బి ఆర్ అంబెడ్కర్ సంఘం మండల స్థాయి సమావేశం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 14 ; ఆసిఫాబాద్ లో జరుగు బి ఆర్ అంబెడ్కర్ సంఘం జిల్లా ప్రత్యేక సమావేశమునకు సన్నాహకంగా మండల స్థాయి సమావేశం సోమవారంనాడు రెబ్బెన లోని అతిధి గృహంలో జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ సమస్త దళితులూ,నేతకాని,మెహర్ ,బౌద్ధ ,మరియు వగలి బాంధవులు 19-08-2017 నాడు జరిగే జిల్లా ప్రత్యేక సమావేశమునకు హాజరై జయప్రదంచేయాలని కోరారు. ఈ సమావేశంలో లుంబిని దీక్షభూమి వార్షికోత్సవ కార్యక్రమం పై చర్చ మరియు ఎస్ సి వర్గీకరణపై నిరసన కార్యక్రమం కలెక్టరేట్ ముట్టడి మొదలగు కార్యక్రమంలను జయప్రదంచేయుటకై మండలం లోని దళిత బంధువు అందరు తప్పక హాజరు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ సెంటర్ కమిటీ అధ్యక్షులు అశోక్ మహార్కర్ ,సభ్యులు ఆత్మారాం పెరుగు, పుల్లయ్య కాంబ్లీ, వినీష్ ఉపిరి ,శ్యామరావు దుర్లే , జిమిది భగవాన్ ,దుర్గం సోమయ్య, డోంగ్రే రాంచందర్ ,దుర్గం విజయ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment