Sunday, 20 August 2017

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి ; జిల్లా పోలీస్ అధికారి

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి ;  జిల్లా పోలీస్ అధికారి 

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 20 ; గణేష్ ఉత్సవాలని ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్ పి  సన్ ప్రీత్ సింగ్ ఆదివారంనాడు సూచించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవడానికి పలు సూచనలు చేస్తూ నిర్వాహకులు ఈ క్రింది సూచనలను   తప్పకుండ పాటించాలని కోరారు.  గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని, రోడ్డు పైన ఇరుకుగాఉండే వివాదాస్పద ప్రాంత లలో మండపాలు ఏర్పాటు చేయవద్దు అని, గణేశ్ నవరాత్రి ఉత్సవ మండపం ను సురక్షిత మైన వస్తువుల తో నిర్మించుకోవాలని, జంతువులు వంటివి రాకుండా నిర్వాహకులు జాగ్రత్త పాటించాలి. మండపం లో నిర్వాహకులు లేదా వాలుంటీర్  లు ఎల్లపుడూ అందుబాటులో ఉం డి వారి ఫోన్ నెంబర్ రాత పూర్వకంగా గా స్థానిక పోలీసు స్టేషన్లో అందించాలి. బలవతంగా ఎవరి వద్ద చందాలు వసూలు చేయవద్దని, పెద్ద గణపతి విగ్రహాలు ఏర్పాటు చేసిన వారు భద్రత కారణాల దృష్ట్యా సీసీ కెమెరా లు ఏర్పాటు చేసుకోవచ్చు అన్నారు, విద్యుత్తు కు పెర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలని ,విద్యుత్ ప్రమాదం జరుగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి మండపం వద్ద పోలీసులు యొక్క పాయింట్ బుక్ ఉంచుకోవాలని ముందస్తుగా జిల్లా లో చేయు ర్యాలీ లకు,ఊరేగింపులు కు అనుమతి తప్పనిసరి పొందాలన్నారు, సుప్రీం కోర్టు డీ జే వాడకం పూర్తిగా నిషేధం వుననందున డీ జే వాడరాదని సాధారణ బాక్స్ టైప్ స్పీకర్ లను వాడాలని,పరిమిత డిసిబెల్ లను మించి సౌండ్ పెట్టవద్దు అని తెలిపారు. ముఖ్యముగా వందుతులను నమ్మవద్దు అని అలాంటివి ఎవరు అయినా ప్రచారం చేస్తే తక్షణం పోలీసులకు సమాచారం అందించాలి  అని ప్రజలందరూ సంతోష మైన వాతావరణం లో పండుగలు జరుపుకునే లా అందరూ పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. 

No comments:

Post a Comment