Friday, 18 August 2017

విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన సీపీఐ నాయకులు

 విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన  సీపీఐ నాయకులు 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 18 ;     రవీంద్రఖని రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తూ రైలు కింద పడి చనిపోయిన సాయికుమార్ అనే  విద్యార్థి తల్లిదండ్రులను,కుటుంబాన్ని సీపీఐ మాజీ శాసన సభ పక్ష నేత  గుండ మల్లేష్ శుక్రవారంనాడు రెబ్బెనకు  వచ్చి పరామర్శించారు.ఉన్నత చదువులు చదివి కుటుంబానికి అసరగా ఉంటాడు అనుకునే సమయంలో ఇలా జరగడం చాలా బాధకారమని అన్నారు.బాధిత కుటంబానికి భరోసానిచ్చారు.గుండ మల్లేష్ తో పాటు ఏఐటీయూసీ  జిల్లా అధ్యక్షుడు ఎస్.తిరుపతి,సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.జగ్గయ్య,గుండ మాణిక్యం,ఏఐఎస్ఎఫ్  జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్,ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్,మండల కార్యదర్శి రాయిళ్ల నర్సయ్యలు ఉన్నారు.

No comments:

Post a Comment