస పత్రాన్ని అందచేస్తామని తెలిపారు.

No comments:

Post a Comment