ఫిర్యాదు లపై తక్షణం స్పందించాలి-జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 28 ; పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదు పై తక్షణం స్పందించి బాధితులకు సాంత్వన చేకూరే చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఆదేశించారు, సోమవారం జిల్లా కేంద్రం లోని స్థానిక జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో జిల్లా ఎస్పి ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదు విబాగామునకు ఎక్కువగా భూ తగాదా సమస్యలు రావటం జరిగింది , ప్రజా ఫిర్యాదు లొ ఆసిఫాబాద్ కు చెందిన మొహమ్మద్ బారఖని మొహమ్మద్ బిన్ అహ్మద్ లు తాము నివాసం ఉంటున్న స్థలమును ఖాళి చేయాలి అని దౌర్జన్యము న కు దిగుతున్నారని ఫిర్యాదు ను జిల్లా ఎస్పి గారికి అందించింది మరియు ఐలవేని తిరుపతి చిర్రకుంట ఆసిఫాబాద్ గ్రామస్థుడు తమ యొక్క వారసత్వం గా వస్తున్న భూమి యొక్క పంపకం గొడవల వల్ల తమ యొక్క బందువులు అన్యాయము గా తమ పైన దాడి కు దిగుతున్నారని ప్రజా ఫిర్యాదులో జిల్లా ఎస్పి గారి కు ఫిర్యాదు ను అందించారు. ఫిర్యాదు ల పైన స్పందించిన జిల్లా ఎస్పి గారు ఫిర్యాదుల పై తక్షణం చర్య తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఎస్పి సీసీ దుర్గం శ్రీనివాస్ , ఎస్బి ఎసై లు శివకుమార్ ,ఎన్.ఐ.బి. ఎసై శ్యామ్ సుందర్,డిసీఆర్బీ ఎసై రాణాప్రతాప్ , జిల్లా పోలీస్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కేదార సూర్యకాంత్,ఇంతియాజ్ , పిఆర్.ఓ మనోహర్ లుమరియు ఫిర్యాదుల విభాగం అధికారిని సునీతగార్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment