కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 05; నవజాత శిశువులకు కన్నతల్లిపాలు వెంటనే తాగించాలని అవి ఎంతో శ్రేష్టకరమని గోలేటి ఎంపి టి సి శ్రీమతి మురళిబాయి అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్బంగా రెబ్బెన మండలం గోలేటిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. భగవంతుడు అన్నిచోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడని పురాణాలలో ఉందని . అలంటి అమ్మ విశిష్టతను సంవత్సరానికి ఒక్క రోజైన గుర్తుచేసుకోడానికి తల్లిపాలవారోత్సవాలు నిర్వహించుకుంటున్నాము తల్లి పాలలో లభించే పోషకాలు వలన రోగనిరోధక శక్తి లభిస్తుందని , ఎదిగే బిడ్డలకు కావాల్సిన అన్నీ తల్లిపాలలో సమృద్దిగా లభిస్తాయన్నారు. తల్లి పాలతో శిశువు వ్యాధి నిరోదక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈకార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మీ, హెల్త్ సూపర్ వైజర్ ఉమ, అంగన్‌వాడీ టీచర్లు ,స్వర్ణలత ,భాగ్యలక్ష్మి ,ఫుల్లవ, ,సుశీల ,విజయ , తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment